కేశవ్ కుంజ్ : కార్యకర్తల నిర్మాణంలో RSS కార్యశైలి ప్రపంచానికే ఆదర్శవంతం : జైనముని మహాశ్రమాన్
విపత్కర పరిస్థితులలోను నిలద్రోక్కునికి లక్ష్య సాధన దిశగా సమస్త సమాజాన్ని నడిపించగల క్షమత, కార్యకుశలత, ధ్యేయనిష్ట ఉన్న కార్యకర్తల నిర్మాణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యశైలి ప్రపంచానికే ఆదర్శవంతం - జైన ముని మహాశ్రమాన్ జిడిల్లి, కేశవ్ కుంజ్ 11/06/2014 : డిల్లీ లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయం కేశవ్ కుంజ్ లో జరిగిన తేరాపంథా జైన సమాజం ఆచార్యులు శ్రీ ముని మహా శ్రమాన్ గారు జైన సమాజాన్ని మరియు సంఘ్ స్వయం సేవకులను ఉద్యేశించి మార్గదర్శనం చేసారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ " సంఘ్ మరియు తేరాపంథా జైన సమాజం మధ్య ఎన్నో సంవత్సరాల నుండి మంచి సంబందాలు ఉన్నాయి, పంథా జైన ముని శ్రీ మహా సిద్దిజి మరియు స్వర్గీయ సర్ సంఘ్ చాలకులు సుదర్శన్ జి చాలా అన్యోన్నంగా ఉండేవారు, ప్రస్తుత సర్ సంఘ్ చాలక్ శ్రీ మోహన్ జి భాగవత్ గారు నేను కూడా అనేక సార్లు అనేక అంశాల పై కలసి పనిచేశాం, అనేక విపత్కర పరిస్థితులు మంచి పనులలో ఎదురౌతు ఉంటాయి, వాటిని కుశాగ్ర బుద్దితో దాటగల క్షమతను, అనుశాసనాన్ని మనం పెంపొందించుకోవాలి, ఒక సకరాత్మకమైన మార్గాన్ని అనుసరించే క్రమంలో ఉన్నత స్వాగతాన్ని , అధమ తిరసకారాన్ని ఓకే దృష్టితో చూడాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితులలో నిలద్రోక్కునికి మంచి ఫలితాన్ని తీసుకురావడం ఒక మంచి కార్యకర్త లక్షణం ఇలాంటి కార్యకర్తల నిర్మాణం లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యశైలి ప్రపంచానికే ఆదర్శవంతంగా నిలిచింది" అని అన్నారు
కేశవ్ కుంజ్ : కార్యకర్తల నిర్మాణంలో RSS కార్యశైలి ప్రపంచానికే ఆదర్శవంతం : జైనముని మహాశ్రమాన్
Reviewed by JAGARANA
on
11:58 AM
Rating:
Reviewed by JAGARANA
on
11:58 AM
Rating:

No comments: