నీవు నేను హిందువైతే జీవితమ్మే ధన్యం
Click Here to Download |
నీవు నేను హిందువైతే జీవితమ్మే ధన్యం.
కులం పేరిట కలహమెందుకు కలిసి వుంటే భాగ్యము..
రాచపుండుల రేగుతున్నది అంటరానిభావము...
రాజకీయపు పావు అయినది నిమ్న జన కులవాదము...
ఎన్ని చట్టములున్నగానీ తొలగలేదీ దోషము..
అన్ని వైపుల పేద జనులకు జరుగుతున్నది మోసము !!
సహపంక్తి భోజనమారగించి ఒకటి చేసిన తత్త్వము..
సమరసత లోకానికెపుడో చాటినది హిందుత్వము..
శబరి ఎంగిలి ఆరగించిన రాముడేరా సాక్ష్యము..
అన్ని కులముల పూజలందిన అరుంధతె ఆధారము. !!
పరమతమ్ములో సమత గలదని మభ్యపెట్టే యత్నము..
హిందుమతమను చందమామలో మచ్చలెంచే కుతంత్రము..
ధనము చూపి దీఅంజనులను మతము మార్చుట దారుణం..
మనము ఒకటే..వేరు కాదని అనకపొవుటే కారణం..!!
బడుగు జీవుల బాధ బాపి తీర్చుకోర నీ ఋణం..
కడను వుంచిన సోదరులతో చెలిమి చేద్దామందరం..
కులము కన్న గుణము మిన్నని తెలిపిదినది మన ధర్మము..
హిందువులలో పతితుడెవ్వడు లేడు లేడని చాటుదాం...!!
రచన మరియు గాత్రం: అప్పాల ప్రసాద్
నీవు నేను హిందువైతే జీవితమ్మే ధన్యం
Reviewed by JAGARANA
on
12:28 PM
Rating:
No comments: