మళ్ళి ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లగించిన పాక్ ! LoC లో భారత జావాన్లపై కాల్పులు
ఈ రోజు ఉదయం 08:40 సమయంలో చిన్న తరహా అటోమిటిక్ మొట్టార్ లతో భారత దళాల స్థావరాలపై దాడికి తెగబడ్డారు , భారత సైన్యం దాడులను అదే తరహాలో త్రిప్పి కొట్టాయి . మధ్యాహ్నం వరకు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి - రక్షణ ప్రతినిధి కర్నాల్ RK ఖలియా
17/09/2013 జమ్మూ : మంగళ వారం పాకిస్తాన్ సాయుధ బలగాలు మరోసారి ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి కాశ్మీర్ సరిహద్ధ్హు రేఖ వద్ద భారత సైనిక స్థావరాలపై కాల్పులు జరిపింది .
" ఈ రోజు ( మంగళవారం ) పాక్ సాయుధ బలగాలు భారత సరిహద్దు రేఖ వెంబడి మంధర్ సెక్టార్ లో భారత సైనిక స్థావరాల పై కాల్పులు జరిపారు " అని రక్షణ అధికార ప్రతినిధి కర్నాల్ RK ఖలియా IANS కి తెలిపారు .
" ఈ రోజు ఉదయం 08:40 సమయంలో చిన్న తరహా అటోమిటిక్ మొట్టార్ లతో భారత దళాల స్థావరాలపై దాడికి తెగబడ్డారు , భారత సైన్యం దాడులను అదే తరహాలో త్రిప్పి కొట్టాయి . మధ్యాహ్నం వరకు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి " అని ఆయన అన్నారు .
పాకిస్థాన్ దళాలు ఆదివారం కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో త్రొక్కి పూంచ్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డాయి .
రెండు దేశాల సరిహద్దుల వెంబడి నివసిస్తున్న లక్షలాది మంది సాధారణ పౌరుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని , రెండు దేశాలు 2003 నవంబర్ లో ద్వైపాక్షిక కాల్పుల ఒప్పద్దాన్ని ఎర్పరుచుకున్నాయి . కాని ఈ సంవత్సరం ప్రారంభం నుండి పాక్ కవింపు చర్యలకు పాల్పడుతునే ఉంది ,
గత వారం భారత కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ సల్మాన్ ఖుర్దిష్ మరియు పాక్ ప్రధాన మంత్రి సలహాదారులు సత్రాజ్ అజీజ్ ల మధ్య బిష్కెక్ , కర్జికిస్తాన్ లో జరిగిన సమావేశం లో కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని ప్రకటించుకున్నారు .
కాని సమావేశం జరిగిన రెండు రోజుల్లోనే పాక్ దళాలు మళ్ళి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి .
Newsbharati.com సౌజన్యంతో
మళ్ళి ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లగించిన పాక్ ! LoC లో భారత జావాన్లపై కాల్పులు
Reviewed by JAGARANA
on
5:02 PM
Rating:
No comments: