Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

RSS పత్రికా ప్రకటన : భారత ప్రజాస్వామ్య శక్తిని ప్రపంచానికి చాటిన ఎన్నికలివి

నాగపూర్, 16-05-2014 : దేశంలో జరిగిన 16వ సార్వత్రిక లోకసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టి సంపూర్ణ మెజారిటి సాధించిన నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవహ ( జాతీయ ప్రధాన కార్యదర్శి ) మీడియా కు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసారు. 
శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఈ దేశ ప్రధాని గా బాధ్యత తీసుకోవడం ఇక లాంచనప్రాయమే, మాన్య అటల్ బిహారి వాజ్పాయి తరువాత దేశాన్ని ఏలే రెండో సంఘ్ స్వయం సేవక్ మోదినే


భయ్యాజి జ్యోషి ( సంఘ్ ప్రధాన కార్యదర్శి ) పత్రికా ప్రకటన :

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఈ ఎన్నికలను ప్రశాంతంగా ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా సౌహార్దపూరిత వాతావరణంలో పూర్తీ చేసుకుని మంచి ప్రజాస్వామ్య విలువలకు ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయమైన ఉదాహరణ గా చూపింది.
వేల సంఖ్యలో రాజకీయ నాయకులు, వందల సంఖ్యలో అభ్యర్థులు, లక్షల సంఖ్యలో రాజకీయ పార్టీల కార్యకర్తలు, అహర్నిశలు శ్రమించిన అధికార యంత్రాంగం, రక్షక బలగాలు, వివిధ మీడియా సంస్థలు దేశం సాధించిన ఈ విజయంలో నిర్మాణాత్మకమైన, భాధ్యతాయుతమైన పాత్ర పోషించడం ఆహ్వానించదగ్గ పరిణామం, ఎన్నికల నేపథ్యంలో అనేక సిద్ధంతా, విధాన పరమైన మరియు కొన్ని సార్లు వ్యక్తిగత ఆరోపణలు / ప్రత్యారోపణలు జరిగాయి, కొన్ని సార్లు ఇవి చాలా తీవ్రమైనవిగా ఉన్నాయి, వీటన్నిటిని మర్చిపోయి దేశంలో మరల సాదారణ వాతావరణం నిర్మాణం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు సకారాత్మక అడుగులు వేస్తాయని మేము ఆశిస్తున్నాము, ఆరోపణల - ప్రత్యారోపణల సమయం అయిపొయింది, ఇప్పుడు అందరు కలసి ఈ దేశం ఉన్నతి కోసం, దేశ ప్రజల సౌఖ్యం కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
కోట్లకొలది మంది ఓటర్లు దేశంలో మార్పు కోసం ఓట్లు వేసారు, క్రొత్త ప్రభుత్వం వారి ఆకాంక్షలకు అనుగూనంగా పనిచేయాల్సి ఉంది, త్వరిత గతిన ఫలితాలు చూపాల్సిన అవసరం ఉంది, పాత ప్రభుత్వానికి కార్యత్మిక, సైద్ధాంతిక, సామజిక అంశాలలో తేడా చూపాల్సి ఉంది. దేశ సమగ్రతను, దేశంలో సుస్థిరతను, ప్రతి చేతికి అభివృద్ధికి కావాల్సిన వాతావరణాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత క్రొత్త ప్రభుత్వానిదే.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నిర్మాణాత్మక పాత్ర నిర్వహించాల్సి ఉంటుందనే అంశంలో లేశమాత్రమైన అనుమానం లేదు, దేశంలో ప్రజాస్వామ్య విలువల పెంపుకు మా వంతు కృషి చేసాం, దేశంలో ఓటర్లలో ఓటింగ్ పట్ల వారి నకారాత్మక అభిప్రాయన్ని తుడిచి వారిని పోలింగ్ బూత్ వరకు తీసుకురావడంలో సంఘ్ స్వయం సేవకుల పాత్ర అద్వితీయం, ఇక అందరు కలసి దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపే పనిలో కార్యోన్ముఖులు కావాలని ఈ అంశంలో దేశంలోని సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలు, ప్రభుత్వ శాఖలు, అన్ని రాజకీయ పార్టీలు సకారాత్మక పాత్ర పోషించాలని అపెక్షిస్తున్నాను.

భారత దేశంలోని బాధ్యతాయుత పౌరునిగా క్రొత్త ప్రభుత్వానికి నా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నాను
- భయ్యాజి జ్యోషి

Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article. 
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here  
RSS పత్రికా ప్రకటన : భారత ప్రజాస్వామ్య శక్తిని ప్రపంచానికి చాటిన ఎన్నికలివి Reviewed by JAGARANA on 7:32 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.