Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ముగిసిన విహిప ప్రాంత వర్షారంభ సమావేశాలు - స్వర్ణోత్సవాల నిర్వహణకు పిలుపు

07/07/2014, సంగారెడ్డి : విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంద్ర ప్రాంత స్థాయి వర్షారంభ సమావేశాలు తేది : 05/07/2014 నుండి 06/07/2014 వరకు రెండు రోజుల పాటుగా సంగారెడ్డి లో జరిగినాయి, పరిషద్ ఈ సంవత్సరం తన స్వర్ణ జయంతిని జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సమావేశాలను వేడుకగా జరపాలని బావించిన స్థానిక విశ్వ హిందూ పరిషద్ నాయకత్వం తగిన ఏర్పాటు చేయడం జరిగింది.

భారత మాత పునర్వైభవ ప్రాప్తికి ఇదే సరైన సమయం : శ్రీ రాఘవరెడ్డి గారు

సమావేశాల తోలి రోజైన 05/07/2014 నాడు విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ రాఘవ రెడ్డి గారు ప్రత్యేక అతిధిగా హాజరయ్యి

కార్యకర్తలకు మార్గదర్శనం చేసారు. ఈ సందర్భంలో వారు మార్గదర్శనం చేస్తూ " విశ్వ హిందూ పరిషద్ ఈ సంవత్సరం తో తన 50 ఏళ్ల ప్రస్తానాన్ని పూర్తీ చేసుకోబోతున్నది, గతంలో చేసిన పని ఒక ఎత్తు ఈ సంవత్సరం చేయాల్సిన పని ఒక ఎత్తు, పరిషద్ స్వర్ణ జయంతి సంవత్సరం జరుపుకుంటున్న సమయంలో మన ధర్మ జాగృతి పనిలో ఉండడం మన పూర్వ జన్మ సుకృతం, దేశంలో దాదాపు 90 కోట్ల హిందువులు ఉన్న ఈ దైవియ కార్యం కోసం ఆ భగవంతుడు మనల్ని ఎంచుకోవడంలోనే ఆ అంతరార్ధం దాగి ఉంది, ఈ అంశాన్ని మనం గమనించాలి, ఆ భగవంతుడు మన పై విశ్వాసం తో మన ముందు ఉంచిన లక్ష్యాన్ని కార్యదీక్షతో పూర్తీ చేసి ఆ భగవంతుని విశ్వాసాన్ని నిలబెట్టాలి, దేశంలో ఒక బృహత్తర మార్పు రాబోతున్నది, తిరిగి భారత మాత తన పరవ వైభవ స్థానంలో ఉండి విశ్వ గురువుగా ప్రపంచానికి మార్గ దర్శనం చేయబోతున్నది ఈ మార్పుకు మనమే వారధులం కావాలి, ఆ మార్పునకు ప్రత్యక్ష సాక్షులం కావాలి, మన కన్నులతో దేశ పునర్వైభవం చూడాలి, దాని కోసం దేశంలో ప్రతి గ్రామంలో విశ్వ హిందూ పరిషద్ జెండా ఎగరాలి, హిందుత్వం కోసం పరితపించే కార్యకర్తలను ప్రతి గ్రామంలోను నిర్మాణం చేయాలి, హిందూ సమాజం నేడు మన వైపు ఆశగా, అనేక ఆకాంక్షలతో చూస్తూ ఉంది, పరిషద్ తో కలసి పనిచేయడానికి హిందూ యువకులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు, మన పని కేవలం ఆయువ శక్తి మార్గదర్శనం చేయడమే ఈ లక్ష్య సాధన దిశలో మన మందరం కలిసి ఉద్యమ స్పూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది." అని అన్నారు.

పదం పదం కదం కదం కలిపి మహోద్యమం  నిర్మిద్దాం : శ్రీ సురేందర్ రెడ్డి గారు

విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంధ్ర ప్రాంత కార్యదక్షులు శ్రీ సురేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ " దేశంలోని అన్ని ప్రాంతాలు విశ్వ హిందూ పరిషద్ స్వర్ణ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాయి, ఈ క్రమంలో అనేక లక్ష్యాలు నిర్ణయించుకున్నాయి, మనం కూడా మన ప్రాంతంలోని ప్రతి ఉప మండల స్థాయిలో పూర్తీ స్థాయి విశ్వ హిందూ పరిషద్ సమితిలను నిర్మించాలి, ప్రతి గ్రామ స్థాయిలో ఎదో ఒక మార్గంలో పరిషద్ పని ప్రారంభం కావాలి " అని అన్నారు. 

ఈ సమావేశాలలో పరిషద్ కేంద్రీయ సహా కార్యదర్శి శ్రీ సత్యం జి, ప్రాంత అధ్యక్షులు శ్రీ రామరాజు గారు, ప్రాంత కార్యదర్శి శ్రీ గాళ్ రెడ్డి గారు, ప్రాంత ఉపాధ్యక్షులు శ్రీ దుర్గయ్య గారు, సహా కార్యదర్శి శ్రీ వ్యసరాజ్ గారు, సంఘటన మంత్రి శ్రీ కేశవ్ రాజు గారు, లతో పాటు గా అనేక మంది క్షేత్ర మరియు ప్రాంత స్థాయి అధికారులు రెండు రోజులపాటు సమావేశాలలో ఉంది మార్గదర్శనం చేయడం జరిగింది.  
ముగిసిన విహిప ప్రాంత వర్షారంభ సమావేశాలు - స్వర్ణోత్సవాల నిర్వహణకు పిలుపు Reviewed by JAGARANA on 10:10 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.