Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

హిందు వీరా లేవరా యువ హిందు వీరా లేవరా - VijayaVipanchi


హిందు వీరా లేవరా యువ హిందు వీరా లేవరా
మాతృభూమి పిలిచెరా నిను మాతృభూమి  పిలిచెరా 


ముజ్జగంబుల వినుతి కెక్కిన ముక్తిదాయిని మాతృభూమి
అన్న జ్ఞానములు  అవని కొసగిన ఆది ధరణీ వేద జననీ
బానిసత్వములోన మ్రగ్గగ దైన్య స్థితి ప్రాప్తించెరా
తల్లి కష్టము బాపరా నీ తనువు సార్ధకమగునురా 
|| హిందు వీరా||


పుట్టినాడవు పురుష సింహులు పుట్టిమెట్టిన పుణ్య భువిలో
విశ్వ హృదయము నేలినాడవు విమల ధర్మము  నిలిపినాడవు
మరువ బోకుము నీదు గతమును మరల విజ్రుంభిన్చరా
సాహసమ్మును చూపరా సింహ గర్జన చేయరా    
|| హిందు వీరా||


వేల్పులందరి వెలుగులన్నియు వెల్లివిరిసిన భారతాంబను
ఉజ్జ్వలంబగు ద్యేయనిష్ఠతో హృదయ పీఠము నందు నిల్పుము
నీదు ముక్తియు జాతి ప్రగతియు నిహితమైనవి మాతృ సేవలో
దేవి చరణములందు నీదు దేహ కుసుమము నుంచరా 
|| హిందు వీరా||

హిందు వీరా లేవరా యువ హిందు వీరా లేవరా - VijayaVipanchi Reviewed by JAGARANA on 3:04 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.