సంఘ్ మరియు కుష్వంత్ సింగ్ - ఒక విశ్లేషణ
‘హిందూ – ముస్లింల ఐక్యతతో ఈ దేశాన్ని ముందుకు నడిపించడమే ఆర్.ఎస్.ఎస్ యొక్క పని. అదే మా ధర్మం’ అనే గురూజీ మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. - కుష్వంత్ సింగ్ (ఈ మధ్యనే పరమపదించిన ప్రముఖ వార్తా సంపాదకులు)
అతి కొద్ది మందికి మాత్రమే సర్దార్ కుష్వంత్ సింగ్ గారికి ఆర్.ఎస్.ఎస్ ద్వితీయ సరసంఘ చాలక్ పూజనీయ గురూజీ మీద ఉన్నటువంటి అభిప్రాయం గురించి తెలుసు. శ్రీ గురూజీ గోల్వాల్కర్ కుష్వంత్ సింగ్ అసహ్యించుకునే వారిలో మొదటి వారు. 17 నవంబరు, 1972 ముంబై లో ‘Illustrated weekly of India ‘ అనే వార పత్రికకు సంపాదకులుగా ఉన్నపుడు ఒకసారి శ్రీ గురూజీ ని కలిసే అదృష్టం సర్దార్ జీకి లభించింది. గురూజీ అపుడే కాన్సర్ చికిత్స కోసమని ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో జశ్వంత్ సింగ్ శ్రీ గురూజీ తో ఆర్.ఎస్.ఎస్ గూర్చి చాలా గట్టిగా వాదనకు దిగారు. కాని గురూజీ వారికి ఆర్.ఎస్.ఎస్ పట్ల ఉన్న అపోహలన్నింటిని చాలా సులభంగా తొలగించారు.
కుష్వంత్ సింగ్ మరియు ప పూ గురూజీ గోల్వాల్కర్ |
మనం కొందరి గురుంచి తెల్సుకోకుండానే వారిని తిడుతుంటాము. అలా నేను తిట్టిన వారిలో శ్రీ గురూజీ గోల్వాల్కర్ ముఖ్యులు. ఆర్.ఎస్.ఎస్ మత కల్లోలాలను సృష్టించే సంస్థ అని, గాంధీ హత్య వెనుక ఆర్.ఎస్.ఎస్ హస్తం మరియు లౌకికమైన ఈ దేశాన్ని హిందూ దేశంగా ముద్ర వేయాలని చూస్తుందని ఇలా నేను విభిన్న కథనాలను విన్నాను. ఇవన్ని విన్న తర్వాత ఒక రిపోర్టరు గా నేను శ్రీ గురూజీ తో అంగికరించడానికి సిద్దంగా లేను.
శ్రీ గురూజీ తో బేటికి బయలుదేరినప్పుడు నా మదిలో చాలా ప్రశ్నలు ఉండేవి. నేను వారి వద్దకు వెళ్ళినప్పుడు రక్షణ బలగాల మద్య నుండి వెళ్ళాల్సి వస్తుందేమోనని అనుకున్నాను కాని అలాంటిదేమీ లేదు. ఒక సాధారణ వ్యక్తిని కల్సినట్టుగానే నేను వారిని కలిసాను. శ్రీ గురూజీ ఒక మాములు గదిలో ఉన్నారు. గది వాతావరణం అంతా పూజా సుగందాలతో నిండి ఉన్నది. నేను గదిలోకి చేరుకోగానే తెల్లటి కుర్తాలు ధరించిన 10 – 12 మంది కూర్చున్నారు. 65 ఏండ్ల వయసున్న, పొడవాటి ఉంగరాల జుట్టు, గడ్డం మరియు ముఖంపై చెరగని చిరునవ్వుతో ఉన్న అతన్ని చూసి మొదట సన్యాసి అనుకున్నాను. ఈ మధ్యనే ఆపరేషన్ చేయించుకున్నా చాలా ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించారు ఆయన.
ఒక గురువుగా వారి పాదాలకు నమస్కరించేసేటప్పుడు ఏమి అనరు అనుకున్నాను కాని వెంటనే నా బుజాలను పట్టి పైకి లేపుతూ “ నేను నిన్ను కల్సుకోవడం చాలా అదృష్టం. ఎప్పటినుంచో మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను” అని చాలా చక్కటి హిందీ భాషలో చెప్పారు.
నేను కూడా మిమ్మల్ని ‘Bunch of Letters’ పుస్తకం చదివినప్పటి నుండి కలవాలని అనుకుంటున్నానని సందేహంగా చెప్పాను.
‘Bunch of Thoughts’ అని పుస్తకం పేరుని సరి చేసారు తప్పా ఆ పుస్తకం ఎలా ఉంది అని మాత్రం అడగలేదు.
నాకు వారితో ఏమి మాట్లాడాలో తోచడం లేదు. మీరు మీడియా కి దూరంగా ఉంటారు మరియు మీ సంస్థ చాలా రహస్యంగా నడుస్తుందని విన్నాను. ఎందుకని? అన్న ప్రశ్నకు బదులుగా మేము మీడియా కి దూరంగా ఉంటాము వాస్తవమే. మేము ఎప్పుడూ మా గురుంచి గొప్పలు చెప్పుకోము అలాగే మా కార్యకలాపాలు ఏవి కూడా రహస్యంగా నడవవు. మీరు నన్ను ఏదైనా అడగవచ్చు అంటు బదులిచ్చారు.
దానితో మా ఇద్దరి మధ్య చాలా సంభాషణలు చోటుచేసుకున్నాయి.
నేను వారితో సుమారు అరగంట సేపు మాట్లాడిన ఎక్కడ కూడా వారు అలిసిపోయినట్టుగా నాకు కనిపించలేదు. చివరికి వారి నుండి సెలవు కోరుతూ పాదాలకు నమస్కరించపోతే తల పైకెత్తి నన్ను హత్తుకున్నారు.
నేను వారిని మెచ్చుకున్ననా? వారి మాటలతో తన్మయత్వం చెందానా? అంటే నా మనస్సు అవుననే అంటుంది. శ్రీ గురూజీ మేము అందరిని సమానంగా చూస్తాము మరియు అందరి మాటలను, తత్వాన్ని ఆదరిస్తాము అనే నమ్మకాన్ని కలిగించారు. దానితో వారి ఆహ్వానం మేరకు నాగపూర్ కి ఒకసారి వెళ్ళాను. ‘హిందూ – ముస్లింల ఐక్యతతో ఈ దేశాన్ని ముందుకు నడిపించడమే ఆర్.ఎస్.ఎస్ యొక్క పని. అదే మా ధర్మం’ అనే గురూజీ మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
మూలం : న్యూస్ భారతి
స్వేచ్చానువాదం : శ్రీ నరేష్ గారు
సంఘ్ మరియు కుష్వంత్ సింగ్ - ఒక విశ్లేషణ
Reviewed by JAGARANA
on
8:58 AM
Rating:
No comments: