Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

భారత దేశ ప్రతిష్ఠను పెంచిన ‘అగ్ని-5’క్షిపణి

  • - శంకర్‌రాయ్ చౌధురి
మధ్యశ్రేణి ఖంతాంతర క్షిపణి (ఐఆర్‌బిఎం) అగ్ని-5 ప్రయోగం విజయవంతం కావడం నిజంగా దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలను నింపింది. ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యమున్న ఈ క్షిపణి నిజంగానే మన దేశ ప్రతిష్ఠను ప్రపంచ దేశాల్లో ఇనుమడింపజేసింది. ఒరిస్సాలోని వీలర్స్ ఐలాండ్ నుంచి జరిగిన ఈ అద్భుత ప్రయోగం, భారత్‌ను అంతర్జాతీయ వ్యూహాత్మక క్షిపణీ సమాజంలో సభ్యురాలిని చేసింది. మన దేశాన్ని ఈ గ్రూపులోకి ఆహ్వానించినా లేక ఆహ్వానించకపోయినా ప్రపంచం తప్పనిసరిగా ఈ నిజాన్ని మనసులో సుస్థిరం చేసుకొని, సహజీవనం గడపాల్సిందే. భారత ప్రజల విషయానికి వస్తే అగ్ని-5 క్షిపణి విజయవంతం కావడం, వారిలో ఆనందాతిరేకాలకు కారణమయింది. లేకపోతే నిరంతరం కొనసాగుతున్న రాజకీయపరమైన ఖండనార్హ వైఖరులను భరించడం దేశీయంగా దాదాపు శాశ్వతమైపోయి ఉండేది. క్షిపణి ప్రయోగానికి సంబంధించిన ఆందోళన మాట అట్లావుంచితే, దేశీయంగా అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రతిభ, పచ్చికమైదానాలతో ఆకుపచ్చగా అలరారుతున్న విదేశాలకు,్భరత్‌లో దేశీయంగా అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంకా అందుబాటులోనే ఉన్నదన్న సంగతి మాత్రం సుస్పష్టం చేయడమే కాదు.. ఆ వాస్తవాన్ని అవి గుర్తించేలా చేసింది.
కానీ భారత్ తనలో వ్యక్తమవుతున్న ఆనందాతిరేకతను మరెంతకాలమో కొనసాగించడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఆసియాలో ఉన్న అత్యంత కఠినమైన వాతావరణం, భారత్ శాస్త్ర సాంకేతిక మరియు వ్యవస్థీకృత నిర్మాణ రంగాల్లో మరింత కష్టపడి ముందుకు కొనసాగాలన్న కఠోర వాస్తవాన్ని గుర్తు చేస్తున్నది. సమగ్ర స్వదేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణుల ఉత్పత్తిని సత్వరమే ప్రారంభించి సాధ్యమైనంత త్వరలో సైన్యానికి అప్పగించడం అత్యంత అవసరం. భారత వ్యూహాత్మక ఆయుధ సంపత్తి రక్షణ బాధ్యతను ఆయా సైనిక దళాలు నిర్వర్తిస్తున్నప్పటికీ, స్ట్రాటిజిక్ ఫోర్సెస్ కమాండ్ వాటిని ప్రయోగించే కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. అది సమీకృత రక్షణ మంత్రిత్వశాఖ సిబ్బంది కింద పనిచేస్తుంటుంది. ఇతర దేశాల్లో మాదిరిగా అది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్ట్ఫా కింద కాకుండా మనదేశంలో అది చీఫ్స్ ఆఫ్ స్ట్ఫా కమిటీ ఆధిపత్యంలో విధులను నిర్వర్తిస్తుంటుండటం విచిత్రం. ఇక్కడ మిగిలిన దేశాల మాదిరిగా మనం ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నిస్తే.. మనకు మాత్రమే పరిమితమయ్యే కారణాలను ఉదహరిస్తారు. జాతీయ భద్రత విషయానికి వచ్చినప్పుడు ఉన్నతస్థాయి నిర్వహణా వ్యవస్థలో ఉన్న లోటు పాట్లను సరిచూసుకోవడానికి అగ్ని-5 క్షిపణి మరో అవకాశం కల్పిస్తోంది. అసలు వ్యూహాత్మక దళాలపై, సమీకృత రక్షణ సిబ్బంది మాత్రమే నియంత్రణ కలిగి ఉంటారు. దురదృష్టవశాత్తు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన దగ్గరినుంచి కేవలం దాన్ని అపద్ధర్మంగానే ఉపయోగిస్తున్నారు తప్ప మరే విధంగా వినియోగించుకోవడంలేదు. ఇది కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న తంతు. మన త్రివిధ దళాలను సమన్వయ పరచడమే ప్రధాన విధిగా సమీకృత రక్షణ సిబ్బంది వ్యవస్థ ఏర్పాటయింది. ఇది జాతీయ స్థాయిలో వ్యూహాత్మక, ఆచరణాత్మక ప్రణాళికా రచనలకు ఇదే అత్యున్నత అథారిటీ. ప్రజల దృష్టిలో ఈ వ్యవస్థను, రక్షణ దళాలు ఏవిధంగా చూపినప్పటికీ..దూరదృష్టి లేకపోవడం, సర్వీసులో ఉన్న సైనికాధికార్ల మధ్య ఉండే పరస్పర సంకుచిత వ్యతిరేకతల వంటి కారణాల వల్ల ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్ట్ఫాను అత్యంత ముఖ్యమైన విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన విధులనుంచి పక్కన పెట్టడంతో, కేవలం అలంకార ప్రాయంగా మిగిలిపోయింది.
చట్టబద్ధంగా, తర్కపరంగా చెప్పాలంటే అగ్ని-5 క్షిపణులను, అవసరమైనప్పుడు ప్రయోగించడానికి వీలుగా భారత సైన్యంలోని వ్యూహాత్మక క్షిపణీ యూనిట్లకు కేటాయిస్తారు. మరికొన్నింటిని వ్యూహాత్మకంగా లక్ష్యాలపై దాడులు జరిపేందుకు వీలుగా వాయుసేనకు కేటాయిస్తారు. మానవచోదిత యుద్ధ విమానాల స్థానే వీటిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో చోటు చేసుకోబోయే మార్పులను భవిష్యత్తులో మన కళ్ళకు కట్టేవే. ఇప్పటికే ప్రచురితమైన వార్తలను బట్టి చూస్తే, అగ్ని-5 క్షిపణిని పూర్తిగా అభివృద్ధి పరచిన తరువాత, సిలో-బేస్, రోడ్-మొబైల్ కాన్ఫిగరేషన్స్‌లో మోహరించనున్నట్టు తెలుస్తోంది. అయితే మనం మరింత గర్వపడాల్సిన అంశమేమంటే, అగ్ని-5కు అవసరమైన మరిన్ని సంక్లిష్టమైన ఇతర పరికరాలు కూడా దేశీయంగానే తయారవనుండటం. ముఖ్యంగా వీటిల్లో చాలా భాగం ప్రైవేటు రంగం నుంచి ఉత్పత్తి కానుండటం మరో విశేషం. వీటిల్లో ముఖ్యమైనవేంటంటే, అగ్ని క్షిపణుల కోసం తయారు చేసే మొబైల్ మిస్సైల్ ప్లాట్‌ఫాంలు, క్షిపణిని నిలిపి, మోహరించి, రవాణా చేయడమే కాకుండా ప్రయోగించడానికి ఉపయోగపడే వాహనాలు వంటివి గణతంత్ర దినోత్సవం నాడు, బహిరంగంగా ప్రదర్శించారు కూడా. వీటన్నింటినీ పరిశీలిస్తే..ఈ రంగంలో మనం సాధించింది తక్కువేమీ కాదనేది సుస్పష్టమవుతుంది. సైన్యానికి అవసరమైన ఉపయుక్త సమాచారాన్ని సేకరించే ఇంటెలిజెన్స్,సర్వైవలెన్స్ ఉపగ్రహాలు, లక్ష్యాన్ని తెలుసుకోవడం, క్షిపణికి మార్గదర్శనం చేయడం, ఇతర సమాచార, మద్దతు వ్యవస్థలు వంటివన్నీ స్వదేశీయంగా తయారు చేయడం మనకు ఎంతో గర్వకారణం.
అణ్వాయుధాలను తొలిసారి ప్రయోగించరాదనేది భారత్ అణు విధానం. అయితే శత్రువులు తొలిసారి అణ్వస్త్రాలను ప్రయోగిస్తే..తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా భారత్ వెనుకాడబోదు. ఈ నేపథ్యంలో అగ్ని-5 క్షిపణిని అణ్వస్త్రాలను లేదా సంప్రదాయ ఆయుధాలను ప్రయోగించేందుకు ఉపయోగించవచ్చు. శత్రువులు తొలిసారి దాడి చేసిన స్వభావాన్ని బట్టి ప్రతిదాడిలో అగ్ని క్షిపణిని ఏవిధంగా ప్రయోగించడమనేది ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం అగ్ని-5కు అనుబంధంగా ఉన్న వౌలిక సదుపాయాలన్నీ, శత్రువు జరిపే తొలి దాడిని తట్టుకొని తిరిగి ఎదురుదాడి చేయడానికి అనువుగా ఉండాలి. ఆవిధంగా అత్యంత ముఖ్యమైన, విలువైన లక్ష్యాలైన నగరాలు, జనం అధికంగా ఉండే ప్రాంతాలు, వ్యూహాత్మక ప్రాంతాలుగా ఉన్న ‘కౌంటర్-్ఫర్స్’ లక్ష్యాలైన శత్రు సైనికులు అధికంగాగల ప్రాంతాలు, సంక్లిష్టమైన వౌలిక సదుపాయాల వంటి వాటిపై ప్రతీకారాత్మక దాడులు జరిపేందుకు సర్వం సిద్ధంగా ఉండాలి. మరి భారత్ పెద్ద ఎత్తున చేపట్టే ప్రతికార దాడులు ఎట్లా ఉంటాయి? ఈ ప్రశే్నకాదు,దీని అనుబంధ ప్రశ్నలు కూడా అడగాల్సి ఉంటుంది.
అగ్ని-5 క్షిపణి ప్రయోగం పాకిస్థాన్‌ను రెచ్చగొట్టింది. దీని ఫలితమే హతాఫ్-7 క్షిపణి ప్రయోగం. ఈ క్షిపణి మూడువేల నుంచి మూడువేల ఐదువందల వరకు దూరాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదని చెబుతున్నారు. అంటే భారత ఉపఖండంలోని మారుమూల ప్రాంతాలు సైతం దీని పరిధిలోకి వస్తాయి. అంతకు ముందు భారత్ ప్రయోగించిన ఖండాతర క్షిపణుల పరిధిలోకి పాకిస్థాన్‌లోని చాలా ప్రాంతాలు వస్తాయి. అయితే భారత్ ద్వీప కల్పం ప్రాంతం, ఈశాన్య భారత్‌లు మాత్రం పాకిస్థాన్ క్షిపణుల పరిధికి ఆవలే ఉన్నాయి. హతాఫ్-7 క్షిపణి ఇప్పటి వరకు ఉన్న సమతుల్యతలో మార్పులు తెచ్చింది. ముఖ్యంగా భారత్,పాకిస్థాన్, చైనా-పాక్‌ల మధ్య కొనసాగుతున్న వూహాత్మక సంబంధాల నేపధ్యంలో ఈ ప్రాంతంలో సమతుల్యతలో చాలా తేడా వచ్చిందనేని మాత్రం తిరుగులేని వాస్తవం.
చైనా డాంగ్ ఫెంగ్ (ఈస్ట్ విండ్) ఖండాంతర క్షిపణులను తయారు చేసింది. వీటి పరిధి ఎనిమిది వేల కిలోమీటర్లు. ముఖ్యంగా అమెరికా భూభాగంలోని పశ్చిమ తీర ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకునే చైనా వీటిని తయారు చేసింది. ఇక ‘షిప్ బస్టర్స్’లను కూడా తూర్పు/దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన అమెరికా కెరియర్ టాస్క్ఫోర్స్ దళాలను దృష్టిలో పెట్టుకొని చైనా రూపొందించింది. టిబెట్‌లో మోహరించిన డాంగ్ ఫెంగ్ క్షిపణులు, భారత ఉపఖండం మొత్తాన్ని తమ పరిధిలోకి తెచ్చుకోగలవు. అంతే కాదు బీజింగ్, షాంఘైలను లక్ష్యంగా చేసుకొని భారత్ ప్రతీకారాత్మక దాడులకు దిగుతుందన్న భయం అంతకు ముందు చైనాకు ఉండేది కాదు. ఆ భరోసాతోనే ఇప్పటివరకు ఉన్నది. అయితే పరిధిని పెంచడానికి వీలయ్యే అగ్ని- 5 క్షిపణి ప్రయోగంతో చైనా ధైర్యం పటాపంచలయింది. అప్పటి వరకు కొనసాగిన అసమతుల్యతను అగ్ని క్షిపణి తొలగించింది. ఇక డాంగ్ ఫెంగ్ ఆయుధ వ్యవస్థ పూర్తి స్థాయి పరిణితి చెంది ఉండగా, అగ్ని-5 క్షిపణి మాత్రం ఇంకా ప్రాథమిక స్థితిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే. అగ్ని క్షిపణిని తిరిగి సైనిక దళాలకు అప్పగించే స్థాయి రావాలంటే, మరిన్ని పరీక్షలు జరగాల్సి ఉంది. ఆవిధంగా అవసరమైన పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే సైన్యంలోకి ప్రవేశపెట్టడానికి వీలవుతుంది. అయితే అంతర్జాతీయ సమాజమని చెప్పుకునే, చైనా, దానికి తైనాతీలుగా ఉన్న పాక్ వంటివి, భారత్ ఆవిధంగా మరిన్ని పరీక్షలు జరపకుండా ఉండేందుకు తీవ్రస్థాయిలో వత్తిడి తీసుకొస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో వీటితోనే కాకుండా, తాను మిత్రులుగా భావిస్తున్న దేశాలతో కూడా భారత్ దృఢ వైఖరి అవలంబించడం తప్ప మరో మార్గం లేదు. ఇటీవలనే సీనియర్ నాయకుడొకరు, పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేస్తూ, ‘అగ్ని క్షిపణి’ శాంతి ఆయుధమని పేర్కొనడంలో ఎంతో అర్థం ఉంది. అగ్ని-5 యుద్ధానికి కావలసిన అతిముఖ్యమైన ఆయుధమని చెప్పక తప్పదు. శాంతి పరంగా మాట్లాడాలంటే, నిజంగానే అగ్ని అత్యంత శక్తివంతమైనన ‘శాంతి పరిరక్షకురాలు’ అని అర్థం చేసుకోవచ్చు
Source : AndhraBhoomi
భారత దేశ ప్రతిష్ఠను పెంచిన ‘అగ్ని-5’క్షిపణి Reviewed by JAGARANA on 9:07 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.