గోవుల సంరక్షణ ఎవరి బాధ్యత?
గోవు అణువణువూ భగవత్ స్వరూమన్నది హిందువుల నమ్మకం. తల్లికన్నా మిన్నగా భావించి గోవులను పూజిస్తారు.. ఆరాధిస్తారు. ఉదయానే్న గో ముఖం చూస్తే మంచిదని హిందువులు నమ్ముతారు. అంతవరకూ ఎందుకూ శ్రీరంగం వంటి అనేక పుణ్యక్షేత్రాల్లో సుప్రభాత సేవలో గోవును తీసుకువచ్చి స్వామివారి ముందుంచుతారు. అంటే గోవుకు పురాణ ఇతిహాసాల్లో ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. శుభకార్యాల్లో గో మూత్రాన్ని, పేడను కూడా పవిత్రత కోసం వినియోగిస్తున్నామంటే, హిందువులు గోవును ఎంత పవిత్రంగా భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి గోవుల తలలు హిందూ దేశంలోనే తెగిపడుతున్నాయి. ఈ మూగ జీవాల మాంసాన్ని మన దేశంలోనే కొందరు భక్షిస్తున్నారు. హిందువులే కసాయిలుగా మారి, గోవులను, వాటి సంతతిని కబేళాలకు తరలిస్తున్నారు. గల్ఫ్ దేశాలు గోమాంసం నుంచి నూనెను తయారు చేసి, వాటిని తిరిగి హిందువులకే విక్రయించే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. కొన్ని దేశాల్లో జిడిపి వృద్ధి రేటు గోమాంసం విక్రయం ద్వారానే పెరుగుతోందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడికి చేరుతున్న గోవుల్లో మన దేశానికి చెందినవే అధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. గోభక్షుల కత్తులకు గోవులు, వాటి సంతతి ఓ పక్క బలైపోతుంటే, గోవులను, వాటి సంతతిని పవిత్రంగా భావించి, వాటి ప్రాధాన్యతను పదిమందికీ చెప్పాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖే గో మరణాలకు కారణం కావడం ఎంతవరకూ సమంజసం?
సింహాచల దేవస్థానం గోశాలలో మృత్యు ఘోష వినిపించింది. పదుల సంఖ్యలో కాదు.. వందల సంఖ్యలో దూడలు అక్కడ చనిపోయాయి. రాష్ట్రం యావత్తు కన్నీరు కార్చింది. దేవస్థానం అధికారుల తీరును ఖండించింది. వాటిని ఆదుకోవాలంటూ విజ్ఞప్తులు చేసింది. ఇంత జరిగినా, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాత్రం గో పరిరక్షణ బాధ్యత తమది కాదని, మానవతా ధృక్పధంతోనే వాటిని సంరక్షిస్తున్నామని ప్రకటించారు. ఇంతకన్నా దారుణం ఏముంటుంది? కొద్దిపాటి పొలం ఉన్న ఓ రైతు శ్రీకాకుళం జిల్లా బారువలో 1300 గోవులను సంరక్షిస్తున్నాడు. విశాఖలో ఒక స్వచ్ఛంద సంస్థ వందలాది గోవులను సాకుతోంది. ఇలాంటి సంస్థలు రాష్ట్రంలో, దేశంలో అనేకం ఉన్నాయి. హిందుత్వానికి మానవత్వాన్ని జోడించి వీరు ఈ పవిత్ర కార్యాన్ని నిర్వహిస్తున్నారే తప్ప, ఒక్క రూపాయి ఆశించి కాదు. కోట్లాది రూపాయలు ఆదాయం కలిగిన సింహాచలం, శ్రీశైలం, వేములవాడ దేవస్థానాలు గోవులు, వాటి సంతతి పరిరక్షణకు ఎందుకు ముందుకు రావడం లేదు? వీటికి ప్రాణదానం చేయకపోగా, సింహాచల దేవస్థానమే వేలాది దూడలను కబేళాకు తరలించేందుకు పరోక్షంగా ప్రోత్సహించే పరిస్థితి ఏర్పడింది. గత పదేళ్ళుగా ఒకే వ్యక్తికి వేలంపాట ద్వారా దూడలను అప్పగిస్తోంది. ఏడాదికి 41 లక్షల రూపాయలు చెల్లించి దూడలను ఆ వ్యక్తి ఎందుకు కొనుగోలు చేస్తున్నాడో తెలుసుకోకుండా, వాటిని వదిలించుకోడానికే చూసింది సింహాచల దేవస్థానం. ఒక్కసారి ఆ దిశగా దర్యాప్తు జరిపితే, సింహాచలమైనా, శ్రీశైలమైనా, వేములవాడైనా మరే దేవస్థానమైనా.. అక్కడి నుంచి వేలంపాట ద్వారా వెళుతున్న గోవులు ఏమవుతున్నాయోనన్న భయంకర నిజం వెలుగు చూస్తుం
గోవుల సంరక్షణ ఎవరి బాధ్యత?
Reviewed by JAGARANA
on
4:25 PM
Rating:
ReplyDeleteమీతో చాలా వరకు ఏకీభవిస్తున్నాను.గోవుల సంరక్షణ బాధ్యత దేవదాయశాఖది కాకపోతే,అసలు వాటిని మొక్కుబడులుగా సమర్పించేవారి వద్ద నుంచి వాటిని తీసుకొనడం మానివేయమనండి.ఒకవేళ తీసుకొంటే ,వాటిని పోషించేందుకు సొమ్మునుకూడా కట్టమనాలి.మంత్రిగారి మాటలు పూర్తిగా బాధ్యతారహితమైనవి.ఇటువంటి దేవాలయ అధికారులు,మంత్రులూ ఉండగా గోసంరక్షణ ఎలా జరుగుతుంది?అసలు సమాజంలో ఆవుల యజమానులే వాటిని రక్షించి పోషించాలి.
కాని ఎన్నో జాతులు,మతాలు ఉన్న మనదేశంలో పూర్తిగా గోవధ నిషేధించడం సాధ్యం కాదనుకొంటాను.కాని regulate చేయవచ్చును. గోమాంసం ఎగుమతిని మాత్రం పూర్తిగా నిషేధించాలి.
ఏమైనా దేవాలయంలోని గోశాల నుంచి వాటిని కబేలాకి తరలించడం మాత్రం క్షమించరాని నేరం. అలా చేసినవారిని కఠినంగా శిక్షించవలసిందే.