మెదక్ : తిరిగి హిందుత్వం స్వీకరించిన 50 కుటుంబాలు - VHP కార్యకర్తల చొరవ
హిందుత్వంలో అంటరాని తనానికి చోటు లేదు ' నహిందు: పతితో భవేత్ ', హిందువులందరూ సహోదరులే, ప్రతి మనిషి జీవితంలోను దారి తప్పడం అనేది జరుగుతూఉంటుంది, అలా దారి తప్పిన మాత్రానా వారు మన వాళ్ళు కాకపోరు, తిరిగి వచ్చే ప్రతి వారి కోసం హిందుత్వం తలుపులు తెరిచే ఉంటాయి - గుమ్మాల సత్యం విహిప కేంద్రీయ సహా కార్యదర్శి
22/12/2014 , మెదక్ : మెదక్ జిల్లా చౌదర్ పల్లి గ్రామానికి చెందిన దాదాపు 50 కుటుంబాలు పునరాగమణ (ఘర్ వాపసి) కార్యక్రమం ద్వారా తిరిగి హిందు ధర్మాన్ని స్వీకరించారు, అనేకానేక కారణాల వలన గత కొన్ని సంవత్సరాల పూర్వం ఈ కుటుంబాలు క్రైస్తవం లోనికి మారాయి, కాని దూరపు కొండలు నునుపు అన్న విషయం కాల క్రమంలో అనుభవంలోకి వచ్చిన నేపథ్యంలో తమ మాతృధర్మ లోనికి తిరిగి రావాలని ఉన్నా ఎలా రావాలో తెలియని స్థితిలో స్థానిక విశ్వ హిందూ పరిషద్ కార్యకర్తలు చొరవ తీసుకుని వారికి మార్గ దర్శనం చేయడం జరిగింది. స్థానిక దేవాలయ ప్రాంగణం లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వాజిలు, విశ్వ హిందు పరిషద్ కేంద్రీయ సహా కార్యదర్శి మాననీయ గుమ్మాల సత్యం తదితరులు మార్గదర్శనం చేసారు.
ఈ సందర్భంగా గుమ్మాల సత్యం గారు మాట్లాడుతూ ' హిందుత్వంలో అంటరాని తనానికి చోటు లేదు ' నహిందు: పతితో భవేత్ ' అనే ద్యేయ వాఖ్యమే అందుకు నిదర్శనం, హిందువులందరూ సహోదరులే, ప్రతి మనిషి జీవితంలోను దారి తప్పడం అనేది జరుగుతూఉంటుంది, అలా దారి తప్పిన మాత్రానా వారు మన వాళ్ళు కాకపోరు, తిరిగి వచ్చే ప్రతి వారి కోసం హిందుత్వం తలుపులు తెరిచే ఉంటాయి' అని అన్నారు
మెదక్ : తిరిగి హిందుత్వం స్వీకరించిన 50 కుటుంబాలు - VHP కార్యకర్తల చొరవ
Reviewed by JAGARANA
on
8:12 AM
Rating:
No comments: