ధర్మ రక్షణే లక్ష్యం - సంఘటనే మార్గం : ముగిసిన VHP తెలంగాణ రాష్ట్ర శిక్షా వర్గ
చిల్కూరు, భాగ్యనగర్, 25-May-2015 : విశ్వ హిందు పరిషద్ - తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రతి సంవత్సరం తమ కార్యకర్తలకు కార్యక్షేత్రంలో పని దృశ్య శిక్షణ ఇచ్చే ప్రక్రియలో భాగంగా నిర్వహించే పది రోజుల శిక్షణా కార్యక్రమం " పరిషద్ శిక్షా వర్గ " భాగ్యనగర్ చిల్కూరు లోని " శ్రీ స్వామి నారాయణ గురుకులం " లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో విశ్వ హిందు పరిషద్ విభాగాలైన భజరంగ్ దళ్, దుర్గా వాహిని, మాతృ శక్తి మరియు వివిధ ఆయంల నుండి సుమారు 200 మంది కార్యకర్తలు వివిధ శారీరిక, బౌద్ధిక అంశాలలో శిక్షణ తీసుకున్నారు.
ఈ పది రోజుల శిక్షాణా కార్యక్రమం ముగింపు ఉత్సవం తేది 25-May-2015 నాకు 'శ్రీ స్వామి నారాయణ్ గురుకులం' మైదానంలో జరిగింది, ఈ కార్యక్రమానికి మాన్య శ్రీ గుమ్ముల సత్యం విహిప కేంద్రీయ సహా కార్యదర్శి (ధర్మ ప్రసార్) మార్గదర్శనం చేస్తూ ' సంస్థ యొక్క అసలైన బలం దృడ సంకల్పం గల కార్యకర్తలే, కార్యకర్తలు సమాజ పరివర్తన కోసం సమాజం తో పాటు వేగాన్ని అందిపుచ్చుకోవాలి, దానికి నిరంతర కృషి, సాధన మార్గ దర్శనం అవసరం అవుతాయి, ధర్మ రక్షణే ధ్యేయంగా - హిందు సంఘటన మార్గంగా మనం మని చేయాల్సిన ఆవసరం ఉంది' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త కార్యదర్శి శ్రీ సత్యం జి ప్రసంగించారు .విశ్వహిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి శ్రీ గోపాల్ జీ, క్షేత్ర సేవా ప్రాముఖ్ శ్రీ హనుమంత్ రావు గారు , ప్రాంత సంఘటన మంత్రి శ్రీ ఆకారపు కేశవరాజు గారు , ప్రాంత అద్యక్షులు శ్రీ మూసాపేట్ రామరాజు గారు ,ప్రాంత కార్యదర్శి శ్రీ మాదవరెడ్డి గాల్ రెడ్డి గారు , ప్రాంత బజరంగ్ దళ్ కన్వినర్ శ్రీ బాను ప్రకాష్ గారు , సుబాష్ గారు , ప్రాంత ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి గారు , శివరాములు గారు, ప్రాంత వివిధ ప్రాతాది కారులు , మొత్తం 500 పై చిలుకు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, మత్రుశక్తి , దుర్గ వాహిని , కార్యకర్తలు పాల్గొన్నారు
ధర్మ రక్షణే లక్ష్యం - సంఘటనే మార్గం : ముగిసిన VHP తెలంగాణ రాష్ట్ర శిక్షా వర్గ
Reviewed by JAGARANA
on
10:17 AM
Rating:
No comments: