Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

కాల్పుల విరమణ ఒప్పంద్దాన్ని మళ్ళి అతిక్రమించిన పాక్ సరిహద్దులో మోర్టార్లతో దాడులు


  • గత వారం రోజులల్లో ఎనిమిదవ సారి కాల్పుల విరమణ ఒప్పంద అతిక్రమణ 
  • ఇద్దరు భారత జవాన్లకు తీవ్ర గాయాలు 
  • ఎల్ఓసి వద్ద తెగబడ్డ పాక్ దళాలు 
  • సరిహద్దుల్లో ఏం జరుగుతుంది వివరణ కోరిన రక్షణ మంత్రి AK అంటోని 
  • ఆర్మీ చీఫ్ విక్రం సింగ్ కు ఆకస్మిక పులుపు హుటాహుటిన వెళ్ళిన విక్రం సింగ్ 

జమ్మూ, అక్టోబర్ 21: దేశ సరిహద్దులో పాకిస్తాన్ దళాలు మళ్లీ కాల్పులకు తెగబడ్డాయి. జమ్మూకాశ్మీర్‌లోని 10 సరిహద్దు ఔట్‌పోస్టుల వద్ద ఫిరంగులు, ఆటోమెటిక్ ఆయుధాలతో కాల్పులకు దిగినట్టు బిఎస్‌ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని అన్నారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆర్‌ఎస్ పుర, రామ్‌గఢ్, కనఛాక్, అర్నియా, సాంబ జిల్లాల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఆదివారం రాత్రంగా కాల్పులు జరుపుతూనే ఉందని, ఈ ఘటనల్లో ఒక బిఎస్‌ఎఫ్ జవాను, ప్రత్యేక పోలీసు అధికారి (ఎస్‌పిఓ) గాయపడ్డారని వారన్నారు. కనఛాక్, కంది-ఆర్నియా ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో వారు గాయపడ్డారు. ఇండో-పాక్ సరిహద్దుల్లో జనవాసాలపైనా కాల్పులు చోటుచేసుకున్నాయి. సరిహద్దుల్లో గస్తీలో ఉన్న బిఎస్‌ఎఫ్ దళాలు పాకిస్తాన్ సైనికుల దుశ్చర్యలు తిప్పికొట్టినట్టు, ఈ సందర్భంగా ఇరువురి మధ్య పరస్పర కాల్పులు జరిగాయని తెలిపారు. సోమవారం ఉదయం వరకూ కాల్పులు కొనసాగాయని బిఎస్‌ఎఫ్ వెల్లడించింది. పాకిస్తాన్ దళాల కాల్పుల్లో పెట్రోలింగ్‌లో ఉన్న ఇద్దరు జవాన్లు గాయపడ్డారని బిఎస్‌ఎఫ్ జవాను తెలిపాడు. జమ్మూ నగర శివార్లలో తెల్లవార్లూ ఫిరంగుల మోత వినిపించిందని గాయపడి జిఎంసి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న జవాను వెల్లడించాడు. ఆర్‌ఎస్ పుర ఏరియాలో ఎనిమిది పోస్టుపై పాక్ కాల్పులకు తెగబడిందని పేర్కొన్నాడు. నియంత్రణ రేఖ వెంబడి సైనిక పోస్టులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. సైనిక శిబిరాలపైనే కాకుండా జనవాసాలపైనా పాకిస్తాన్ దళాలు కాల్పులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. జమ్మూ, సాంబ, కతువ సెక్టార్లలో 190 కిలోమీటర్ల పొడవున్న నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ 140 సార్లు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. గత ఎనిమిదేళ్లలో ఇంత పెద్ద ఎత్తున కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరగడం ఇదే మొదటి సారి.
తరచూ నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై దృష్టిసారింది. కేంద్ర హోమ్ మంత్రి సుశీల్‌కుమార్ షిండే మంగళవారం ఈ ప్రాంతంలో పర్యటించి ఇంటిలిజెన్స్ వర్గాలతో పరిస్థితి సమీక్షించనున్నారు. పాకిస్తాన్ తన పద్ధతి మార్చుకోని పక్షంలో కేంద్రం మరో ప్రత్యామ్నయ మార్గాలు అనే్వషించాలని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్రానికి సూచించారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జనవాసాలపై పాక్ కాల్పులకు తెగబడడం వల్ల సరిహద్దులోని గ్రామస్తులు ఇళ్లు వదిలి పారిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సరిహద్దుల్లో.. ఏం జరుగుతోంది? : వివరణ కోరిన రక్షణ మంత్రి AK అంటోని 

 న్యూఢిల్లీ, అక్టోబర్ 21: నియంత్రణ రేఖ ప్రాంతంలో ఏం జరుగుతోందో తనకు తక్షణమే వివరించాలని ఆర్మీ చీఫ్ విక్రం సింగ్‌ను రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఆదేశించారు. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ సైనిక దళాలు అదేపనిగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ను రక్షణ మంత్రి సోమవారం హుటాహుటిన పిలిపించుకున్నారు. ముఖ్యంగా కెరన్ సెక్టర్‌లో పక్షం రోజులపాటు జరిగిన ఎదురుకాల్పుల విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో జరిగిన ఈ తాజా సమావేశానికి విశేష ప్రాధాన్యత చేకూరింది. రక్షణ మంత్రి నుంచి ఆకస్మికంగా పిలుపు వచ్చిన సమయానికి ఆర్మీ చీఫ్ సీనియర్ కమాండర్ల సమావేశంలో ఉన్నారు. వెంటనే అక్కడి నుంచి నిష్క్రమించి రక్షణ మంత్రి కార్యాలయానికి వెళ్లారు. కెరాన్ సెక్టార్‌లో 30నుంచి 40మంది పాకిస్తాన్ మిలిటెంట్లు తిష్టవేశారని, వారిలో 13మందిని హతమార్చామని చెప్పిన సైనిక దళాలు, ఈనెల 8న ఆపరేషన్లకు స్వస్తి పలికాయి. అయితే తర్వాత అక్కడ జరిగిన గాలింపుల్లో ఒక్క మృతదేహం కూడా కనిపించక పోవడంతో.. అసలు పక్షం రోజులపాటు జరిగిందేమిటన్న సందేహాలు తలెత్తాయి. కాగా, తాజాగా ఆంటోనీని కలుసుకున్న ఆర్మీ చీఫ్ సరిహద్దుల్లో ముఖ్యంగా అధీన రేఖ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిని వివరించారని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ పాకిస్తాన్ దళాలు 136సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ జరుగని విధంగా పాక్ దళాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని రక్షణ వర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి. సోమవారం కూడా పది భారత సరిహద్దు పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయి. కాగా, సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షించేందుకు రక్షణ మంత్రి వచ్చేవారం జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, త్రివిధ దళాధిపతులతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో కెరన్ ఆపరేషన్‌కు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు రక్షణ వర్గాలు వెల్లడించాయి.


కాల్పుల విరమణ ఒప్పంద్దాన్ని మళ్ళి అతిక్రమించిన పాక్ సరిహద్దులో మోర్టార్లతో దాడులు Reviewed by JAGARANA on 9:01 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.