ఎన్నికల కమిషన్ కు విహిప పిర్యాదు : ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ బోర్డు కు అప్పజెప్పడం రాజ్యంగా విరుద్దం
క్రొత్త డిల్లి , 19/03/2014 : విశ్వ హిందూ పరిషద్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం లోని ఆరుగురు సభ్యులు తేది 18/03/2014 నాడు భారత ఎన్నికల కమిషన్ ను కలసి యుపిఏ ప్రభుత్వం ఎన్నికల కోడ్ వర్తింపులోనోకి వచ్చిన తర్వాత చేసిన మైనారిటి సంతుస్టీకరణ చర్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రిందకి వస్తాయని కాబట్టి యుపిఏ ప్రభుత్వ నిర్ణయం పై తగిన చర్య తీసుకోవాలని లిఖిత పూర్వక పిర్యాదు నమోదు చేసారు.
ఎన్నికల కమిషన్ ను కలసిన అనంతరం మీడియా తో మాట్లాడుతున్న మాన్య శ్రీ ఓం ప్రకాష్ సింఘాల్ |
పరిషద్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు మాన్య శ్రీ ఓం ప్రకాష్ సింఘాల్ నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందం లో మాన్య శ్రీ చంపత్ రాయి అంతర్జాతీయ ప్రధానా కార్యదర్శి, మాన్య శ్రీ డా సురేంద్ర జైన్ జాతీయ కార్యదర్శి, మాన్య శ్రీ అలోక్ అగర్వాల్ కార్యవర్గ సభ్యులు, మాన్య శ్రీ రామ కృష్ణ శ్రీవాస్తవ్ డిల్లి రాష్ట్ర కార్యదర్శి మరియు మాన్య శ్రీ వినోద్ బన్సాల్ మీడియా సమన్వయకర్త సభ్యులు గా ఉన్నారు.
డిల్లి చుట్టూ ప్రక్కల ఉన్న123 భారత ప్రభుత్వ ఆదీనంలోని ఆస్తులను " భారత ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ సం SO661(E) తేది 05/03/2014 ద్వారా డిల్లి వక్ఫ్ బోర్డు కు అప్పజెప్పడం జరిగింది, ఈ చర్య రాజ్యంగ విరుద్ధమే కాక ఎన్నికల నియమావళిని ఉల్లఘించడమే అని విశ్వ హిందూ పరిషద్ పిర్యాదులో పేర్కొంది అంటే కాదు ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ కు అప్పజెప్పిన ఆస్తులలో భారత ఉప - రాష్ట్రపతి ఉద్యానవనము మరియు వైర్లెస్ స్టేషన్ వంటి ప్రముఖమైన ఆస్తులు కూడా ఉన్నాయి, ఆయా ఆస్తుల ప్రాధాన్యతను బట్టి అవి కేవలం దేశంలోని ముస్లీం ఓటర్లకు తాయిలం అందిచడానికి చేసిన చర్య గా సుస్పష్టం అవుతుందని ఎన్నికల కమిషన్ కు తెలిపింది.
ఇదీ ఖచ్చితమైన వ్యూహంతోనే జరిగిన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాబట్టి ఈ విషయంలో కాంగ్రేసు నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం త్వరితగతిన చట్ట పరమైన చర్యలు తీసుకోవల్సింగా విశ్వ హిందూ పరిషద్ డిమాండ్ చేసింది.
మూలం : విశ్వ సంవాద కేంద్రం
ఎన్నికల కమిషన్ కు విహిప పిర్యాదు : ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ బోర్డు కు అప్పజెప్పడం రాజ్యంగా విరుద్దం
Reviewed by JAGARANA
on
9:05 AM
Rating:
No comments: