Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

రాంచి: దేశ సేవలో 25 వసంతాలు పూర్తీ చేసుకున్న " ఏకల్ విద్యాలయ సమితి " - మోహన్ జి మార్గదర్శనం

16/03/2014, రాంచి, ఝార్ఖండ్ : ' ఏకల్ విధ్యాలయ సమితి ' పీడిత తాడితా ప్రజలకు హరిజన గిరిజన బస్తీలలో, తండాలో విద్య ఆధారంగా సమాజ సమృద్ది కి పాటు బడుతున్న సంస్థ, దాదాపు 54,000 వేలకు పైచిలుకు గ్రామాలో ఏకోపాధ్యాయ పాఠశాలను నడుపుతూ ప్రభుత్వ యంత్రాంగం కూడా చేరుకోలేని ప్రదేశాలలో విద్యా వ్యాప్తికి కృషి చేస్తుంది.

' ఏకల్ విధ్యాలయ సమితి '  శుక్రవారం నాడు  సంస్థ 25 వ సంస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు, ఝార్ఖండ్ రాష్ట్రము రాంచి లోని మొర్హబది ఫుట్ బాల్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఈ సేవా ప్రకల్పం లో పనిచేస్తున్న 10,000 మంది సామజిక కార్యకర్తలు హాజరయ్యారు, సరిగ్గా 25 వసంతాల క్రితం అవిభాజిత భిహర్ రాష్ట్రము లోని ఇదే రాంచి లో ప్రారంభమైన ఈ " ఏకల్ విధ్యాలయ సమితి " సంస్థ నేడు దేశంలోని 54,000 వేలకు పైచిలుకు గ్రామాలో సుమారు 56,000 వేల ఏకోపాధ్యాయ పాఠశాలను నిర్వహిస్తూ విధ్యావ్యాప్తి తద్వారా గ్రామ సర్వంగిన ఉన్నతి, స్వయం సంవృద్ది కై పని చేస్తూ ఉంది, ఈ కార్యక్రమాని పూజ్య సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ జి భాగవత్ ముఖ్య అధిథి గా హాజరయ్యారు.
ప్రారంభోపన్యాసంలో శ్రీ శ్యాంజీ గుప్త (ఏకల్ సంస్థ జాతీయ సంయోజకులు) మాట్లాడుతూ ' గత 25 సంవత్సరాలుగా ఏకల్ సంస్థ కార్యకర్తలు చేసిన పని ఇప్పుడుప్పుడే తన ఫలితాలను పూర్తీ స్థాయిలో చూపుడం నేను గమనించాను, నేడు దేశం లోని పల్లెలలో, సేవా బస్తీలలో, గురిజన తండాల్లో స్వాభిమాన సహిత జాతీయ వాదం జాగృతం అయ్యింది, తమ నిజమైన జాతీయతకు హిందుత్వమే ఆధారం అనే నిజాన్ని ప్రజల్లో తీసుకపోగాలిగాం, దేశ ప్రగతిలో పల్లెల యొక్క పాత్ర ను వివరించగలిగాం, దేశంలోసంస్థ పనిచేస్తున్న 54,000 పై చిలుకు గ్రామాలలో దాదాపు 10,000 గ్రామాలను ఇప్పటికే మన ప్రయత్నం వల్ల స్వయం సమృద్ధి చేసుకునే స్థితికి తీసుకొచ్చాం, ఇదీ గొప్ప విజయమే' అని అన్నారు.
తర్వాత మాన్య మోహన్ జి మాట్లాడుతూ ' మరో 12 - 13  సంవత్సరాలలో సంఘ్ తన శత వసంతాన్ని జరుపుకోబోతున్నది దాదాపు అదే సమయంలో మన దేశం తిరిగి ప్రపంచంలోనే మొదటి స్థానానికి వొస్తుంది, తిరిగి తన విశ్వ గురు స్థానాన్ని ఆక్రమిస్తుంది, ఇప్పటికి నిర్మల హిందుత్వం పల్లెల్లో, తండాల్లోనే ఉంది వారికి ఆత్మవిశ్వాసం కల్పించడం ద్వార దేశ పురోగాభివ్రుద్ధిలో వారిని భాగస్వామ్యం చేయాల్సి ఉంది, దాదాపు 50 కోట్ల ప్రజలు ఇప్పటికి మన గ్రామీణ భారతం లో నివసిస్తున్నారు, వారందరిని మనతో కలసి ముందుకు తీసుకెళ్ళడమే అనేక క్లిష్ట సమశ్యలకు పరిష్కారం' అని అన్నారు.
మూలం : విశ్వ సంవాద కేంద్రం             
రాంచి: దేశ సేవలో 25 వసంతాలు పూర్తీ చేసుకున్న " ఏకల్ విద్యాలయ సమితి " - మోహన్ జి మార్గదర్శనం Reviewed by JAGARANA on 9:32 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.