పాట్నాలో మోడీ పాల్గొనే వేదిక వరుస బాంబు పేలుళ్లు - ఒకరి మృతి : కొనసాగుతున్న మోడీ హుంకార్ సభ
పాట్నా, అక్టోబర్ 27 : బీహార్ రాజఢాని పాట్నాలోని పలు ప్రాంతాలలో ఆదివారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఉదయం 11 గంటలకు ఈ పేలుళ్లు జరిగాయి. ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఆరు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలియవచ్చింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పాట్నాలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ హూంకార్ ర్యాలీ నిర్వహించనున్నారు. మోదీ లక్ష్యంగా ఈ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. ఇప్పటికే మోదీ పాట్నా చేరుకున్నారు. దీంతో ఆయన మరింత భద్రత పెంచారు.
రైల్వేస్టేషన్, ఓ సినిమా థియేటర్, మిగితా నాలుగు బాంబులు హుంకర్ ర్యాలీ జరిగే గాంధీ మైదాన్ వద్ద జరిగినట్టు సమాచారం. ఈ ఘటనలో ఒక మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. రైల్వేస్టేసన్‌లో పేలని రెండు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాసేపట్లో పాట్నాలో నరేంద్ర మోడీ హుంకార్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇప్పటికే పాట్నా ఎయిర్‌పోర్టుకు నరేంద్రమోడీ చేరుకున్నారు. వరస పేలుళ్ల ఘటనతో పోలీసులు మోడీ సభకు మరింత భద్రత పెంచారు
ఆదివారం పాట్నాలో మధ్నాహం ఒంటి గంటకు 'హుంకర్' ర్యాలీలో నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో బీజేపీతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అలయెన్స్ తెగతెంపులు చేసుకున్న తర్వాత బీజేపీ సభను నిర్వహించడం ఇదే తొలిసారి. హుంకర్ సభ ద్వారా బీహార్ లో మోడీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో బాంబు పేలుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ పేలుళ్లకు కారణమైన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ ఘటనా స్థలికి చేరుకొని తనిఖీలు చేపట్టారు.
పాట్నాలో మోడీ పాల్గొనే వేదిక వరుస బాంబు పేలుళ్లు - ఒకరి మృతి : కొనసాగుతున్న మోడీ హుంకార్ సభ
Reviewed by JAGARANA
on
2:01 PM
Rating:
Certainly I wont support bomb blasts. But this is the result of BJP hate politics game. when u want devide society based on caste,religion,race,language this kind of incidents will further increase. Poeple will loose confidence on other communities which will lead to this kind of situations. I feel BJP and RSS has to rethink their ideology will suitable or not for current days of India.
ReplyDelete