Top Ad unit 728 × 90

అందరి కోసం అన్నీ ఇచ్చిన - దేశం కోసం పని చేద్దాం - సంకల్ప దివస్ గీథ్ With Music

Download
అందరి కోసం అన్నీ ఇచ్చిన - దేశం కోసం పని చేద్దాం (2)
దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం 

సూర్యుడు వెలుగుల కిరణాలిస్తే - వాయువు ప్రాణం పోస్తుంది 
పొలాల పంటలతో భూమాతా ఆకలి తీరుస్తూ ఉంది
తోటి ప్రజలకూ తోడుందాం  - మానవత్వమూ చాటిద్దాం 
!! అందరి కోసం అన్నీ !!
దారిన పోయే జనులందరికీ చెట్లు నీడనే ఇస్తాయి 
వికసించే నవ పుష్పాలన్ని సువాసనలు అందిస్తాయి 
త్యాగ మూర్తులను స్మరియిద్దాం - ఆదర్శం గా జీవిద్దాం 
!! అందరి కోసం అన్నీ !!
వెనుకబడిన మన అన్నదమ్ములను  ప్రగతి పథమ్మున  నడిపించాలి 
మంచి మాటలే పలికించాలి - చదువుల సారం నేర్పించాలి 
శ్రమించి దీపం వెలిగిద్దాం - ఉజ్వల కాంతిని నింపేద్దాం  
 !! అందరి కోసం అన్నీ !!
అందరి కోసం అన్నీ ఇచ్చిన - దేశం కోసం పని చేద్దాం - సంకల్ప దివస్ గీథ్ With Music Reviewed by JAGARANA on 11:37 AM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.