చర్చిల భాగోతం
భారతదేశంలో కేథలిక్ చర్చి 500 సంవత్సరాలకు పైగా తన కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది. దేశమంతటా ఆ చర్చికి కొన్ని లక్షల కోట్ల విలువజేసే ఆస్తులున్నాయి.
"భారతదేశంలో చర్చి ఆస్థులపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలా వద్దా" అన్న విషయంపై చర్చించడానికి 2009 ఆగస్టులో గోవాలో ఆల్ ఇండియా కేథలిక్ యూనియన్ ఒక రహస్య సమావేశం జరిపింది. ఈ సమావేశం వివరాలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చేయిలే. ఈ సమావేశంలో పలువురు కేథలిక్ ప్రతినిథులు వెలిబుచ్చిన అభిప్రాయాలను బిషప్ లు వ్యతిరేకించడం గమనించదగ్గ విషయం. ఎన్నో లక్షల కోట్ల రూపాయల విలువ చేసే చర్చి ఆస్తులు బిషప్ ల ఆధీనంలో ఉండటం సరియైనది కాదని కేథలిక్ లలో కొన్ని వర్గాలవారి అభిప్రాయ పడుతున్నారు.
ప్రొఫెసర్ రెమీ డెనిస్, ఆల్ ఇండియా కేథలిక్ యూనియన్ అధ్యక్షుడు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆయన "భారతదేశ జనాభాలో క్రైస్తవులు 2.5 శాతం మాత్రమే. కాని భారతదేసంలోని చర్చిల ఆధీనంలో పెద్ద మొత్తంలో నిధులు, ఆస్తులు ఉన్నాయి. కానీ ప్రతి ఏటా దేశంలో చర్చిల ద్వారా పోగవుతున్న విరాళాల మొత్తం భారత నావికాదళం వారి వార్షిక బడ్జెట్ కి సమానం. భారత ప్రభుత్వం తరువాత అత్యధికులకు ఉద్యోగాలిస్తున్న సంస్థ కేథలిక్ చర్చి" అని అన్నారు.
ఎడ్వార్డో ఫెలిరో మాజీ కేంద్ర మంత్రి, గోవా ఎన్.ఆర్.ఐ. కమిషనర్. "ప్రపంచంలో అన్ని దేశాలలోని చర్చి వ్యవస్థలు అక్కడి ప్రభుత్వ చట్టాలకు లోబడి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఏ దేశంలోనూ, ఏ మత వ్యవస్థ కూడా సమాంతర రాజ్య వ్యవస్థలను నడపటంలేదు. భారతదేశంలోని చర్చిలకు సమకూరుతున్న నిధులు, ఆస్థులు, వాటిని చర్చిలు ఎలా వినియోగిస్తున్నాయి అన్న విషయాలపై పారదర్శకంగా ఉండే ఒక పటిష్టమైన ప్రభుత్వ చట్టం అవసరం. చర్చి వ్యవస్థ రాజ్యాధికారం చెలాయించడం కోసం కాదు. సేవా కార్యక్రమాలు చెయ్యడానికి. ప్రజాస్వామిక చట్టాలన్నీ దానికీ వర్తిస్తాయి. దేశంలోని అన్ని మత వ్యవస్థలూ ఒకే నియంత్రణలో ఉండాలి." అని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న కె.టి. థామస్ మాట్లాడుతూ "భారతదేశంలోని దాదాపు అన్ని మత వ్యవస్థలపై ప్రభుత్వ నియంత్రణ ఉంది. హిందూ దేవాలయాల ఆస్తుల వివరాలన్నీ కోర్టుల పర్యవేక్షణలో ఉంటాయి. సిక్కులకు సంబంధించి సిఖ్ గురుద్వారా యాక్ట్, ముస్లిం ట్రస్టుల కోసం వక్ఫ్ యాక్ట్ ఉన్నాయి. కోర్టుల విచారణలు జరిగితే చర్చి ఆస్తుల, ఖర్చుల వివరాలన్నీ బట్టబయలు అవుతాయనే భయంతో క్రైస్తవులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. బిలీవర్స్ చర్చి యాజమాన్యం కేరళలో 123 కోట్ల రూపాయల విలువ చేసే తోటను కొంది. ఈ చర్చికి గల ఖరీదైన ఆస్తులలో ఇదొకటి. ఈ చర్చి కేరళలో స్వంత మీడియా నెట్వర్క్ నడుపుతోంది కూడా. పార్లమెంటులో చట్టాలు చేయడం ద్వారా చర్చి ఆస్తులను ప్రభుత్వం సాదీనం చేసుకుంటుందని చాలా మందిలో అపోహ ఒకటి ఉంది. కానీ అది వాస్తవం కాదు. పార్లమెంటులో కాని, వివిధ రాష్ట్రాల శాసనసభలలో కాని అటువంటి చట్టాలు చేయడం సాధ్యం కాదు. దేశంలోని అన్ని మతసంస్థలకూ ఆస్తులను సంపాదించుకుని, వివిధ కార్యకలాపాల కోసం వాటిని వినియోగించే హక్కు ఉంది. అయితే ఆస్తుల నిర్వహణ విషయంలో ఎవరైనా చట్టానికి కట్టుబడి ఉండాల్సిందే" అని అన్నారు. థామస్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి.
గోవా వంటి రాష్ట్రాలలోని చర్చిలు తమ ఆస్తుల వ్యవహారాలను చూసుకొనేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు తమ ఆధీనంలో ఉండాలని ఈ సమావేశంలో పాల్గొన్న కొందరు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంలో భారతదేశంలోని చర్చిలకు అందుతున్న విరాళాలను, అవి పోగుచేసుకున్న ఆస్తులను అవి ఏ రకంగా వినియోగిస్తున్నారో ఒకసారి అవలోకిద్దాం.
1. జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో క్రైస్తవులు మూడు శాతం లోపే. కానీ ప్రతి ఏటా దేశంలో చర్చిల ద్వారా పోగవుతున్న విరాళాల మొత్తం భారత నావికాదళం వారి వార్షిక బడ్జెట్ కి సమానం. విరాళాల రూపంలో సేకరిస్తున్న ఈ డబ్బంతా ఏమౌతోంది? వాటిని వినియోగించే విషయంలో పారదర్శకత ఏది?
2. భారతదేశంలో అతి పెద్ద క్రైస్తవ సంస్థ అయిన కేథలిక్ చర్చి ఆధీనంలో పెద్ద మొత్తంలో వ్యవసాయేతర భూములు ఉన్నాయి.
3. భారత ప్రభుత్వం తరువాత అత్యధికులకు ఉద్యోగాలిస్తున్న సంస్థ కేథలిక్ చర్చి. ఈ ఉద్యోగాలన్నీ క్రైస్తవ మత ప్రచారం కోసమే.
4. భారతదేశంలోని చర్చిల ఆస్తులు ఎన్నో లక్షల కోట్ల రూపాయలలో ఉంటుంది.
5. తక్కిన ప్రపంచంతో పోలిస్తే ఒక్క రోమన్ కేథలిక్ చర్చికి భారతదేశంలో ఐదు రెట్లు ఎక్కువగా మత ప్రచారకులున్నారు.
6. ఈ చర్చిలకు విరాళాలు ఎలా వస్తునాయి, వాటిని వారు ఎలా ఖర్చు పెడుతున్నారు - విషయాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు.
7. మనదేశంలోని అగ్రశ్రేణి సంపన్నులైన ఎన్జీవో సంస్థలకు FCRA (Foreign Contribution Regulation Act) విరాళాలు అందుతున్నాయి. వాటిని ఈ సంస్థలు పెద్ద ఎత్తున మతమార్పిడి కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయి.
8. సంపన్న దేశాల ద్వారా, విదేశీ కంపెనీల ద్వారా చర్చిలకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరుతున్నాయి. ఆ నిధులు మన దేశంలోని క్రైస్తవ మత కార్యకలాపాలకు వినియోగిస్తారు. డబ్బును, ఉద్యోగాలను ఆశ జూపి ఎంతో మందిని వీళ్ళు మతం మారుస్తున్నారు. క్రైస్తవ మత ప్రచారకులు, సంపన్న దేశాల కార్పోరేట్ శక్తులు, కొన్ని రాజకీయ వర్గాలు కూడా ఈ కార్యకలాపాలలో భాగస్వాములు. ప్రభుత్వం జోక్యం చేసుకోడానికి వీలులేకుండా తాము సేకరించుకున్న వనరులు, కూడబెట్టుకున్న ఆస్తుల ద్వారా చర్చిలు మన దేశంలోని వివిధ వ్యవస్థలపై పట్టు సాధించాలని చూస్తున్నాయి. మన దేశంలోని సెక్యులర్ వర్గాలకు ఈ చర్చిల కార్యకలాపాలేవీ తప్పుగా కనిపించవు.
చర్చిల భాగోతం
Reviewed by rajakishor
on
9:17 AM
Rating:
No comments: