రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఐక్యతా పరుగు - ‘ఉక్కు మనిషి’కి ఘన నివాళి
హైదరాబాద్, డిసెంబర్ 15: సర్దార్ వల్లభాయ్ పటేల్ 63వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఇక్కడ పీపుల్స్‌ప్లాజా వద్ద బిజెపి నిర్వహించిన ఐక్యతా పరుగులో పెద్ద సంఖ్యలో బిజెపితో సహా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవాదేకర్, బిజెపి అధ్యక్షులు జి కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, క్రికెటర్ లక్ష్మణ్ ఇంకా తదితరులు పాల్గొన్నారు. జాతీయ పతకాలను చేబూని వేలాది మంది ప్రజలు నెక్లెస్ రోడ్డుపైన జరిగిన ఐక్యతా పరుగులో పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై నినాదాలు మార్మోగాయి.
రాజమండ్రి : సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ రాష్ట్రీయ ఏకతా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రాజమండ్రిలో వందలాది మందితో రెండు కిలోమీటర్ల పరుగు సాగింది. ఉదయం 8 గంటలకే సుబ్రహ్మణ్య మైదానానికి చేరుకున్న విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ప్రసంగాన్ని విన్న తరువాత పరుగు ప్రారంభించారు. నగరంలోని ప్రధాన మార్గంలో సాగిన ఈ పరుగు దేవీచౌక్, కంబాలచెరువు మీదుగా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకుంది. పరుగుకు ముందు శ్రీపకాష్ స్కూలుకు చెందిన చిన్నారులు స్కేటింగ్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతకు ముందు జరిగిన సభలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు తగిన గుర్తింపు లభించలేదన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని నివాళులర్పించారు. దేశ ఐక్యత కోసం సర్వస్వాన్ని ధారపోసిన పటేల్ ఉక్కు మనిషిగా పేరుపొందారన్నారు. అలాంటి మహనీయుడికి చరిత్రలో సరయిన గుర్తింపు లభించలేదన్న లోటును పూడ్చటానికి, భారతదేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ 182 మీటర్ల ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని నిర్మించేందుకు స్పూర్తిదాయక కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. రైతుల వద్ద నిరుపయోగంగా ఉన్న నాగలికర్రును, ఇతర వ్యవసాయ పరికరాలను సేకరించి ట్రస్ట్ సభ్యులకు అప్పగిస్తే, వీటిని విగ్రహ తయారీలో వినియోగిస్తారని సోము చెప్పారు. ఈ సందర్భంగా శ్రీప్రకాష్ స్కూలుకు చెందిన కొంత మంది విద్యార్ధులు అప్పటికప్పుడు వల్లభాయ్‌పటేల్ ఫోటోను రంగులతో అద్భుతంగా చిత్రీకరించి అందరి అభినందనలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ రాజమండ్రి అర్బన్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ కర్రి రామారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల చైర్మన్ జి.విజయ ప్రకాష్, కేశవభట్ల శ్రీనివాస్, సుంకర రవికుమార్, అద్దేపల్లి శ్రీ్ధర్, బిజెపి నగర అధ్యక్షుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్, బొమ్ముల దత్తు, న్యాయవాది చింతపెంట ప్రభాకర్, తవ్వల వీరేంద్రనాథ్ పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో..
భీమవరం: రెండో బార్డోలీగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏకతా ట్రస్టు పశ్చిమగోదావరి జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఐక్యతా పరుగును నిర్వహించారు. ట్రస్టు నాయకులు భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ సారథ్యంలో ఈ పరుగును నిర్వహించారు. రెండు కిలోమీటర్ల మేర ఈ పరుగు సాగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణ యజ్ఞానికి తమవంతు బాధ్యత వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పరుగును ప్రారంభించిన గన్నాబత్తుల క్రీడామైదానం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఐక్యతా పరుగుకు ముందు భారతీయ జనతాపార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి, ఏకతా ట్రస్టు నిర్మాణకర్త నరేంద్రమోడీ ప్రసంగాన్ని అందరికీ వినిపించారు. ట్రస్టు జిల్లా చైర్మన్ గోకరాజు వెంకట నర్సింహరాజు, మున్సిపల్ కమిషనర్ జివివి సత్యనారాయణ మూర్తి, డియన్నార్ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా వెంకట సత్యనారాయణ, డాక్టర్ చీడే సత్యనారాయణ, వబిలిశెట్టి పట్ట్భారామయ్య, విజ్ఞానవేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, వేలాది విద్యార్థులు ఈ పరుగులో పాల్గొన్నారు.
విజయవాడలో..
విజయవాడ: సర్దార్ వల్లభాయ్‌పటేల్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం విజయవాడ నగరంలో జరిగిన ఐక్యత పరుగు దాదాపు 10 వేల మంది విద్యార్థినీ విద్యార్థులు, నగర ప్రముఖులతో ఎంతో ఆకర్షణగా సాగింది. తొలుత స్వరాజ్య మైదానంలో గుజరాత్‌లో ఆవిష్కరించబోయే నమూనా విగ్రహాన్ని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఆర్ మురళి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపి గద్దె రామ్మోహన్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుర్లపాటి కుటుంబరావు, మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి, బిజెపి నగర అధ్యక్షుడు దాసరి ఉమామహేశ్వరరాజు, బిజెపి సీమాంధ్ర ఉద్యమ కన్వీనర్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం ప్రారంభమైన ర్యాలీ నగర ప్రధాన వీధుల మీదుగా సాగింది
నిజామాబాద్ లో
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ :
మాజీ ఉప ప్రధాని, దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం దేశవ్యాప్తంగా చేపట్టిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. చిన్నారుల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఈ పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నా రు. జిల్లా కేంద్రంలో చిన్నారుల స్కేటింగ్ విన్యాసం అందరినీ ఆకట్టుకొంది. నిజామాబా ద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ పట్టణాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో ఉదయం 8 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో పటేల్ పాత్ర మరువలేనిదన్నారు. స్వాతంత్య్రానంతరం దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి, విశాల భారతాన్ని నిర్మించిన ఘనత ఆయనదే అన్నారు. నిజాం పాలకుల కబంధ హస్తాలనుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించేందుకు ఆయన సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు.
రైతు బాంధవుడు
స్వాతంత్య్రానికి పూర్వం గుజరాత్ రాష్ట్రంలోని బార్డోలీ ప్రాంతంలోని వ్యవసాయ భూముల ను బ్రిటిష్ పాలకులు తమ అధీనంలోకి తీసుకొ ని రైతులను ఇబ్బందులకు గురి చేసిందని యెండల పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా వల్లభాయ్ పటేల్ ఉద్యమించారని, రైతుల కష్టాలను దూరం చేశారని కొనియాడారు. దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రం లో నిర్మిస్తున్నామన్నారు. రైతబాంధవుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్ర హ నిర్మాణంలో వ్యవసాయ పరికరాలనే వినియోగిస్తున్నామన్నారు. అందరూ సహకరించాలని కోరారు.
కలెక్టరేట్‌నుంచి..
ఐక్యత కోసం పరుగు కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైంది. బస్టాండ్, గాంధీచౌక్ మీదుగా సాగింది. గాంధీ చౌక్‌లోని మహాత్ముడి విగ్రహానికి నేతలు పూల మాలలు వేశారు. వర్ని చౌరస్తాలోని సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ ఏకతా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ సామగ్రిని తీసుకువెళ్లడానికి త్వరలోనే జిల్లాకు గుజరాత్ రాష్ట్రం నుంచి బాక్సులు రానున్నాయన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి ఒక వ్యవసాయ ఇనుప పరికరాన్ని, కొంత మట్టిని సేకరిస్తున్నామన్నారు. వీటితోపాటు సర్పంచ్ వివరాలు, ఫొటో సేకరించి ఆ పెట్టెలో ఉంచి గుజరాత్ పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏకతా ట్రస్ట్ జిల్లా చైర్మన్ సోమానీ, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జె.బాపురెడ్డి, సభ్యులు సీనియర్ న్యాయవాది కృపాకర్‌రెడ్డి, రాజ్‌కుమార్‌సుబేదార్, పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పుల్గం మోహన్, బీజేపీ నాయకులు కాటిపల్లి సురేశ్‌రెడ్డి, జయభరత్‌రెడ్డి, జాలిగం గోపాల్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నాంచారి శైలజ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర భూమి సాక్షి దిన పత్రికల సౌజన్యం తో

Reviewed by JAGARANA
on
8:37 AM
Rating:
No comments: