మోడీ ప్రధాని అయితే దేశంలో జిహాద్ పెరుగుతుంది : షాయి ఇమాం
టిప్పు సుల్తాన్ వారసుడైన బార్కటి ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించే వ్యాక్యలను చేసారు.
నరేంద్ర మోడీ తో ఇబ్బందే, ఒకవేళ భాజపా అధికారంలోకి వచ్చి ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడం లాంటి RSS ఎజండా ను బయటకి తీస్తే అది నిజంగా దేశంలో జిహాద్ ను తీవ్రతరం చేయడమే అవుతుంది - షాయి ఇమాం
వివరాల్లోకి వెళితే :
గత మార్చి నెలలో మమత బెనర్జీ తో జరిగిన బేటిలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ కి వ్యతిరేకంగా పోటిచేయాలని మరియు నరేంద్ర మోడీ ని తీవ్రంగా వ్యతిరేకించాలని సూచించారు. మమత అతని మాటలతో ఏకీభవించడం తర్వాత కొంత నైపుణ్యాన్ని ప్రదర్శించడం చూస్తే మమత ఆయనకు రాజకీయాల్లో పెద్ద పీటమే వేసినట్టు తెలుస్తుంది.
బార్కటి కలకత్తా వీదుల్లో కొంత మంది రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ హేళన చేసి మాట్లాడటంతో వెక్కిరిస్తూ అతన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం భహిస్కరించడం కూడా జరిగింది. అంతటితో ఆగకుండా కారులో రోడ్ల మీద లాల్ బత్తి ఇమాం అంటు ఎరుపు ప్లకార్డులు పట్టుకు తిరగడం విశేషం.
బార్కటి నేను ఎప్పుడు కూడా CPM తో లేనని, కాంగ్రెస్ తో కలుద్దాం అనుకుంటే ఆ పార్టీ కూడా చాలా బలహీనంగా ఉందని చెప్పడం గమనార్హం. మమత బెనర్జీ లౌకికవాదం అనే కడుపులోంచి పుట్టారు కావున నేను ఆమెకే మద్దతు ప్రకటిస్తాను అని చెప్పారు. నేను ఆమెకు నియంతృత్వ దళాలకు వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పాను. ఆమె ఇప్పడు అదే చేస్తున్నారని అన్నారు.
గత ఎన్నికల్లో నేనే ఆమెకు విజయం చేకురేలా చేశాను. ఈసారి ఆమె పార్టీ నాయకులే నా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో 70 వేల మసీదులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అక్కడ నా ఆదిపత్యం చాలా స్పష్టంగా కనపడుతుందన్నారు. ఇదిలా ఉంటే ఇతర నాయకులు మాత్రం అది నిజం కాదని వాపోతున్నారు.
అతను TMC కి చాలా దగ్గరి సంబంధం కల్గి ఉన్నాడు కాబట్టి మమత అతని మాటలు వినొచ్చు. కాని ఎవరు కూడా ఆయన అన్నట్లు ఓటు వేయడానికి సిద్దంగా లేరు అని ఒక ప్రముఖ రాష్ట్ర నాయకుడు చెప్పడం విశేషం.
మనం హిందుస్థాన్ ని 1,౦౦౦ ఏండ్లు పరిపాలించాం అన్న విషయాన్ని మీరు తప్పక గుర్తించుకోవాలి. కాని మనం బ్రిటిషు వారిలాగా హిందువులను బానిసలుగా చేయలేదని వాపోయారు.
కాని నరేంద్ర మోడీ తో మాత్రం భయం ఉందని హెచ్చరించారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి RSS సిద్దాంతాలను అమలు చేసి, ఉమ్మడి పౌర స్మ్రుతిని అమలులోకి తీసుకు రావడం, మనల్ని ప్రార్ధన చేయకుండా ఆపడం వంటివి చేస్తే అది నిజంగా జీహాద్ ను ఇంకా తీవ్రతరం చేయడమే అవుతుందని చెప్పారు.
మూలం : హిందుస్తాన్ టైమ్స్
ఫోటో మూలం : హిందూ అధివేషణ్
స్వేచ్చానువాదం : శ్రీ నరేష్ గారు
Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article.
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here.

Reviewed by JAGARANA
on
7:05 AM
Rating:
No comments: