మిత్యాతాండా (నల్గొండ) లో 85 కుటుంబాల నుండి 445 మంది క్రైస్తవం నుండి తిరిగి హిందూ ధర్మ స్వీకరణ
తేది 15/08/2013, నల్గొండ జిల్లా , అడవిదేవరపల్లి మండలము :శ్రీ బాలు స్వామీ , శ్రీ ఉపేందర్ ల సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా అడవిదేవర పల్లి మండలము మిత్యా తాండా లో జరిగిన పునరాగమణ కార్యక్రమంలో చుట్టూ ప్రక్కల ఐదు తండాలకు చెందిన 85 కుటుంబాల నుండి 445 మంది సభ్యులు కైస్తవ మతం నుండి తిరిగి హిందు ధర్మాన్ని స్వీకరించారు .
ఈ కార్యక్రమం లో మాన్య శ్రీ గుమ్మల్ల సత్యం కేంద్ర సహా కార్యదర్శి విశ్వ హిందు పరిషద్ మార్గ దర్శనం చేస్తూ " భారత జాతి మూల వాసులైన గిరిజనులే చరిత్రలో హిందు దర్మం పై మహమ్మదీయుల దాడులు జరిగినప్పుడు ఎదురుతిరిగి పోరాడి తమ ప్రాణాలు సైతం త్యాగం చేసి హిందుత్వాన్ని కాపాడారు మీరు చరితార్త్రులు , మీలోని అమాయకత్వం , త్వరగా నమ్మే గుణం కారణంగా నేడు క్రైస్తవులు సులంభంగా తమ వైపు ఆకర్షించుకోగాల్గుతున్నారు , కాని నిప్పులాంటి మిమ్మల్ని వారు ఎంతో సేపు మబ్య పెట్టలేక పోయారు , బిర్సా ముందా , కొమరం భీం వంటి హైందవ యోధులైన మీ పూర్వీకుల రక్తం మీలో ఉన్నంత వరకు హిందుత్వానికి డోకా లేదు , తిరిగి అమ్మ వోడికి చేరిన మీ అందనరికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను " అని అన్నారు .
ఈ కార్యక్రమంలో విశ్వ హిందు పరిషద్ ధర్మ ప్రసార సమితి ప్రాంత అధ్యక్షులు మాన్య శ్రీ ఎల్లయ్య గారు , ఉపాధ్యక్షులు శ్రీ బుచ్చయ్య గారు , కోశాధికారి శ్రీ రామేష్ గారు , తదితరులు పాల్గొన్నారు . పునరాగానం చెందిన కుటుంబాలకు క్రొత్త బట్టలు , శ్రీ రాముని పొటోలు అందిచబడ్డాయి.
విశ్వ హిందు పరిషద్ ఆంద్ర ప్రదేశ్ సౌజన్యం తో
మిత్యాతాండా (నల్గొండ) లో 85 కుటుంబాల నుండి 445 మంది క్రైస్తవం నుండి తిరిగి హిందూ ధర్మ స్వీకరణ
Reviewed by JAGARANA
on
9:11 AM
Rating:
No comments: