సమస్త భారతం సకారాత్మక మార్పు దిశలో ప్రయాణిస్తుంది : శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ
ఈ హోళీ పండగలో దేశంలోని అవినీతి అనే హోళికను ( కాముడ్ని ) దహించి వేసి , అభివృద్ది అనే ఆనందపు రంగులను చల్లుకోవడానికి సమాయత్తం కావాలి - శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ ( ఆర్ట్ ఆఫ్ లివింగ్ )
జైన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్ 17/03/2014 : నేడు సమస్త భారత దేశం ఒక నిర్ణీత సకారాత్మక మార్పు దిశలో సంఘటితంగా ప్రయనిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ ఉత్తర్ ప్రదేశ్ లోని జైన్ పూర్ లో జరిగిన హోలీ వేడుకలలో పేర్కొన్నారు.
శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ అనేక అంశాల పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఎప్పటి వరకు విదేశాలలో మురుగుతున్న అక్రమ నల్ల ధనం తిరిగి భారత్ తీసుకురావడంలో మన ప్రభుత్వాలు సఫలం అయ్యే వరకు ప్రజా ఉద్యమాలు దేశ వ్యాప్తంగా జరుగుతూనే ఉండాలి, దేశం అస్థిరమైపోతుందంటూ మనం మన ఇంట్లో కూర్చొని బాధపడితే లాభం లేదు దానికి పరిష్కారం మన చేతిలో ప్రజాస్వామ్యం పెట్టిన పాశుపతాస్త్రం ఓటు హక్కు సరైన దిశలో వినియోగించడమే కాబట్టి దేశం మొత్తం 100 % తమ ఓటు హక్కును వినియోగించాలని అయన అన్నారు.
పత్రిక విలేఖరులు అరవింద్ కేజ్రివాల్ పై అడిగిన ప్రశ్నలకు అయన సమాధానం ఇవ్వలేదు, స్వామి రాందేవ్ బాబా తన మద్దత్తు ఇవ్వడానికి షరతులు విధించడం పై అది వారి వారి వ్యక్తిగతం అని అన్నారు, అసారం బాపు పై వచ్చిన ఆరోపణలకు న్యాయస్థానం లో న్యాయం జరుగుతుందని, నరేంద్ర మోడీ విషయంలో దేశం సుదృడ నాయకత్వాన్ని కోరుకుంటుదంటు సమాధానం ఇచ్చారు.
మూలం : న్యూస్ భారతి
సమస్త భారతం సకారాత్మక మార్పు దిశలో ప్రయాణిస్తుంది : శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ
Reviewed by JAGARANA
on
8:56 AM
Rating:
No comments: