Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

బలిగొంటున్న బీభత్స ‘మైత్రి’! పాకిస్థాన్ దూకుడు నేపథ్యంలో భారత విదేశాంగ విధానం ?


పాకిస్తాన్ ప్రధానమంత్రిగా చెలామణి అవుతున్న ప్రచ్ఛన్న బీభత్సకారుడు నవాజ్ షరీఫ్‌ను వచ్చే ఆదివారం న్యూయార్క్‌లో మన ప్రధాన మంత్రి మన్‌మోహన్‌సింగ్ కలుసుకోబోవడం లేదని గురువారం న్యూఢిల్లీలో మన విదేశీ వ్యవహారాలమంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించి ఉంటే దేశ ప్రజలకు కొంత ఊరట కలిగి ఉండేది! బీభత్స కారులను ఉసిగొలిపి మనదేశ ప్రజలను హత్య చేయిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అదుపు చేయడానికి ఆలస్యంగానైనా మన ప్రభుత్వం నడుం బిగించినందుకు హర్షం వ్యక్తం అయ్యేది! అలాంటిదేమీ జరగలేదు. అమెరికాలోని న్యూయార్కులో షరీఫ్‌తో చర్చలు కొనసాగించడానికే కృతనిశ్చయంతో ఉన్నట్టు మన్‌మోహన్‌సింగ్ స్వయంగా స్పష్టం చేయడం మరో జాతీయ వైపరీత్యం! జమ్ము కాశ్మీర్‌లోని సాంబా సైనిక స్థావరంలోకి, కథువా పోలీస్‌స్టేషన్‌లోకి పాకిస్తానీ బీభత్సకారులు చొరబడి సైనికులను పోలీసులను పౌరులను గురువారం హత్య చేసిన తరువాత కూడ నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేయాలన్న మన ప్రధాని ఆకాంక్ష దేశ భద్రతకు వ్యతిరేకమైన చర్య! గత జూన్‌లో నవాజ్ షరీఫ్ మళ్లీ పాకిస్తాన్ ప్రధాని గద్దెనెక్కినప్పటినుంచి మన దేశానికి వ్యతిరేకంగా బీభత్స చర్యలు ఉద్ధృతమయ్యాయి. కథువా, సాంబాలలో దాడులు జరిపిన వారు ‘శాంతి వ్యతిరేకులని’ మన్‌మోహన్‌సింగ్ వాక్రుచ్చుతున్నారు! జరిపించిన వారు మాత్రం ‘శాంతి వ్యతిరేకులు’ కారా? జరిపిస్తున్న బీభత్స ప్రభుత్వానికి ఆధిపత్యం వహిస్తున్న బీభత్స ప్రభుత్వానికి ఆధిపత్యం వహిస్తున్న నవాజ్ షరీఫ్ మొదటి శాంతి వ్యతిరేకి! మొదటి భారత వ్యతిరేకి! దశాబ్దుల తరబడి జరుగుతున్న ప్రక్రియ ఒక్కటే! వేలాది పాకిస్తానీ బీభత్సకారులు మనదేశంలో చొరబడ్డారు. వేలాదిమంది భారతీయులను హత్య చేసారు. ఈ హత్యాకాండకు జిహాదీ బీభత్సకాండకు స్వస్తి చెప్పనంత వరకూ ‘మీతో ఎలాంటి సంబంధాలు వద్దు, చర్చలు వద్దు...’ అని ఏనాడో మన ప్రభుత్వ నిర్వాహకులు పాకిస్తాన్ పెత్తందార్లకు స్పష్టం చేసి ఉండాలి! ఈనాటికీ ఆ మాటలు పలకగల జాతీయ నిష్ఠ, భద్రతా శ్రద్ధ మన పాలకులకు వంటబట్టకపోవడం మన దౌర్భాగ్యం! పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ హంతకులు మనపై హత్యాకాండ కొనసాగిస్తూనే ఉన్నారు. మన పాలకులు పాకిస్తాన్ పాలకులతో చర్చలు జరుపుతునే ఉన్నారు! పాకిస్తాన్ సైనికులు కూడ బీభత్సకారులుగా మారిపోయారు, అధీన రేఖను దాటి దొంగచాటుగా మన సైనికులపై చీకటి దెబ్బ కొట్టడం, హత్య చేయడం తలలను నరికి ‘విజయ చిహ్నాలు’గా తల దేశంలోకి మోసుకుని పోవడం, సైనికుల మృతదేహాలను కసిగా ముక్కలుగా నరకడం వంటి ఘోర పైశాచిక బీభత్స చర్యలకు పాకిస్తాన్ సైనికులు పాల్పడుతున్నారు! అయినప్పటికీ మన ప్రభుత్వం ‘తెగతెంపులు’ చేసుకోవడం లేదు! గురువారం పాకిస్తానీ బీభత్సకారులు మన సైనిక స్థావరంలోకి, పోలీసు ఠాణాలోకి చొరబడి ఒక ఉన్నత సైనిక అధికారిని సైనికులను పోలీసులను హత్య చేయడానికి తెగించడానికి ఏకైక కారణం మన ప్రభుత్వపు మెతకతనం, చతికిలబడి ఉన్నతనం...
పాకిస్తాన్ ప్రభుత్వం కోరవలసిన కోర్కెలను మన ప్రభుత్వం తిరస్కరించదగిన ఆ కోర్కెలను మన ప్రభుత్వమే కోరుకుంటోంది! మన భద్రతను మన ప్రభుత్వమే తూట్లు పొడవడానికి ప్రయత్నించడం ఈ కోర్కెల ఇతివృత్తం. బీభత్సకాండను నిరోధించడానికి ఉభయ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలన్నది సాంబా, కథువాలలో పాకిస్తాన్ మానవ పిశాచాలు జరిపిన హత్యాకాండ తరువాత మన విదేశాంగ మంత్రి ఆవిష్కరించిన మరో ఘోరం! హఠాత్తుగా ఇలాంటి విధాన ప్రకటనను చేయడానికి ఈయనకు అధికారం ఎవరిచ్చారు??కేంద్రమంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ధారించారా?? కనీసం ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, దేశ వ్యవహారాల మంత్రి మొదలైన అతిముఖ్యులకైనా ఈ విధాన ప్రకటన గురించి తెలుసునా? పాకిస్తాన్ ప్రభుత్వం అధీనరేఖకు తనవైపున ఉన్న దురాక్రమిత కాశ్మీర్‌లో కనీసం నలబయి ఐదు బీభత్స స్థావరాలను ఏర్పాటు చేసింది! ఇక్కడ తర్ఫీదు పొందిన వేలమంది జిహాదీ హంతకులు మనదేశంలోకి చొరబడుతున్నారు. బయటపడని బీభత్స శిబిరాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఈ బీభత్స శిబిరాలను ధ్వంసం చేయడానికి పాకిస్తాన్ మన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందా? హత్య గురించి హతుని ప్రతినిధులు, హంతకుడు కలిసికట్టుగా నేరపరిశోధనలు చేయడం సాధ్యమేనా? బీభత్సకాండను ఉసికొలుపుతున్న పాకిస్తాన్, బీభత్సకాండకు బలి అవుతున్న మనదేశం ఉమ్మడిగా నిరోధక కృషి చేయడం ఏమిటి? ‘‘మొదట బీభత్సకారులను ఉసిగొల్పడానికి స్వస్తి చెప్పండి...’’ అని పాకిస్తాన్ ప్రభుత్వ హంతకులను కోరవలసిన ఖుర్షీద్ ‘‘ఉమ్మడి కృషి’’ గురించి మాట్లాడడం, అదీ పనె్నండు మంది మన పౌరులు బలైపోయిన సమయంలోనే ఈ ‘కొత్త విధానాన్ని’ బయటపెట్టడం భారత విదేశ వ్యవహారాలమలంత్రి వలె కాక పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి వలె ప్రసంగించారు!! ప్రజలు నిలదీయాలి...
దాదాపు మూడు నెలలకు పైగా పాకిస్తాన్ సైనిక బీభత్స కారులు ఒకవైపు, జిహాదీ బీభత్సకారులు మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోని మన సైనికులపై పోలీసులపై దాడులు చేస్తూనే ఉన్నారు! అందువల్ల పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూ కాశ్మీర్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతమంతటా మన భద్రతాదళాలవారు అప్రమత్తంగా ఉండవలసిన అనివార్యం ఏర్పడి ఉంది. ప్రధానమంత్రి కాని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కాని జమ్మూ కాశ్మీర్‌లో పర్యటనకు వెళ్లిన సమయంలోను, మన ప్రభుత్వ ప్రతినిధులుపాకిస్తానీ ప్రతినిధులతో చర్చలు జరిపిన సమయంలోను కూడ బీభత్సకారులు తమ ఉనికిని చాటడానికై హత్యాకాండకు పూనుకోవడం కూడ అనేక ఏళ్లుగా జరుగుతున్న పరిణామ క్రమం! అందువల్ల ఇప్పుడు నవాజ్ షరీఫ్‌ను మన ప్రధాని మరో మూడురోజులలో కలుసుకోబోతున్న తరుణంలో బీభత్సకారులు దాడులు చేయగలరన్నది ముందుగానే స్పష్టమైన వ్యవహారం. అయినప్పటికీ మన భద్రతా దళాలు దాడులను నిరోధించలేకపోవడానికి ‘ప్రమత్తత’ మాత్రమేకాదు, రాజకీయ నాయకత్వం మన దళాల నైతిక బలాన్ని నీరుగార్చుతుండడం కూడ కారణం! బీభత్సకారులతో ప్రాణాలొడ్డి మన జవానులు పోరాడుతున్నారు. బీభత్సకారులను ఉసిగొల్పుతున్న ప్రభుత్వ నిర్వాహకులతో మన దొరతనం వారు చిరునవ్వులు చిందిస్తూ కరచాలనాలు చేస్తున్నారు. కలిసి విందులారగిస్తున్నారు....
పాకిస్తాన్ జిహాదీ బీభత్సకారుల ఏకైక లక్ష్యం మన దేశంలోని ఇస్లాం మతేతరులను నిర్మూలించడం! దశాబ్దులపాటు బీభత్సకాండ సాగించిన జిహాదీలు కాశ్మీర్‌లోయ హిందువులను అలా నిర్మూలించారు. కాశ్మీర్ లోయ అహైందమైంది కాబట్టి జిహాదీ దుండగులు గత కొన్ని ఏళ్లుగా సైనికులపైన కేంద్ర ప్రభుత్వ అనుబంధ సాయుధ దళాలపైన దాడులు మొదలుపెట్టారు. గత జూన్ 26న శ్రీనగర్ సమీపంలోని జాతీయ రహదారిపై వెడుతుండిన సైనిక వాహన శ్రేణిపై టెర్రరిస్టులు దాడి చేయగలిగారు. పట్టపగలే ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు సైనిక ‘గణవేషం’-యూనిఫారం- వేసుకుని వచ్చి సాంబాలోని సైనిక స్థావరం భోజన శాలలోకి వెళ్లి హత్యలు చేసారు. మన ప్రభుత్వం చేపట్టిన శాంతి ప్రక్రియ పాకిస్తాన్‌లో ప్రశాంతికి, మన దేశంలో అశాంతికి మాత్రమే దోహదం చేసింది!
బలిగొంటున్న బీభత్స ‘మైత్రి’! పాకిస్థాన్ దూకుడు నేపథ్యంలో భారత విదేశాంగ విధానం ? Reviewed by JAGARANA on 9:59 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.