శాఖ చిన్నది - హిందువుల కథ పెద్దది
Download |
శాఖ చిన్నది - హిందువుల కథ పెద్దది
వాళ్ళందరిని మేలుకొలిపి బలం పెంచుతున్నది !!
1.కోట్లమంది వున్నరు -సోయ లేకున్నరు
కేశవుడు పుట్టి,శాఖ పెట్టి,హిందువన్నడు !!
2.గల్లి గల్లి చూడర - జెండను నిలవెట్టిరి
ఆటపాటలాడి దేశభక్తిని చూపెట్టిరి !!
3.దక్ష ఆరమన్నది - దండ తిప్పుతున్నది
దేశమాత సేవచేయ -దండు కదలుతున్నది !!
4.పాక్ చైన దుండగులు - కయ్యానికి కాలుదువ్వె
సరిహద్దుల మన సేనకు పోరులొ తోడుండెరా!!
5.గాలి తుఫానొచ్చినా -వరద ముంచుకొచ్చినా
కట్టుబట్ట లేనివాళ్ళ - కన్నీళ్ళు తుడిచెరా!!
6.ఒంటరితనమొద్దని - కుటుంబాలు ముద్దని
ఇల్లిల్లూ తిరిగి మనం అంతా ఒకటన్నది !!
7.ఏ కులమైతేందిరా -భేదభావమేందిరా
యుగం మారుతోంది -జర బుద్ది మార్చుకొమ్మురా !!
8.రామరాజ్య కాలం -భారత పురాణం
నేటికింక పల్లె జనం నోట్లొ నానుతున్నది !!
9.సింధుతీరమందునా - ఋగ్వేదం వెలిసెనా
వేల ఏళ్ళ జ్ఞానమింక విస్తరించు చుండెనా !!
10.ముక్కోటి దేవతలను మూలకుంచమన్నది
భారతాంబ కంటె మించి దైవం లేదన్నది !!
రచన , గానం : శ్రీ అప్పాల ప్రసాద్ గారు
శాఖ చిన్నది - హిందువుల కథ పెద్దది
Reviewed by JAGARANA
on
1:23 PM
Rating:
No comments: