దనర ఉత్సవాలలో నరేంద్ర మోడీ ఆయుధ పూజ
అహ్మదాబాద్, అక్టోబర్ 13: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పోలీసులు, భద్రతా సిబ్బంది సమక్షంలో ‘శస్త్ర పూజ’ (ఆయుధ పూజ)ను నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తొమ్మిది రోజులు ఉపవాసం చేసిన మోడీ.. విజయ దశమిని పురస్కరించుకుని ఆదివారం తన నివాసంలో ఆయుధ పూజ చేశారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన స్పష్టం చేసింది. పోలీసులు, భద్రతా సిబ్బంది పాల్గొన్న ఈ పూజకు సంబంధించి గుజరాత్ సమాచార శాఖ విడుదల చేసిన చిత్రాల్లో మోడీ కత్తులు, తుపాకులకు పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు అందజేశారు. తమ రాష్ట్ర పోలీసులు, భద్రతా సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం ఆయుధ పూజను నిర్వహించినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
దనర ఉత్సవాలలో నరేంద్ర మోడీ ఆయుధ పూజ
Reviewed by JAGARANA
on
8:15 AM
Rating:
Reviewed by JAGARANA
on
8:15 AM
Rating:

No comments: