రక్షలే కట్టుకుందాం - ఈ రోజు దీక్ష గైకొని సాగుదాం - Vijaya Vipanchi
రక్షలే కట్టుకుందాం - ఈ రోజు దీక్ష గైకొని సాగుదాం
దీక్ష గైకొని సాగుదాం - ఈ రోజు రక్షలే కట్టుకుందాం ||దీక్ష ||
మనము పుట్టిన గడ్డ మహనీయమైనదే
మునులు దేవతలనే మురిపించు తావిదే
మన శక్తి లేమిచే - జవ సత్వములు బాసి
దిన దినము కృశియించి కృంగి పోవుచునుండ ||దీక్ష ||
తన సుఖము కొరకొరుల హింసించు ప్రవృత్తి
తనివి తీరగ జనుల పీడించు దుర్వృత్తి
మనము మన వారనే మాట మరచుట చేత
స్వ సమాజ సంక్షేమ మణగారి పోతుండ ||దీక్ష ||
ప్రేమానురాగాలు పంచుకుందాము
గాడానుబంధాలు కూర్చు కుందాము
కలిమిలో లేమిలో కలకాల మిలలో
చెలిమి విడనాడమని చేయి ముందుకు చాచి ||దీక్ష ||
రక్షలే కట్టుకుందాం - ఈ రోజు దీక్ష గైకొని సాగుదాం - Vijaya Vipanchi
Reviewed by JAGARANA
on
11:07 AM
Rating:
No comments: