రక్షాబంధన సూత్రమిదే - హిందూ జీవన మంత్రమిదే - Vijaya Vipanchi
రక్షాబంధన సూత్రమిదే - హిందూ జీవన మంత్రమిదే
ఈ జగమంతా ఈశ్వర నిలయం - ఏకాత్మతయే సృష్టి రహస్యం ||రక్షా బంధన||
కార్మికులైనా కర్షకులైనా - పదవీ గౌరవ భాజనులైనా
భారతమాతా సంతానం - హిందువులంతా ఏక కుటుంబం ||రక్షా బంధన||
స్వార్థం, మోసం, పరమత ద్వేషం - హింసా, క్రౌర్య దానవ శక్తులు
పరోపకారం సమాన భావం - త్యాగం సేవా దైవీ శక్తులు ||రక్షా బంధన||
భోగవాదమును, భావ దాస్యమును - పరపీడనమును పారగ ద్రోలుము
సకల సంపదలు జగదీశునివే - అర్థ కామముల మూలము ధర్మము ||రక్షా బంధన||
దధీచి మహర్షి త్యాగ సంపద - రామకృష్ణుల దివ్య తపస్సు
గౌతమ శంకర కరుణాద్వైతం - వివేకవాణి విశ్వజనీనత ||రక్షా బంధన||
రక్షాబంధన సూత్రమిదే - హిందూ జీవన మంత్రమిదే - Vijaya Vipanchi
Reviewed by JAGARANA
on
11:10 AM
Rating:
No comments: