ముష్కర జిహాదిల దాష్టీకం : పాక్ లో హిందూ దేవాలయాని నిప్పు - పూర్తిగా దగ్దమైన ధర్మశాల
పాకిస్తాన్ , 19/03/2014 : పాకిస్తాన్ సింద్ ప్రాంతంలోని లార్ఖాన వద్ద తేది 15/03/2014 న తమ పవిత్ర గ్రంధాన్ని అపవిత్రం చేసారనే నెపంతో ముస్లీం జిహాది మూకలు స్థానిక హిందూ దేవాలయం పై దాడి చేసి మందిరానికి మరియు ప్రక్కనే ఉన్న ధర్మశాలకి నిప్పు పెట్టాయి ఈ ఘటన లో ధర్మ శాల పూర్తిగా దగ్దం అవగా దేవాలయం పాక్షితంగా దగ్ధం అయ్యింది
తేది 15/03/2014 శనివారం రోజున రాత్రి జరిగిన ఈ సంఘటనలో ముష్కరులు స్థానికంగా నివాసం ఉంటున్న హిందువుల ఇళ్ళపై కూడా దాడి చేసారు, తమ పవిత్ర గ్రంధం ఖురాన్ లోని కొన్ని పేజీలను కాల్చి తమ మనో భావాలను తీవ్రంగా గాయపర్చారని కాబట్టే ఈ విధమైన ప్రతిఘటన చేస్తున్నామని అల్లరి మూకలు చెప్పడం జరిగిందని స్థానిక జియో న్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది.
ఇదే విషయమై జియో న్యూస్ స్థానిక హిందూ పంచాయత్ నేత శ్రీమతి కల్పనా దేవిని ప్రశ్నించగా ఇతర మతాల పట్ల మేము గౌరవభావాన్ని కలిగిఉన్నాం, ఏ మతాన్ని కించపరిచే చర్యలు జరుగలేదు, వారి ఆరోపణలు సత్యదూరాలు, ఈ సంబద్ధ ఆరోపణలను మేము నిర్ద్వందంగా ఖండితున్నామని తెలిపారు,
ఈ సంఘటనల తర్వాత స్థానిక పోలీసులు లార్ఖాన పరిసర ప్రాంతాలలో కర్ప్యు విధించారు, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనేఉందని పొలిసు అధికారి ఒకరు జియో న్యూస్ కు తెలిపారు.
మూలం : ఆజ్ తక్ , హిందూజాగృతి
మూలం : ఆజ్ తక్ , హిందూజాగృతి
ముష్కర జిహాదిల దాష్టీకం : పాక్ లో హిందూ దేవాలయాని నిప్పు - పూర్తిగా దగ్దమైన ధర్మశాల
Reviewed by JAGARANA
on
9:27 AM
Rating:
No comments: