సంగారెడ్డి: జీహాద్, లవ్ జిహాద్, మతమార్పిడ్లకు సరైన సమాదానం చెపుదాం - ప్రవీణ్ భాయి తొగాడియా
సంగారెడ్డి, 14/12/2014 : విశ్వ హిందు పరిషద్ స్వర్ణోత్సవాల కార్యక్రమాలలో భాగంగా స్థానిక విశ్వ హిందూ శంఖారావం కార్యక్రమం జరిగింది, స్థానిక కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ కార్యద్యక్షులు మాననీయ శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా ముఖ్య అధితిగా హాజరయ్యారు.
జిహాద్, లవ్ జిహాద్, బలవంతపు క్రైస్తవ మత మర్పిడ్లకు సరైన సమాదానం చెప్పాల్సి ఉంది, నేడు మన దేశం, మందిరం, గోవు, మహిళా, బడి మన మాన బిందువులు ఏమి సురక్షితంగా లేవు, ఈ పరిస్థితికి సంఘటనాత్మక హిందు శక్తితో సమాదానం ఇస్తాం - ప్రవీణ్ భాయి తొగాడియ
ఈ సందర్భంగా హాజరయిన ప్రజలనుద్దేశించి వారు మాట్లాడుతూ ' ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల సేవ, సురక్షా, సౌభాగ్యాల గురించి ఆలోచించే
సంస్థ విశ్వ హిందు పరిషద్, ప్రపంచం మొత్తం హిందుత్వమే ఉండేది, భారత్ లో, అరబ్ లో, ఆఫ్రికాలో, యూరప్ లో, అమెరికాలో నేడు క్రైస్తవుల పవిత్ర రోమ్ లో కూడా హిందుత్వమే ఉండేది, వేదం కాలం నుండి గత 3,000 సంవత్సరాల క్రితం వరకు విశ్వమంతా హిందుత్వమే నిండి ఉండేది, హిందువులే ఉండేవారు. ప్రపంచంలోని ఐశ్వర్యం అంతా హిందువుల దగ్గరే ఉండేది, ఆ ఐశ్వర్యం కోసమే విధర్మియ దోపిడీ దారులు, దురాక్రమణ దారులు ఈ దేశం పైన దండయాత్రలు చేసారు, ఇక్కడ ఉన్న నిజాం ఆలా వచ్చిన దోపిడీ దారుడే, బాబర్ దోపిడీ దారుడే, ఆఫ్హానీ దోపిడీ దారుడే, మీరే చెప్పండి ఎవరైనా దరిద్రుడి ఇంటిని దోచుకోవడానికి వస్తాడా ?, ప్రపంచ వ్యాపార సామ్రాజ్యం హిందువుల చేతులలో ఉండేది, మన పూర్వీకులు కస్టపడి సంపదను సృష్టించేవారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందుత్వం నేడు ఎక్కడ ఉంది, రోమ్ లో లేదు, ఆఫ్రికా, యూరోప్, అమెరికా లో లేదు, అతిపెద్ద సైన్యం ఉండికూడా నేడు కాశ్మీర్ లోయలో కూడా హిందువు సురక్షితంగా లేడు, పరిస్తితి ఇలాగే కొనసాగితే మన కుటుంబాలు సురక్షితంగా ఉండవు, మన ఇళ్ళు మన మహిళలు, మన మందిరాలు ఇలా ఏమి సురక్షితంగా ఉండవు, విశ్వమంతా ఉన్న హిందుత్వం నేడు కేవలం 40% మాత్రమే అయ్యింది, ఈ పరిస్తితి మారాల్సి ఉంది, ఒక హిందువుకు అన్యాయం జరిగితే 200 కోట్ల చేతులు స్పందించినప్పుడు ఎవరైనా హిందువుల పై చెయ్యేత్తే సాహసం చేయగలరా ? ఆలోచించండి. హిందుత్వం ప్రేమకు వ్యతిరేకం కాదు ఆమాటకొస్తే ప్రేమకు అతున్నత స్థానం కల్పించిది హిందుత్వం మాత్రమె కాని లవ్ జిహాద్ పేరుతొ హిందు అమ్మాయిలను ఏమార్చే ప్రయత్నం జరుగుతుంది, జిహాద్ కు, లవ్ జిహాద్ కు, క్రైస్తవ బలవంతతపు మాట మార్పిడ్లకు సరైన సమాదానం చెబుదాం" అని అన్నారు.
ప్రవీణ్ జి ఉపన్యాసాన్ని క్రింద వినొచ్చు :
Click Here to Download |
సంగారెడ్డి: జీహాద్, లవ్ జిహాద్, మతమార్పిడ్లకు సరైన సమాదానం చెపుదాం - ప్రవీణ్ భాయి తొగాడియా
Reviewed by JAGARANA
on
6:21 PM
Rating:
No comments: