Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

కేజ్రివాల్ కి ఎందుకు ఓటు వెయ్యకూడదు? 12 కారణాలు !

- అరిందాం చౌదరి
నేను గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రివాల్ కి ఓటు వేసాను. కాని రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తప్పకుండ నరేంద్ర మోడీ కే ఓటు వెయ్యమని మిమ్మల్ని ఇంత బలంగా కోరుతున్నానంటే కేజ్రివాల్ ఎందుకు జాతీయ రాజకీయాలకి పనికిరాడో మీకు అర్ధమయ్యే ఉంటుంది. ఇప్పుడయితే అతను రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా పనికి రాడు. కేజ్రివాల్ కి ఎందుకు ఓటు వేయకుడదో  మీ ముందు 12 కారణాలను ఉంచుతున్నాను.

1. ఇటీవల TSI జరిపిన ఇంటర్వ్యూలో అన్నా హజారే మాట్లాడుతూ ఇలా అన్నారు “ అరవింద్ కేజ్రివాల్ కు ఈ దేశ ప్రధాన మంత్రి కావాలనే కోరిక బలంగా అతన్ని మెదడులో పాతుకుపోయింది. అందుకే అతనికి ఓటు వేయకూడదని అంటున్నాను. ప్రధాన మంత్రి కావాలనుకోవడం ఏ మాత్రం తప్పు కాదు. కాని మార్పును కోరుకునే వ్యక్తి, ఈ దేశ అభ్యున్నతి కోసం పాటుపడాలి అని చెప్పుకు తిరిగే వాడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎలాంటి పరిస్థితుల్లోనైన వెనక్కి తగ్గకూడదు. ఈ విషయంలో కేజ్రివాల్ దారుణంగ విఫలమయ్యాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి గా 50 రోజులు కూడా ప్రభుత్వాన్ని నడపలేక తప్పుకున్న కేజ్రివాల్ ఈ దేశాన్ని ఎలా పాలించగలడు?
2. ఒక రాజకీయ నాయకుడు తలపెట్టే పని పేద ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి అంతేగాని ఇంతకు ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హమిలనే సవరణలు చేసి, మధ్య తరగతి, మరియు ఉన్నత తరగతి వారికే ఉపయోగపడే సబ్సిడీలు ఇస్తే ఉపయోగమేంటి?. ఢిల్లీ లో నేటికి 50% మందికి ఇంటిలో మీటరు వ్యవస్థ లేదు. అలాంటప్పుడు కేజ్రివాల్ ఇచ్చే సబ్సిడీని వారెలా పొందగలరు? ఇలా పనికిరాని హామీలను ప్రజలను ఇచ్చి అమలు చేయడంలో విఫలమయ్యాడు.
3. గాంధేయవాదులమని చెప్తూ టోపీలు పెట్టుకొని ఈ పోలీసు వ్యవస్థను మారుస్తామని అర్ధరాత్రి రోడ్లమీద విద్వంసం సృష్టించే ఆప్ MLA లు మనకు అక్కరలేదు.  చూడండి నేనొక అరచాకుడిని అందువల్ల నా MLA లను మరియు MP లను అలాగే చేయనివ్వండి అంటు తిరిగే కేజ్రివాల్ ఈ దేశానికి అవసరమా? అతి కీరాతకులైన ఆమ్ ఆద్మీ పార్టీ  నాయకులు గాంధీ వారసులమని చెప్పుకు తిరుగుతూ ఆ టోపి పవిత్రతను మట్టిలో కలిపారు.
4. మనం ఎన్నటికీ పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానంలో జర్నలిజం ఉండాలని కోరుకోవట్లేదు. ఆప్ టికెట్టు ఇచ్చిన తీరు చూస్తే ఎంత ప్రణాళిక బద్దంగా పని చేసారో అర్ధమవుతుంది. మనీష్ సిసోడియా, సాజియా ఇల్మి, అశుతోష్, అర్నైల్ సింగ్ మొదలగు వారంతా జర్నలిస్టులే. దానివల్ల దేశానికి ఉపయోగం ఏది? వారంతా జర్నలిస్టులుగా ఉన్నపుడు విదేశాలకు పనిచేసిన వారే.
5. బుద్దిలేని, మూడమైన పుస్తకాలు మనకు అక్కరలేదు. కేజ్రివాల్ రాసిన స్వరాజ్ పుస్తకం మన ప్రజాస్వామ్యం పై చూపే ప్రభావం సుస్పష్టం.  కేజ్రివాల్ అనుకున్నది ఆ పుస్తకంలో వివరించడం తప్పేమీ కాదు కాని మొహాల్ల కమీటీ లాంటి ఒక్క కమిటీనే మొత్తం దేశ నిర్ణయాన్ని తీసుకోవాలి అని అనడం చూస్తే CPM  పార్టీ యొక్క దేశ ద్రోహ సిద్దాంతాలను కేజ్రివాల్ పుస్తకం తలిపిస్తుంది. 
6. అన్ని ప్రశ్నలకు కేజ్రివాల్ ఇచ్చే నినాదం విని ప్రజలకు విసుగు వచ్చేసింది. “ మేము ఇదంతా పేద ప్రజల కోసం చేస్తున్నాము “. ఇదంతా చూస్తే ఆ పార్టీ నాయకులకు ఏ మాత్రం దేశ భవిష్యత్తు విషయంలో ముందు చూపు లేదని , తెలివితక్కువ తనంతో అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం చెప్తున్నారని అర్ధం అవుతుంది. మనకు అమాయక ప్రజలని మోసగించే వాడు కాకుండా అసలైన ఆమ్ ఆద్మీ ఎవరో తెల్సుకొని వారి అభ్యున్నతి కోసం పనిచేసే నాయకుడు కావాలి.
7. అందరూ అవినీతిపరులు, దోపిడీదారులు అన్న పదం విని మనందరికీ విసుగు వచ్చేసింది. మనకు దోపిడీ దొంగలు, అవినీతిపరులు ఎవ్వరో తెలుసు. ఇప్పుడు కావాల్సింది వారికి తగిన బుద్ది చెప్పి సమాజంలో మార్పు తీసుకురావడం అంతే కాని కేజ్రివాల్ లా మోసపూరిత మాటలతో ప్రజలను నమ్మించడం కాదు. అలాగే నేడు ప్రపంచంలో అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో సైతం అభివృద్ధి లేదని అబద్దాలు చెప్పడం కంటే మనం కూడా ఆయా రాష్ట్రాల్లాగా అభివృద్ధి చెందాలని కేజ్రివాల్ కోరుకోవాలి.
8. మనకు ప్రజల మధ్యనే అమాయక  పిల్లలను స్వంత భార్యని తిట్టి ఆ వెంటనే ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన కేజ్రివాల్ లాంటి వాడు ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా అవసరం లేదు.
9. మనకు యోగ్యతలేని, చట్ట విరుద్దంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు దేశ రాజదాని నడి వీదుల్లో ధర్నాకు దిగిన కేజ్రివాల్ ఒక రాజకీయ నాయకుడిగా పనికిరాడు. ఇతరులపై కేసు పెట్టేటప్పుడు ముందు నేను సరిగా ఉన్నానా? అని బేరీజు వేసుకోవాలి. ఇంకా ఇప్పటికి కూడా తాను ప్రభుత్వ బకాయి దాదాపు 8.5 లక్షల వరకు కట్టాలి. 
10. మనకు సందేహాస్పదమైన సర్వేలతో అమాయక ప్రజలను మోసగించి, ప్రతి క్షణం యూ టర్న్ తీసుకునే కేజ్రివాల్ అక్కరలేదు. నేను ఎప్పుడైతే ఒక కొత్త అబద్డంతో ప్రజల ముందుకు వస్తానో వారు తప్పక కొన్ని ప్రశ్నలు అడుగుతారు దానితో మరొక సర్వే పేరిట మోసగిస్తూ ఓట్లు లాగేయవచ్చు. ఇది కేజ్రివాల్ గేమ్ ప్లాన్. 
11. మనకు కేంద్రంలో ఢిల్లీలో అవినీతిని ఊడ్చేస్తామని నమ్మబలికి 49 రోజులకే దుకాణం మూసుకున్న కేజ్రివాల్ ప్రభుత్వం అవసరం లేదు.
12. చివరగా మనకు తన ప్రభుత్వమే అధికారంలో ఉన్నపుడు రోడ్డు మీద (రాష్ట్రపతి భవన్ ఎదుట) ధర్నాకు దిగి తన పరువును తానే తీసుకున్న వాడు ఈ దేశ ప్రధాన మంత్రిగా అస్సలు అవసరం లేదు. నేడు ప్రపంచం అంతా కేజ్రివాల్ ఆడుతున్న నాటకాన్ని గమనిస్తూనే ఉంది. 
కాబట్టి మనమంతా కలిసి కేజ్రివాల్ లాంటి మోసపూరిత, దేశ ద్రోహలకి అధికారం ఇవ్వకుండా నిజమైన నేతకే పట్టం కడదాం. మన దేశాన్ని ప్రగతి పథాన నిలబెడదాం. భారత మాతకు జయము పలుకుదాం.

మూలం : ది సండే ఇండియన్
స్వేచ్చానువాదం : శ్రీ నరేష్ గారు  

Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article. 

Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here. 


కేజ్రివాల్ కి ఎందుకు ఓటు వెయ్యకూడదు? 12 కారణాలు ! Reviewed by JAGARANA on 7:50 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.