బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులను నియంత్రించే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా?
బంగ్లాదేశ్ మన దేశంతో గల సరిహద్దు రక్షణ విషయాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. బంగ్లాదేశ్ విదేశీ కార్యదర్శి హిమాయతుదం అసలు మీ దేశంలో టెర్రరిస్టుల స్థావరాలు అసలే లేవు అని, కాని ఆ దేశ ప్రభుత్వమే అనవసరపు మాటలతో ప్రజలను మభ్య పెడుతుందని వాపోతున్నారు. వీరి వాదన చూస్తుంటే దేశ సమగ్రత మరియు భద్రత ఆందోళనకరంగా, ప్రమాదంగా మారినా కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా లేదు.
అస్సాంలోని 120 అసెంబ్లీ స్థానాల్లోని 56 స్థానాలలో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు ఉన్నారంటే ఎంత పెద్ద మొత్తంలో మన దేశంలో వారు చొరబడ్డారో అర్ధమవుతుంది.
పశ్చిమ బెంగాల్ లోని మార్కిస్టులు ఈ అక్రమ చొరబాటుదారులను తిరిగి మన దేశం నుండి తరిమికోట్టాల్సింది పోయి ఓటు బ్యాంకు రాజకీయలకోసమని వాళ్ళను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. అస్సాం కాంగ్రెస్ ముఖ్య మంత్రి తరుణ్ గొగోయ్ తన రాజకీయ సౌలభ్యం కొరకు చొరబాటుదారులను వెనకేసుకోస్తున్నారు. నేడు మన దేశంలో 2 కోట్ల వరకు అక్రమంగా చొరబడ్డవారిలో 60 లక్షల మంది అస్సాం లోనే మకాం వేసారంటే ఆ రాష్ట్రం ఏ స్థాయిలో ప్రమాద అంచున ఉన్నదో ఊహించవచ్చు. సోనియా గాంధీ సహకారంతో తరుణ్ గొగోయ్ వీరికి మరింత చేరువయ్యి అందరికీ ఓటు హక్కును కల్పించిన తీరు దేశ చరిత్రలోనే చీకటి పర్యాయం.
చొరబాటుదారులకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ పాలకులు
కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ , రాష్ట్ర హోం మంత్రి సత్య ప్రకాష్ జైస్వాల్ లు అక్రమ చొరబాటుదారులకు ఏదో అన్యాయం జరిగిపోయినదంటు నానా హంగామా సృష్టించుతున్నారు. కనీస మానవత్వంతో చూసిన కూడా దేశ ద్రోహులకు ఈ దేశంలో జీవించే హక్కే లేదు. కొంత మంది పరిశోధకులు, పండితులు చొరబాటుదారుల గూర్చి అధ్యయనం చేసి పార్లమెంట్ కి పంపిన కూడా ప్రయోజనం లేకపోయింది. ఇదే సంఘటన బంగ్లాదేశ్ లో జరిగి ఉంటే మన దేశం యెడల తన తీరు ఎలా ఉండేదో ఒక్క సారి ఆలోచించండి.
272 కి.మీ ల మేర అస్సాం కి దగ్గిరలో బంగ్లాదేశ్ తో మన సరిహద్దు కు కనీసం దడి(fence) కూడా లేదు
స్వర్గీయ జనరల్ సిన్హా అస్సాం గవర్నర్ గా ఉన్నపుడు బంగ్లాదేశి అక్రమ చొరబాటుదారుల గూర్చి పూర్తి నివేదికను సిద్దం చేసారు. తర్వాత గవర్నర్ పదవి చేపట్టిన అజయ్ సింగ్ కూడా రోజు 6000 మంది అక్రమంగా మన దేశంలో చొరబడుతున్నారని గట్టిగా వాదించారు. ఏటా 3000 మంది అక్రమ మార్గాన చొరబడ్డవారిని తిరిగి బంగ్లాదేశ్ కు తరిమేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర హోం మంత్రి వర్గం మాకు ఇది చేత కాదు అన్నట్టు పక్కకు తప్పుకోవడం ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం.
మన దేశ సరిహద్దుల వద్ద నేరస్థులు, స్మగ్లర్స్ మరియు తీవ్రవాదుల స్థావరాలున్నాయి. వారికి దేశ ద్రోహ పోలీసులు, కొంత మంది ఏజెంట్లు, రాజకీయ నాయకులే కొండంత అండ. దానితో వాళ్ళు వందల కి.మీ మేర మన దేశంలో చొచ్చుకు వస్తున్నారు. దాదాపు 272 కి.మీ వరకు బంగ్లాదేశ్ తో అస్సాం వద్ద కనీసం దడి కూడా లేదు.
అక్రమ మార్గంలో గంజాయి, అయుదాలను మావోయిస్టులకు సరఫరా చేస్తున్న చొరబాటుదారులు
అస్సాంలోని బారక్ లోయ మరియు పశ్చిమ బెంగాల్ లోని సరిహద్దు జిల్లాలలో అక్రమంగా చొరబడ్డ తీవ్రవాదులు విద్వంసం సృష్టిస్తున్నారు. ఇస్లాం గూర్చి ఎడతెరిపి లేకుండా ప్రచారంతో విసిగిస్తుండటంతో స్థానిక ప్రజలు ఇబ్బందుల్ని ఎదుర్కోలేక అక్కడి నుండి ఖాళి చేసి వేరే ప్రాంతానికి వెళ్ళి పోతున్నారు. ఇదంతా అక్కడి మార్కిస్టుల సహాయంతో అక్కడి అమాయక హిందువులపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి. దానితో వారి భూముల్ని స్వాదినం చేసుకొని అందులో అక్రమంగా గంజాయిని పండిస్తూ మావోయిస్టులకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ ఆయుదాల సరఫరాకి అంతే లేకుండా పోతుంది.
మైనారిటిలను హెచ్చరించే సత్తా కాంగ్రెస్ కు ఉందా?
మైనారిటిల తీరు పట్ల కాంగ్రెస్ ఉదాసీనత క్షమించరానిది. అస్సాంలోని కొన్ని జిల్లాల్లో అక్రమ చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడుస్తున్నాయి. దిబృగాద్ లోని ’ చిరాంగ్ చాపోరి యువ మోర్చా ‘ చొరబాటుదారుల ఆర్ధిక పరిమితుల మీద షరతులు విదించాలని, వారికి ఉద్యోగాలు కల్పించకూడదని గట్టిగా ప్రభుత్వాన్ని కోరింది. దానితో చొరబాటుదారులు దుబడి, గోల్పార, కొకారజార్ మొదలగు జిల్లాల వైపు వెళ్ళి అక్కడే అధిక సంఖ్యలో నివాసాలు ఏర్పరుచుకొని స్థానిక హిందువులను అక్కడి నుండి తరిమేస్తున్నారు.
మొత్తం అస్సాంలోని విద్యార్థులంతా కలిసి ఒక మహా ఉద్యమాన్నే నడిపినా, మొదట కాంగ్రెస్ వారికి మద్దతుగా నిలిచి ఆ తర్వాత నెమ్మదిగా వెనక్కి తగ్గింది. దానితో వారికి BJP నే వెనుక ఉండి నడిపించింది. కొంత మంది నీచ రాజకీయ నాయకులు విధ్యార్థులని బెదిరించారు కూడా. ఇంత మంది అండతో చొరబాటుదారులు, తీవ్రవాదులు రెచ్చిపోయి స్థానిక హిందువులపై అఘాయిత్యాలు మోపుతున్నారు. ఇదంతా జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తనకేమి తెలియదన్నట్లు వ్యవహరిస్తున్న తీరు మైనారిటిల మీద తనకున్న మోజును తెలియచేస్తుంది.
కాలు క్రింద బొగ్గులా దేశం మండిపోతున్నా పట్టించుకోని పాలకులు
సోనియా గాంధీ హయాంలో మార్కిస్టు కమ్యునిస్టు పార్టీ, కాంగ్రెస్ కి మధ్య ఒక పెద్ద ఒప్పందం కుదిరింది. అందుకే వారెవ్వరికి ఈ అక్రమ చొరబాటుదారుల గూర్చి చింత లేదు. మైరోన్ వీరన్ రాసిన ‘ గ్లోబల్ మైగ్రేషన్ క్రైసిస్’ అనే పుస్తకంలో ప్రపంచంలోని 47 దేశాల్లో ఇతర దేశస్తులు ఉన్న గణాంకాలను ఇవ్వడం జరిగింది. అందులో భారతదేశం పేరు లేదంటే మన దేశంపై అంతర్జాతీయంగా కుట్ర ఎలా పన్నారో అర్ధమవుతుంది.
మన దేశంలో భద్రతా సిబ్బంది మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్య సరియైన సమన్వయం లేకపోవడం చొరబాటుదారులకు అనుకూలమైన ఒక విషయం. దేశ సరిహద్దులు ఎలా ఉన్నాయి? ఎక్కడ మనం బలహీనంగా ఉన్నాము? ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాల మీద కేంద్ర ప్రభుత్వం భద్రతా సిబ్బందికి సహకరిస్తే ఈ సమస్యని ఇట్టే అధిగమించవచ్చు.
ఇప్పుడున్న ప్రభుత్వానికి సరియైన విధంగా దౌత్య వ్యూహాలను పసిగట్టి, మన దేశ దౌత్య వేత్తలతో ప్రపంచమంతా ఈ సమస్యని తెలియపరచే విధంగా చేసి అక్రమ చొరబాటుదారులను ఆపగలిగే సత్తా ఉందా? ఇప్పుడు రాబోయే ప్రభుత్వమైనా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుందనీ, మన దేశ సరిహద్దుల్ని రక్షించి ప్రపంచ పటంలో భారతదేశాన్ని అలాగే ఉంచుతుందని ఆశిద్దాము.
మూలం : దైనిక్ సనాతాన్ ప్రభాత్
ఫోటో మూలం : హిందూ జాగృతి
స్వేచ్చానువాదం : శ్రీ నరేష్
ఫోటో మూలం : హిందూ జాగృతి
స్వేచ్చానువాదం : శ్రీ నరేష్
Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article.
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here
బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులను నియంత్రించే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా?
Reviewed by JAGARANA
on
12:14 PM
Rating:
No comments: