భాగ్యనగర్: 28న VHP హిందూ మహా సమ్మేళనం- అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియా హాజరు
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 28న ఆదివారం హైదరాబాద్‌లో హిందూ మహా సమ్మేళనం జరుగనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం 4 గంటల నుంచి జరిగే సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంరక్షకులు అశోక్ సింఘాల్, కార్య నిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా, అంతర్జాతీయ అధ్యక్షుడు జి రాఘవరెడ్డి హాజరవుతారని విహెచ్‌పి మీడియా సెల్ ఇన్‌చార్జీ భరత్ వంశీ తెలిపారు. అలాగే స్వామీజీలు పరిపూర్ణానంద, చిన్న జియర్, కమలానంద భారతిలతోపాటు మరికొంత మంది స్వామీజీలు పాల్గొని హిందూ సమాజానికి మార్గదర్శనం చేస్తారని చెప్పారు. సమ్మేళనంలో హనుమాన్ చాలీసా పారాయణం కోసం భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో 51 అడుగుల భారీ విగ్రహాన్ని తయారు చేయిస్తున్నామన్నారు. తయారీ పూర్తయిన అనంతరం ఈనెల 26న ఎన్టీఆర్ స్టేడియంలో విగ్రహాన్ని నెలకొల్పుతామని భరత్ వంశీ పేర్కొన్నారు. హిందూ మహా సమ్మేళనంలో హిందూ బాంధవులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
భాగ్యనగర్: 28న VHP హిందూ మహా సమ్మేళనం- అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియా హాజరు
Reviewed by JAGARANA
on
7:59 AM
Rating:
Reviewed by JAGARANA
on
7:59 AM
Rating:

No comments: