Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

విశ్వములోని ఏకత్వమే శివతత్త్వం


శివరాత్రి శివునికి ప్రీతికరమైన రోజు . త్రిమూర్తులలో శివుడు లయకారుడు. లయం అంటే అంతరించిపోవడం. అనగా ఈ అనంత విశ్వములోని ప్రతిదీ తమ అహంకార కారకములైన భౌతిక, బౌద్ధిక, మానసిక రూపములను వదిలి నిరాకారమైన అనంత తత్త్వంలో కలిసిపోవడం. ఈ ఏకత్వాన్ని సూచించేదే శివలింగము. ఈ లింగోద్భవము జరిగినది అర్థరాత్రి మాఘ బహుళ చతుర్దశి తత్కాల అమావాస్య నాడు. అమావాస్య ఐక్యానికి ప్రతీక. అమావాస్య నాడు చంద్రుడు కనబడడు. అమావాస్య అంటే కలిసి ఉండటం (అమా = యుగప్తు: వాస = కలిసి ఉండటం). ఖగోళశాస్త్రం ప్రకారం అమావాస్య నాడు సూర్యచంద్రులు కలిసి ఉంటారు. సూర్యుని యొక్క కాంతిలో మిళితమైపోవడం వల్ల ఆరోజు చంద్రుడు కనబడడు. పగలు సూర్యుడు కనిపిస్తాడు. కాని రాత్రి కనబడడు. సూర్యచంద్రులు తమ స్వస్వరూపములను వదలి ఒకదానిలోనొకటి ఐక్యమై అదృశ్యమైపోయే అర్థరాత్రి సమయం లింగోద్భవ కాలం. అది కూడా చతుర్దశి వెళ్ళిపోతూ అమావాస్య మొదలయ్యే క్షణాలలో. అంటే లయం కాబోయే క్షణాలలో కొద్దిగా ఒక సన్నని చద్రరేఖ ఉంటుంది. దీనిని సూచిస్తూనే పరమశివుడు సన్నని చంద్రరేఖను శిరస్సున ధరిస్తాడు. "కిశోర చంద్రశేఖరే ... " అని కదా శివతాండవస్తోత్ర ప్రస్తుతి.

లయకారుడైన శివుడు విశ్వములోని అభేదమునకు రూపము. సకల దేవీదేవతలూ ఆయనలో లీనమై ఉంటారు. అందుకే ఈ అభేదాన్ని స్మరిస్తూ మనం శివ ధ్యానం చెయ్యాలి. 

శైవోవైష్ణవో వా2పి యో వా స్యాదన్యపూజకః
సర్వ పూజాఫలం హన్తి శివరాత్రి బహిర్ముఖః
-- శివరాత్రిని విస్మరించి శివుని గాని విష్ణువుని గాని లేక మరే దేవతను పూజించినప్పటికీ ఫలితం శూన్యం అని 'ఈశ్వర సంహిత' చెప్తుంది.

కూర్మపురాణంలో వరాహ అవతారియైన విష్ణువు ఇలా అంటాడు:

అహం యత్ర శివస్తత్ర శివో యత్ర వసుంధరే
అహం తత్రాపి తిష్ఠామి ఆవయోర్నాంతరం క్వచిత్
శివం యో వందతే భూమే! స హి మామేవ వందతే
-- విష్ణువుకు, శివునికి భేదం లేదు. నేనెక్కడ ఉంటే శివుడు అక్కడ ఉంటాడు. శివుడు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. భూదేవిని ప్రార్థిస్తూ శివారాధన చేసినవారు విష్ణువును కూడా పూజించినట్లే.

యామేవ కేశవం దేవమాహు: దేవీ థాంబికా
-- భక్తులు నన్ను కేశవుడు, శివుదు, దేవి, అంబిక అనే నామాలతో పిలుస్తారు.

పరాత్పరం యాంతి నారాయణ పరాజనాః
నతే తత్ర గామిష్యన్తి యే ద్విషన్తి మహేశ్వరం
-- నారాయణుని పూజించినా, మోక్షప్రాప్తి పొందినా సరే శివ ద్వేషం పనికిరాదు.

ఇలా విశ్వములోని ఏకత్వ రూపుడైన ఆ పరమేశ్వరుని నిత్యం స్మరిద్దాం. 

విశ్వములోని ఏకత్వమే శివతత్త్వం Reviewed by rajakishor on 9:06 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.