మీ బైబిళ్ళను ఎవరూ తినరు !
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, చుట్ట ముట్టించుకోడానికి నిప్పు దొరికిందని ఇంకొకడు సంబరపడ్డాడట. ప్రపంచంలో ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా సర్వస్వం కోల్పోయి విషాదంలో కూరుకుపోయిన వారిని చూసి మత మార్పిడిలకు, బైబిళ్ళు పంచుకోడానికి భలే అవకాశం చిక్కిందంటూ సంబరపదిపోయే కిరస్తానీ ప్రచారకులను చూస్తే పై సామెతే గుర్తొస్తుంది.
ప్రపంచంలో క్రైస్తవ మిషనరీల ఒకే ఒక లక్ష్యం క్రీస్తు సందేశాన్ని వ్యాపింపజేయడం. ఆయన చేసిన ప్రబోధం ఈ ధరిత్రిపై ఉన్న ప్రతిఒక్కరికీ చేరేలా చూడటం కూడా వారి ప్రధాన కార్యక్రమం.
ప్రేమ, కనికరం, జాలి వంటి వాటి గురించి చాలా గొప్పగా బోధించే క్రైస్తవ మతం ప్రకృతి విపత్తులను తన స్వార్ధానికి వినియోగించుకోవడంలో ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంది.
ఏప్రిల్ 25, 2015న సంభవించిన నేపాల్ భూకంపం ఆ దేశాన్ని ధ్వంసం చేసింది. ప్రకృతి సృష్టించిన ఈ భయానక భీభత్సం పదివేల మందికి పైగా ప్రాణాలను బలిగొంది. లక్షలాది మంది క్షతగాత్రులైనారు. నేపాల్ ప్రజలు తమ సర్వస్వాన్నీ కోల్పోయారు. అయినా ఈ దుర్ఘటన జరిగి కొన్ని గంటలు కూడా కాకముందే ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ ప్రచారకులు నేపాల్ లో తమ ఆత్మల వేటలో పడ్డారు. మరి వారు "ఆత్మ రాబందులు" (సోల్ వల్చర్స్) కదా.
నేపాల్ లో భూకంపం సంభవించిన కొద్ది గంటల్లోనే విదేశాలకు చెందిన పాస్టర్లు, ధర్మోపదేశకులు ఏవిధంగా ట్విట్టర్ సందేశాలు ఇచ్చారో ఒక్కసారి పరిశీలించండి.
ఈ సందేశాలు పోప్ ఫ్రాన్సిస్ నుంచి ప్రారంభమయ్యాయి. ఆయన, మరి కొందరు క్రైస్తవ మతాధిపతులు ఇచ్చిన సందేశాలు:

‘‘వేదన మత మార్పిడికి పిలుపునిస్తోంది. ఇది మనలోని బాధ్యతను గుర్తు చేస్తోంది.’’
‘‘నేపాల్ మృతుల ఆత్మశాంతికి ప్రార్థన చేయాలి. కూలిపోయిన ఏ ఒక్క దేవాలయం తిరిగి నిర్మింపబడకూడదని, ప్రజలు క్రీస్తును స్వీకరించాలని ప్రార్థిస్తున్నాం.’’
‘‘ఈ సృష్టికర్త క్రీస్తు మాత్రమేనని అంగీకరించి ప్రార్థించి ఉన్నట్లయితే నేపాల్‌లో భూకంపం సంభవించేది కాదు.’’
‘‘నేడు సృష్టి విపరీతమైన వేదనను అనుభవిస్తోంది. కానీ భవిష్యత్తు ఆశ మాత్రం క్రీస్తులో మాత్రమే కనిపిస్తుంది.’’
"భూకంపం, మరణాలు - ఇవన్నీ మనం పతనమైన రాజ్యంలో నివసిస్తున్నామనడానికి ఋజువు. ఈ రాజ్యం క్రీస్తు పునరాగమనం తర్వాత పునరుద్ధరించబడుతుంది.’’
‘‘గత రాత్రి నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల సుమారు 15వందల మంది ప్రజలు మరణించారు. వీరిలో 99.5 శాతం మంది క్రీస్తు దరి చేరినవారు కాదు. చాలామంది ఒక్క సువార్తను కూడా వినే అవకాశం లేకుండా మృతి చెందారు.’’
‘‘పదిమంది యువకులను, ఇద్దరు పెద్ద నాయకులను నేపాల్‌లో సువార్తను వినిపించేందుకు మా చర్చి పంపుతోంది. అందుకు ఇదే సరైన తరుణం.’’
‘‘ఇప్పటికే మా మిషన్ వర్కర్లు అక్కడ ఉన్నారు. వీరు ప్రజలకు క్రీస్తులోని దైవత్వాన్ని గురించి బోధిస్తారు. నిజమైన దేవుడిని భారత్ ఇంకా గుర్తించాల్సి ఉంది.’’
"నిజానికి ఈవిధంగా చేయడం వారి విధి. మిషనరీలు తమ క్రీస్తు సందేశాన్ని ప్రజలకు చేరవేసి, వారిని తమ మతంలోకి మార్చడానికి ప్రయత్నిచడం సహజం. భగవంతుడి నిజమైన ప్రేమను, కనికరాన్ని ఒక వ్యక్తి పొందాలంటే..ముందుగా అతను క్రైస్తవుడై ఉండాలి. అప్పుడు మాత్రమే శాంతి, ప్రేమ లభిస్తాయి.’’
ఇవీ వారు పంపిన సందేశాలు.
మరి క్రీస్తు ఈర్ష్యాపరుడా? తన మతాన్ని స్వీకరించని వారు తన ప్రేమను పొందలేరా? మతమంటే వస్తుమార్పిడి వ్యవహారమా?
ఈరకంగా క్రైస్తవ ప్రచారకులు ప్రకృతి విపత్తును మతమార్పిడికి అనువుగా మలచుకోవడమనేది నేపాల్ లోనే జరగలేదు? ప్రపంచంలో సంభవించే ఏవిధమైన ప్రకృతి విపత్తు అయినా వారి కార్యకలాపాలను ఇట్టే ఆకర్షిస్తుంది.
2004 డిసెంబర్ 26 ఉదయం సునామీ సంభవించింది. భారత్, శ్రీలంక, ఇండొనేసియా తదితర దేశాల్లో సునామీ విపత్తువల్ల 2,34,000 మంది మరణించగా, మరికొన్ని లక్షలమంది నిరాశ్రయులయ్యారు.
అప్పుడు కూడా ఈ ‘క్రైస్తవ ప్రచారకులు తమ మత ప్రబోధాన్ని కొనసాగించారు!
‘‘భగవంతుడి గొప్ప ప్రేమను పొందడానికి ఈ విపత్తు అత్యద్భుతమైన అవకాశం,’’ అంటూ టెక్సాస్‌కు చెందిన గోస్పెల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు కె.పి. యోహనాన్ పిలుపునిచ్చాడు. అసలే కష్టాల్లో ఉన్న ప్రజలనుంచి వీరికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.
క్రైస్తవ మిషనరీలు తమిళనాడులో ఒక అనాధాశ్రమం ఏర్పాటు చేశారు. హిందూ మతానికి చెందిన 108 మందిని ఇందులో చేర్చుకున్నారు. ఇది వారిని మతం మార్చడానికే గాని వారికి ఆశ్రయం కలిగించడానికి కాదు.
క్రైస్తవ మిషనరీలు తమిళనాడులో ఒక అనాధాశ్రమం ఏర్పాటు చేశారు. హిందూ మతానికి చెందిన 108 మందిని ఇందులో చేర్చుకున్నారు. ఇది వారిని మతం మార్చడానికే గాని వారికి ఆశ్రయం కలిగించడానికి కాదు.
సునామీ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన 55 సభ్య సంస్థల్లో 22 ఆయా ప్రాంతాల్లో మానవతా సహాయం అందించడం కంటే తమ మత ప్రచారానికే అత్యధిక ప్రాధాన్యతనిచ్చాయి. సదరనన్ బాప్పిస్ట్ ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు, వరల్డ్ హెల్ప్, సమారితన్స్ పర్స్ అండ్ గోస్పెల్ ఫర్ ఆసియా వంటి మిషనరీ సంస్థల ద్వారా అమెరికా నుంచి పెద్ద మొత్తంలో నిధులు భారత్‌లోకి ప్రవేశిస్తుంటాయి. అయితే కొన్ని గ్రామాల్లో ప్రజలు మత ప్రచారకుల కార్యకలాపాలను అంగీకరించకపోవడంతో, ఆయా ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే మిషనరీలకు నిధులు రావడం నిలిచిపోయింది కూడా.
నేపాల్ భూకంపంలో పదివేల మందికి పైగా మరణించారు. కొన్ని వేలమంది గాయపడ్డారు. ఇక లక్షలమంది నిరాశ్రయులయ్యారు. మరి మిషనరీలు నేపాల్‌కు పంపిందేమిటో మీకు తెలుసా? లక్ష బైబిల్ కాపీలు! నేపాల్ ప్రధాని సుశీల్‌కోయిరాలా వీటిని చూసి,‘‘మీ బైబిళ్ళను ఎవ్వరూ తినరు!’’ అంటూ వాటిని తిరస్కరించారు.
అదీ సంగతి!
మరి "ఆకలితో అలమటించేవాడికి కావలసింది పట్టెడంత అన్నమే కాని మత బోధలు కావు" అన్న స్వామీ వివేకానందుని మాట ఏసుక్రీస్తు తమ అనుచరులకు చెప్పలేదేమో!?
మీ బైబిళ్ళను ఎవరూ తినరు !
Reviewed by rajakishor
on
7:13 AM
Rating:
No comments: