హిందుత్వంలో అంటరానితనానికి తావులేదు : స్వామి కమలానంద భారతి
హిందుత్వం సార్వజనీయం, విశ్వమంతా సుఖ శాంతులతో నిండాలనే అణు క్షణం భగవంతున్ని కోరే విశాల హృదయం ఉన్న ధర్మంలో ఎట్టి పరిస్థితులలో అంటరానితనానికి తావులేదు, సమాజంలో చీలిక తెచ్చే ప్రయత్నాలను అడ్డుకోవాలి - శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి
సంగారెడ్డి, 29/07/2015 : సామజిక సమరస వేదిక - మెదక్ జిల్లా అధ్వర్యంలో సంగారెడ్డి పట్టణం లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో దేవాలయ పరిరక్షణ సమితి అద్యక్షులు శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామిజి పాల్గొని మార్గ దర్శనం చేసారు.
ఈ సందర్భంగా సామజిక సమరస వేదిక తెలంగాణ రాష్ట్ర సంయోజకులు మాన్య శ్రీ అప్పాల ప్రసాద్ గారు మాట్లాడుతూ ' అంబేద్కర్ ఆలోచనా విధానం సమాజంలో తప్పుగా ప్రకటితం అవుతుంది, హిందుత్వంలో ఉన్న ఆశ్ప్రుశ్యతను తీవ్రంగా ఖండిచారే కాని హిందుత్వాన్ని కాదు. మహా మనిషి అంబేద్కర్ ఇచ్చిన స్పూర్తిని మనం అందరం సమాజంలో ప్రతిభింబిచాలి. సమాజంలో కులాల, వర్గాల పేరుతొ మనసుల మధ్య విభేదాలను సృష్టించి తమ పబ్బం గడుపుకునే పరిస్థితి మారలి ' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కమలానంద భారతి స్వామి, శ్రీ అప్పాల ప్రసాద్ గారు, సంగారెడ్డి నగరంలోని అన్ని కుల సంఘాల పెద్దలు, పాల్గొన్నారు
హిందుత్వంలో అంటరానితనానికి తావులేదు : స్వామి కమలానంద భారతి
Reviewed by JAGARANA
on
9:33 AM
Rating:
No comments: