గౌహతి , అస్సాం : విశ్వ హిందు పరిషద్ కేంద్రీయ ప్రభంద సమితి సమావేశాలు - భవ్య రామ మందిర నిర్మానార్థమై తీర్మానం
తీర్మానాల PDF హింది ప్రతి , తెలుగు ప్రతి
26 & 27 జులై , గౌహతి , అస్సాం : విశ్వ హిందు పరిషద్ కేంద్రీయ ప్రభంద సమితి సమావేశాలు జులై 26,27 తేదిలలో అస్సాం రాష్ట్రం గౌహతిలోని హరియాన భవన్ , నారాయణ నగర్ లో జరిగాయి , ఈ సమావేశాలలో పాల్గొనడానికి వచ్చిన ప్రతినిధులను అస్సాం ప్రాంత పద్దతిలో తిలక దారణ చేసి ఆహ్వానించడం జరిగింది .
లక్ష్య సాధనలో పునరంకితం అవుదాం : మాన్య శ్రీ ఆశోక్ సింఘాల్
వేదిక పై మార్గదర్శనం చేస్తున్న పెద్దలు |
ఈ సమావేశాలు విశ్వ హిందు పరిషద్ మార్గదర్శకులు , సంరక్షకులు అయిన మాన్య శ్రీ అశోక్ సింఘాల్ గారి జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమయునాయి, అనంతరం శ్రీ అశోక్ సింఘాల్ గారు తన సమ్మోహిత వక్తృత్వం తో మార్గదర్శనం చేస్తూ విశ్వ హిందు పరిషద్ ఒక సమర్థ సంఘటన గా ఎదిగి తన ఉద్యేశాల , లక్ష్యాల పట్ల సమర్పణ భావంతో పని చేస్తూఉంది , ఏ లక్ష్య సాధనకై పరిషద్ ప్రారంబించబడినదో ఆ పనిలో ఆ సర్వ శక్తిమంతుడైన పరమేశ్వరుడు మనకు కావల్సినంత శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తూ హిందు సంఘటన లక్ష్య సాధనలో పునరంకితం అవుదామని అన్నారు .
తడననతరం స్వాగత సమితి అధ్యక్షులు ప్రఖ్యాత నేత్ర వైద్యులు అయిన శ్రీ తరణికాంత శర్మ గారు స్వాగతోపన్యాసం లో మాట్లాడుతూ "జగత్ జనని అయిన కామాక్షి మాత స్వస్థలానికి స్వాగతం , ఈ అస్సాం సాక్షాత్తు ఆ చతుర్ముఖ బ్రహ్మ చే రచించబదినది , చరిత్రలో ముష్కరమూకలు అనేక సార్లు దండయాత్ర చేసినప్పటికీ అస్సాంని జయించడంలో విఫలమయ్యారు అస్సాం యుగ యుగాలనుండి హిందు రాష్ట్రమయిన భారత్ లో అంతర్భాగంగానే ఉంది ఉంటుంది కుడా , మేము పవిత్ర గంగా నది ప్రవహిస్తున్న దేశ వాసులమైనందుకు గర్విస్తున్నాం , ' కాశ్మీర్ అయిన కన్య కుమారి అయిన నాగాలాండ్ అయిన అటక్ అయిన మనది ఒకే రక్తం , మనమందరం ఆ జగద్గురు భారతంబ సంతానం ' జై శ్రీ రాం " అని ముగించారు .
పరశురాముని తపస్థాలిలో ఈ భైటక్ జరగటం మన సుకృతం : మాన్య ప్రవీణ్ తొగాడియా
కేంద్రీయ ప్రబంద సమితి సమావేశాల కోసం చాలా మంచి ఏర్పాట్లు చేసిన అస్సాం క్షేత్ర కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ మాన్య శ్రీ ప్రవీణ్ తొగాడియ పరిషద్ అంతర్జాతీయ కార్యద్యక్షులు మార్గదర్శనం చేస్తూ " పరశురాముని తపస్తలి మరియు శక్తి పీటం అయిన ఈ స్థలంలో ఈ సమావేశాలు జరగడం మన పూర్వ జన్మ సుకృతం , మన దేశం లో మొగలాయిల పాలనలో లేని ఏదైనా ఒక ప్రాంతం ఉందీ అంటే అది కేవలం పరాక్రమమయిన అస్సాం మాత్రమె , అస్సాం 'లాచిత్ బడ్పుకాన్' వంటి అనేక మంది ధర్మాత్ములైన వీర దేశ భక్తులతో నిండి ఉంది విశ్వ హిందు పరిషద్ అలాంటి పరాక్రమానికి ప్రతిక . 2014 విశ్వ హిందు పరిషద్ స్వర్ణ జయంతి జరుపుకొబోతుంది మనం మరింత బలంగా తయారవ్వాలి దానితో అయోధ్య శ్రీ రామ జన్మ భూమిలో భవ్య రామ మందిర నిర్మాణం తధ్యం దాన్ని ఆపడం ఎవరి తరం కాదు , కాని రామ రాజ్య స్థాపన కై మనం తన మన ధన పూర్వకంగా సమర్పితమయ్యే సమయం ఆసన్నమయినది జై శ్రీ రాం " అని అన్నారు.
అయోధ్య లో భవ్య రామ మందిర నిర్మానార్థమై తీర్మానం ;
హాజరైన ప్రతినిధులు |
ఈ సమావేశాలలో మొత్తం 4 తీర్మానాలు ఆమోదించారు :
- శ్రీ రామ జన్మ భూమి
- అస్సాం
- చైనా దురక్రమణ
- ఉత్తరఖండ్ విలయం
_____________________________________________________________________
విశ్వ హిందు పరిషద్ , కేంద్రీయ ప్రభంద సమితి సమావేశాలు 26 – 27 జులై 2013
హరియన భవన్ , నారాయణ నగర్ , కుమార్పద , గౌహతి అస్సాం
_____________________
తీర్మానము – 2
విషయము : అయోధ్య శ్రీ రామ జన్మ భూమిలో భవ్య రామ మందిర నిర్మాణం
ప్రవేశపెట్టిన వారు : పూజ్య స్వామీ చిన్మయనంద్ సరస్వతి జి మహారాజ్ , హరిద్వార్
ప్రయాగ కుంభ మేళ 2013 లో నిర్వహించబడిన విశ్వ హిందు పరిషద్ మార్గదర్శక మండలి లోని దేశంలోని వివిధ ప్రాంతాలకి చెందిన అందరు పూజ్య సాదు సంతుల సమావేశం లోని నిర్ణయం ప్రకారం హిందువుల పవిత్ర పుణ్య నగరం అయోధ్య లో బట్టలతో నిర్మిచంబడి ఉన్న రామ్ లలా మందిరం సాదు సంతులతో పాటు భక్తుల మనోభావాలకు విఘాతం కలిగిస్తుంది, దేశం లోని హిందువులందరూ సంకల్పిత భవ్య రామ మందిరం లో శ్రీ రాం లలా ను దర్శించాలని కోరుకుంటున్నారు , సాదు సంతుల , ప్రపంచంలోని అందరు హిందువుల అభిప్రాయాన్ని అలహాబాద్ ఉన్నత న్యాయ స్థానం యొక్క లక్నో పీటం లోని ముగ్గురు న్యాయమూర్తుల బృందం దాదాపుగా తన తీర్పు ద్వారా అంగీకరించింది ఆ తీర్పులో
1. వివాద భూమి శ్రీ రాముని జన్మ స్థలమే , జన్మ భూమి స్వయంగా దేవ స్వరూపమే .
2. వివాదాస్పద కట్టడం ఎదో ఒక హిందు ధార్మిక స్థలం పైననే నిర్మించబడినది .
3. వివాదాస్పద కట్టడం ఇస్లాం మూల సూత్రాలకు విరుద్ధం గా నిర్మించబడినది, కాబట్టి దానిని మస్జిద్ గా పరిగనిచంలేము .
ఇస్లాం అనునాయుల ద్వారా న్యాయస్థానం లో వేయనడిన దావాను ఉన్నత న్యాయముర్థుల బృందం రద్దు చేయడం ద్వారా, శ్రీ రామ పరమాత్ముడే అయోధ్య లోని 70 ( డెబ్బయి ) ఎకరాల భూమికి నిజమైన యజమాని అని స్పష్టం చేయడం జరిగింది . మార్గదర్శన్ మండలి నిర్ణయనుసారముగా దేశం లోని ప్రముఖ సాదు సంతుల బృందం ఒకటి మాననీయ భారత రాష్ట్రపతి గారిని కలసి ఒక విజ్ఞపన పత్రాన్ని సమర్పించింది “ బారత ప్రభుత్వ అటార్నీ జనరల్ తేది 14 సెప్టెంబర్ 1994 లో ఉన్నత న్యాయాలయంలో ఒక ప్రమాణ పత్రాన్ని సమర్పిస్తూ “ఒక వేలా వివాదాస్పద స్థలంలో మందిరం లేదా హిందు ఆరాధన స్థలం గనక ఉన్నట్లయితే , ప్రభుత్వ కార్యాచరణ హిందువుల మనో భావాలకు అనుసారంగానే ఉంటుంది “ అని అన్నారు , ఉన్నత న్యాయాలయ తీర్పు అనంతరం 70 ఎకరాల వివాదాస్పద భూమిని భవ్య మందిర నిర్మానర్తమై పార్లమెంటు లో చట్టం చేయడం ద్వారా హిందు సమాజానికి అందిచడం ప్రభుత్వ బాధ్యత .
అయోధ్యా నగర పరిధిలోని 84 ఎకరాలు హిందూ సమాజ పుణ్య క్షేత్రం అని మార్గదర్శాక్ మండలి ప్రకటిస్తుంది , ఈ పూర్తీ విస్తీర్ణాన్ని హిందు సమాజం పరమ పవిత్రంగా భావిస్తుంది ఈ పూర్తీ విస్తీర్ణం లో ఎ రకమైన విధర్మియ ఇస్లాం కట్టడాలను హిందు సమాజం స్వీకరించదు , ఆ స్థలంలో ఏదైనా ఇస్లాం కట్టడం గనక నిర్మితమయితే అది దురక్రమదారు బాబరు పేరుతొ విశ్వసించబడుతుంది , ఈ కారణంగా హిందు – ముస్లీం ల వివాదం సద్దుమనగదు.
న్యాయస్థాన పరమయిన కార్యాచరణ చాలా సమయాభావముతో కూడుకుని ఉంది , కాని హిందు సమాజం శిగ్రాతిశిగ్రముగా రాం లలా ను భవ్య మందిరంలో పుజించాలనుకొంటుంది , భారత కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో చట్టం చేయడం ద్వారా మందిర నిర్మాణ ప్రక్రియలో ఉన్న ప్రభుత్వ మరియు న్యాయ పరమయిన అడ్డంకులను తొలగించాలని కేంద్రీయ మార్గదర్శన్ మండలి డిమాండ్ చేస్తుంది , ప్రభుత్వం ఈ పనిలో విఫలమైతే తదనంతరం హిందు సమాజం ద్వారా జరిగే ఆందోళనలకు ప్రభుత్వమే బాధ్యతా వహించాల్సి ఉంటుంది .
11 – 12 జూన్ 2013 న హరిద్వార్ లో జరిగిన కేంద్రీయ మార్గాదర్శాక్ మండలి సమావేశం లో శ్రీ రామ జన్మ భూమి తీర్మానాన్ని వి.హి.ప కేంద్రీయ ప్రభంద సమితి యదతదంగా ఆమోదిస్తున్నది .
గౌహతి , అస్సాం : విశ్వ హిందు పరిషద్ కేంద్రీయ ప్రభంద సమితి సమావేశాలు - భవ్య రామ మందిర నిర్మానార్థమై తీర్మానం
Reviewed by JAGARANA
on
8:42 AM
Rating:
No comments: