Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

1000 సంవత్సరాల పురాతన దేవాలయ సంరక్షణ ఉద్యమానికి - మీ అమూల్య సంతకాన్ని జోడించండి


శ్రీ కోరుకొండ భారతి ప్రణవాదిత్య మరియు రాష్ట్రచేతన బృందం  ద్వారా సమస్త హిందూ బంధువులకు విన్నపం 

ఈ క్రింది చిత్రంలో చూపుతున్న దేవాలయం వెయ్యి సంవత్సరముల ముందు నిర్మించబడి తరతరాలుగా రక్షించబడుతూ,చోళ సామ్రాజ్యానికి సంభందించిన విశేషమయిన పురాతన జ్ఞాపికగా,పురాతన కట్టడంగా ఉంది. ఈ దేవాలయం కుంభకోణానికి దగ్గరలో  మనంపడి అను గ్రామం లో ఉంది. ఇటీవల జరిగిన రహదారి విస్తరణలలో భాగంగా (NHAI) తంజావూరు నుంచి  వికిరవాండి 4-way ప్రాజెక్ట్ లో అడ్డుగా ఉన్న ఈ పురాతన దేవాలయ సముదాయాన్ని కూలగోట్టాలని నిర్ణయించటం జరిగింది.


చరిత్ర: 
ఈ దేవాలయాలను క్రీ.అ 1012 నుంచి 1044  మద్యలో చోళ సామ్రాజ్య అధినేత రాజేంద్ర చోళుని ఆద్వర్యంలో నిర్మించటం జరిగింది. మనంపడి గ్రామంలో నిర్మించిన పురాతన ఆలయాలలో పదికి  మించిన విలువకట్టలేని  శిలా శాసనాలు ఉన్నాయి.  అత్యంత అపురూపమయిన,అరుదయిన శిల్పాలు దేవాలయ గోడలపైన దర్శనమిస్తాయి. ఇటువంటి చరిత్ర కలిగిన దేవాలయాల సమూహం పై (NHAI) రహదారి విస్తారణ కార్యక్రామాలలో భాగంగ అప్పుడే కొలతలు తీసుకోవటం కూడా జరిగిపోయింది. రాబోవు సంవత్సరం 2014 రాజేంద్ర చోళుని రాజ్యాధికారానికి 1000 సంవత్సరాలుగా భావిస్తున్నారు.అదే సంవత్సరంలో దేవాలయ కూల్చివేత ప్రారంభం అయితే అది భాధాకరం అవుతుంది. ఈ అమలును ఆపగలిగిన వారిలో ప్రధములు ఆచరణాదికారి మరియు జిల్లా కలెక్టర్ లు మాత్రమే. కాబట్టి వారిని ఈ విషయం లో రహదారి విస్తరణలో ప్రత్యామ్నాయాలను అలోచించి అమలుచేసి పురాతన అనవాలులను కాపాడే దిశగా ఒక వినతి పత్రం అందించటానికి చర్యలు తీసుకోవటం ప్రారంభం అయ్యాయి. దాని కోసం మనం చెయ్యవలసిన పని కేవలం ఒక సంతకం చెయ్యటం మాత్రమె. తద్వారా,తమిళ నాడుతో సహా భారత దేశం మొత్తం ఆ దేవాలయ కూల్చివేతను వ్యతిరేఖిస్తున్నది అని ప్రభుత్వం అర్ధం చేస్కుంటుంది. తద్వారా కూల్చివేతను ఆపి,చరిత్రను కాపాడుకున్నా వాళ్ళమవుతాం.



పూర్తి వివరణ కొరకు ఈ కింది ఆంగ్ల లింక్ ను ఓపెన్ చెయ్యండి.

సంతకం చెయ్యాలి అనుకున్న వారు.
ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా  మీ అభిప్రాయాన్ని,సంతకాన్ని నమోదు చెయ్యండి. 
1000 సంవత్సరాల పురాతన దేవాలయ సంరక్షణ ఉద్యమానికి - మీ అమూల్య సంతకాన్ని జోడించండి Reviewed by JAGARANA on 6:03 AM Rating: 5

1 comment:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.