కడప: అయోధ్యలో భవ్య రామాలయం నిర్మించి తీరుతాం : విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ రాఘవరెడ్డి
ప్రతి ఏడూ దాదాపు 40 వేల మందిని మతమార్పిడి చేస్తూ ఉన్నారు, దీన్ని నివారించడానికి ప్రతి హిందువు ప్రతి నెల రూ 100 /- ధర్మ సేవలో అర్పించాలి. అయోధ్యలో భవ్య శ్రీ రామ మందిరం హిందుదేశ స్వాభిమాన చిహ్నం, దానిని ఎట్టి పరిస్థితిలో నిర్మించి తీరుతాం - శ్రీ రాఘవరెడ్డి విహిప అంతర్జాతీయ అధ్యక్షులు
తిరుపతి, డిసెంబర్ 14: అయోధ్యలో రామాలయం నిర్మాణంపై దృష్టి పెడతామని, ఇందుకు సంబంధించి కేంద్ర కమిటీతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి అన్నారు. విశ్వహిందూ పరిషత్ స్వర్ణ జయంతిని పురస్కరించుకుని తిరుపతి శాఖ ఆధ్వర్యంలో స్థానిక రామచంద్ర పుష్కరిణి వద్ద విరాట్ హిందూ సమ్మేళనంలో భాగంగా శ్రీరామ మహాయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాఘవరెడ్డి మాట్లాడుతూ గోవధ నిషేధం, 370 ఆర్టికల్‌కు సంబంధించి ఒక ప్రత్యేక చట్టం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో త్వరలోనే చర్చకు తీసుకువస్తారని అన్నారు. దేశ వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో ఆదాయం లేని, దూప దీప నైవేద్యాలకు నోచుకోని వంద ఆలయాలను విహెచ్‌పి దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉందన్నారు. ఆదాయం వచ్చే ఆలయాలను దేవాదాయ శాఖ ఉంచుకుని నిరాదరణకు గురైన ఆలయాలను తమకు అప్పగిస్తే, ఆలయాలు ఎలా ఉండాలో తాము నిర్వహించి చూపిస్తామన్నారు. హిందూ మత పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యతని దీనిని వారు గ్రహించాలన్నారు. మత మార్పిడులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించడానికి దృష్టి సారించాలన్నారు. ఏడాదికి 40 వేల మంది మత మార్పిడులు చేసుకుంటున్నట్లు విహెచ్‌పి గుర్తించిందన్నారు. ఈనేపథ్యంలో విహెచ్‌పిలో పూర్తికాలం పనిచేస్తే కార్యకర్తలతో ఈ మత మార్పిడిలను అరికట్టడానికి నడుం బిగిస్తుందన్నారు. వీరికి అవసరమైన జీతాలు ఇవ్వడానికి ప్రతి హిందువు వంద రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తారని ప్రజలు నరేంద్ర మోదీని ప్రధానిని చేశారని, ఆయన వారి ఆకాంక్షను నెరవేరుస్తారనే విశ్వాసం తమకు ఉందని రాఘవరెడ్డి తెలిపారు.
కడప: అయోధ్యలో భవ్య రామాలయం నిర్మించి తీరుతాం : విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ రాఘవరెడ్డి
Reviewed by JAGARANA
on
11:46 AM
Rating:
No comments: