కోచి: పూర్తైన RSS అఖిల భారతీయ కార్యకారణి మండల్ సమావేశాలు, రెండు తీర్మానాలు ఆమోదం - పాట్నా ఘటన పై తీవ్ర ఖండన
కోచి 27/10/2013 : అఖిల భారతీయ కార్యకారణి మండల్ బైఠక్ గ పిలిచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అత్యున్నత నిర్ణాయక స్థాయి సమావేశాలు తేది 25-Oct-2013 నుండి 27-Oct-2013 వరకు కేరళ రాష్ట్రము కొచ్చిలోని ప్రాంత ముఖ్య కార్యాలయం ' భాస్కరీయం ' లో జరిగాయి , ఈ స్థాయి సమావేశాలు కేరళలో జరగటం ఇదే మొదటిసారి,
ఈ సమావేశాలు రెండు ముక్య మైన తీర్మానాలను ఆమోదించాయి :
- దక్షిణ భారత దేశం లో పెట్రేగుతున్న జీహది తీవ్రవాదం Cilck Here to Download in pdf
- దేశ సరిహద్దులు దురాక్రమణను గురికాకుండా తక్షణ చర్యలు Cilck Here to Download in pdf
(సాధ్యమైనంత త్వరలో రెండు తీర్మానాల తెలుగు ప్రతులను అందిస్తాం )
ఈ సమావేశాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ స్థాయి జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు , ప్రస్తుతం పంజాబ్ ప్రాంతానికి సహా ప్రాంత ప్రచారుకులు గా భాద్యతలు నిర్వహిస్తున్న మాన్య శ్రీ సతీష్ గారు ఇక పై స్వదేశీ జాగరణ్ మంచ్ లో బాధ్యతలు నిర్వహిస్తారు , మాన్య శ్రీ రాజపాల్ సింగ్ గారు ఉత్తర్ ప్రదేష్ లోని బృజ్ ప్రాంతానికి సహా కార్యవాహ గా నియుక్తులయ్యారు .
సమావేశాల అంశాలను మీడియాకు తెలుపుతున్న మాన్య మన్మోహన్ వైద్యఅఖిల భారతీయ ప్రచార్ ప్రాముఖ్ |
మూడు రోజులుగా జరిగిన ఈ సమావేశాలకు సంఘ్ జాతీయ న్యాయకత్వం తో పాటు సంఘ పరివార్ సంస్థల నాయకులు పాల్గొన్నారు , పూజ్య సర్ సంఘ్ చాలకులు మాన్య శ్రీ మోహన్ జి భగవత్ గారు , మరియు మాన్య శ్రీ సురేష్ (భయ్యాజి) జ్యోషి గారు మార్గదర్శం చేసారు .
పాట్న వరుస పేలుళ్ళ ను తీవ్రంగా ఖండిస్తున్నాం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రాముఖ్ మాన్య శ్రీ మన్మోహన్ వైద్య గారు మీడియా తో మాట్లాడుతూ ' జాతీయవాద శక్తులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నా దాడుల పట్ల అఖిల భారతీయ కార్యకారణి మండల్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది , తీవ్రవాదులు ఇలాంటి దాడులతో జాతీయవాదుల ఆత్మా స్తైర్యాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేరు , ఇలాంటి దాడులు ఇకముందు జరుగకుండా ప్రభుత్వం చట్టాలను అమలుపరచాలి ' అని అన్నారు
కోచి: పూర్తైన RSS అఖిల భారతీయ కార్యకారణి మండల్ సమావేశాలు, రెండు తీర్మానాలు ఆమోదం - పాట్నా ఘటన పై తీవ్ర ఖండన
Reviewed by JAGARANA
on
1:30 PM
Rating:
No comments: