Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

అక్రమ వలసలతో రగులుతున్న ఈశాన్యం - - శంకర్ రాయ్‌చౌధురి


‘‘నువ్వు ఉపయోగించుకునే పరిమాణం పెరిగే కొద్దీ, నువ్వు నష్టపోయేది తగ్గుతుంటుంది,’’ అనేది ప్రాథమిక సిద్ధాంతం. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీకి చెందిన పంజర్ జనరల్ హెయింజ్ విహెల్మ్.. ప్రజలపై బలప్రయోగం జరపడంపై రూపొందించిన సిద్ధాంతమిది. అత్యద్భుతమైన తెలివితేటలు కలిగిన ఈ జనరల్‌ను సైనిక వర్గాలు ఎల్లప్పుడూ తలచుకుంటుంటాయి. నాడు యూరప్ దేశాల్లో పెద్ద ఎత్తున సాయుధ సంఘర్షణలు చోటు చేసుకుంటున్న సమయంలో, కాలం, ప్రదేశం, స్థానిక పరిస్థితుల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో ఈ సిద్ధాంతాన్ని రూపొందించినప్పటికీ, అంతర్గత భద్రత ప్రమాదంలో పడిన సందర్భాల్లో దీన్ని అనువర్తింపజేయవచ్చు. ముఖ్యంగా శాంతి భద్రతలు, ప్రజల భద్రత సాధ్యమైనంత తక్కువ సమయంలో పునఃస్థాపితం చేసేందుకు, ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించడం కోసం ఈ సిద్ధాంతాన్ని అనుసరించవచ్చు.
బాహ్య, అంతర్గత పరిస్థితుల మధ్య సమాంతరత అనేది మనకు కనిపిస్తున్నంత దూరంగా లేదు-సమూహ సిద్ధాంతం అనేది రెండింటికీ సమానమే..కాకపోతే దాన్ని సక్రమమైన రీతిలో వ్యాఖ్యానించాల్సి ఉంటుం ది. ఆంతరంగిక భద్రత లేదా శాంతి భద్రతలను కాపాడాల్సిన పరిస్థితుల్లో, పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను, పరిపాలనా వనరులను ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే మోహరించాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను బట్టి, భద్రతాదళాల సంఖ్య తగినంతగా ఉండాల్సి ఉంది. దీనికంతటికీ వెన్నుదన్నుగా దృఢమైన రాజకీయపరమైన మద్దతుండాలి.
ఆంతరంగిక భద్రత, శాంతి భద్రతల కార్యకలాపాలకు సంబంధించిన మరో ముఖ్యమైన సూత్రమేమంటే..అత్యవసర పరిస్థితుల్లో సాధ్యమైనంత తక్కువ బలప్రయోగంతో, సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడం. అయితే ఇక్కడ తక్కువ బలప్రయోగం అంటే... అల్లర్లు, ఆందోళనల తీవ్రతపై భద్రతా దళాల వినియోగం ఆధారపడి ఉంటుంది. భద్రతాదళాల సంఖ్య కనీస స్థాయిలోనే ఉండాలి..కానీ గాడితప్పిన పరిస్థితిని అదుపులోకి తీసుకొని రావడానికి తగినన్ని బలగాలు తప్పనిసరి. ఒకవేళ అల్లర్ల ప్రారంభ దశలోనే ఇది సాధ్యమైనట్లయితే, వాటిని తక్షణమే అదుపులోకి తీసుకొని రావచ్చు. కానీ తొలి దశలో, అందుబాటులో ఉండే అసంపూర్ణ సమాచారంతో పరిస్థితిని అంచనా వేయడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో తీవ్రస్థాయిలో బలప్రయోగాన్ని జరిపి, తర్వాత భద్రతా బలగాల స్థాయిని క్రమంగా తగ్గిస్తూ రావడం మరో పద్ధతి.
మరి ఇటీవలి కాలంలో అస్సాంలోని కొగ్రాఝడ్ జిల్లాలో గిరిజన బోడో తెగల ప్రజలు, వలసలు వచ్చిన వారికి మధ్య సంఘర్షణలు జరిగినప్పుడు, ఈ భద్రతా దళాలు తగినంత సంఖ్యలో, ఆయా ప్రదేశాలకు తరలి వెళ్ళినట్టు తెలియడం లేదు. వలసలు వచ్చినవారు బంగ్లాదేశ్ నుంచి మనదేశంలోకి అక్రమంగా చొరబడి స్థిరనివాసాలు ఏర్పరచుకున్నవారే. వీరంతా దశాబ్దాల కాలంనుంచి మనదేశంలోకి ప్రవేశిస్తున్నప్పటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించాయి. నిజానికి ఆస్సాంలో చోటు చేసుకున్న సంఘర్షణలు మతకల్లోలాలకు అతీతమైనవి. ఇక్కడ జరిగేది జాతుల మధ్య సంఘర్షణ..అన్నింటికంటే దౌర్భాగ్యమేమంటే అన్ని రకాలుగా ఇక్కడ అస్థిరత తాండవించడం.
రాష్ట్రంలో అంతర్గతంగా ఆందోళనలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు వాటిల్లినప్పుడు వాటిని అదుపులోకి తీసుకొని వచ్చి శాంతి భద్రతలను కాపాడే బాధ్యత కేవలం రాష్ట్ర ప్రభుత్వాలదే. ముఖ్యంగా సంఘటనా స్థలికి అతి సామీప్యంలో ఉండేది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే. మరి వీటిని అదుపు చేయలేకపోవడం అంటే.. రాష్ట్ర రాజకీయ నేతలు, స్థానిక యంత్రాంగం వైఫల్యం లేదా పరిస్థితికి తగిన విధంగా స్పందించలేని చేతకానితనమైనా కారణమై ఉండాలి. కొక్రాఝర్‌ను ఒక సంక్లిష్టమై కేసుగా పరిగణిస్తే ఇక్కడ పూర్తి వైఫల్యం అస్సాం ప్రభుత్వానిదేనని స్పష్టమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థ తగినంతగా లేదని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం పసలేదు. ఎందుకంటే స్థానిక ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవలసిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్థానిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు నిఘా వేస్తుండాలి. తర్వాత వీటిపై అంచనాలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేస్తుండాల్సిన బాధ్యత రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలదే. కాని కేంద్రం చాలా ఆలస్యంగా భద్రతా దళాలను తరలించడం, అవి కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉండటం ఘర్షణలు అదుపులోకి రాకపోవడానికి ప్రధాన కారణమంటూ గొగోయ్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవంలేకపోలేదు. ఇక్కడ కేంద్రం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోలేదు. చొరబాట్లు, ఉగ్రవాదం, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, క్షీణించిపోతున్న శాంతి భద్రతలు వంటి కారణాల వల్ల దేశంలోని చాలా ప్రాంతాలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఆందోళన లేదా ఘర్షణలు జరిగినప్పుడు, అనుబంధ సైనిక దళాలను, రిజర్వ్ దళాలను ఆయా ప్రాంతాలకు వరుసగా తరలిస్తూ రావడం వల్ల, వాటి సంఖ్య తగినంత స్థాయిలో అందుబాటులో లేకుండా పోయే అవకాశముంది. ప్రస్తుతం కొక్రఝ్ఢ విషయానికి వస్తే, వేర్వేరు కారణాలవల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో మోహరించిన మొత్తం పారామిలిటరీ దళాలను తరలించాల్సి వస్తుంది. అంటే దేశంలోని వివిధ ప్రాంతాలో ఇప్పటికే విధులను నిర్వర్తిస్తున్న వారికి తాజాగా కొక్రఝ్ఢ, అస్సాంలో ఘర్షణలు జరుగుతున్న ఇతర ప్రాంతాల్లో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు వీలుగా సరికొత్త డ్యూటీ అప్పగించాలి. వీరినందరినీ తరలించాలంటే రైలు మార్గం తప్ప మరో రవాణా వ్యవస్థ అందుబాటులో లేదు. ఈ వ్యవస్థ కూడా వేగంగా పారామిలిటరీ దళాలను ప్రభావిత ప్రాంతాలకు తరలించే స్థితిలో లేదు. ఫలితంగా దళాల తరలింపు అత్యంత శ్రమతో కూడినటువంటిది. ప్రభావిత ప్రాంతాలకు ఈ దళాలను తరలించడానికి వీలుగా వాయుమార్గాన్ని వినియోగించే స్థితి రావాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు. హెలికాప్టర్ల ద్వారా అల్లర్లు, పరస్పర దాడులు జరుగుతున్న ప్రాంతాలకు దళాలను చేరవేసే అవకాశాలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిశీలించాలి. ముఖ్యంగా ఇది చాలా మామూలు అవసరంగా కేంద్రం భావించాలి.
అయితే ప్రభుత్వం, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు, ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం కార్యక్రమాల్లో మునిగిపోయి అసలు మొత్తం సమస్యను పక్కతోవ పట్టించే యత్నాలు జరిగిన ఫలితంగా ప్రస్తుతం కొక్రాఝడ్ సంఘర్షణల ద్వారా వెల్లడయిన అత్యంత వివాదాస్పద అంశం కాస్తా మరుగునపడిపోయింది. గడచిన కొన్ని దశాబ్దాలుగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా, ఈశాన్య రాష్ట్రాల్లోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఈ వలసల ప్రభావం అస్సాంలో తీవ్రంగా ఉన్నది. ఆయా ప్రాంతాల్లో ఇది తీవ్రస్థాయి సంఘర్షణలకు, హింసాకాండకు కారణమవుతోంది. వీటిని అరికట్టడంలో ప్రముఖ పాత్ర వహించాల్సిన రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం అత్యంత వివాదాస్పదమైన ఈ అంశానికి ఒక పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నాలు చేయడంలేదు. ఓట్ల రాజకీయాలకే ప్రాధాన్యతనిచ్చే రాజకీయ నేతలు, ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, అత్యంత ముఖ్యమైన దేశభద్రతను కూడా పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అస్సాం ప్రభుత్వం కూడా అందుకు భిన్నంగా ప్రవర్తించడంలేదు.
అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు, బంగ్లాదేశ్‌తో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో, అక్రమ వలసదారులను గుర్తించే కార్యక్రమం పెద్ద ఫార్సుగా మారింది. అయితే ప్రత్యేక గిరిజన జనాభా అధికంగా గల త్రిపుర మాత్రం ఈ వలసలను అరికట్టడంలో చాలా వరకు కృతకృత్యురాలయింది. కానీ ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రానికి కూడా, వలసల తాకిడి మొదలయింది. వలసలు వచ్చిన వారిని గుర్తించే కార్యక్రమం అష్టావక్రుడి మాదిరిగా తయారయి, చివరకు ఎవరైతే అక్రమంగా స్థిరనివాసం ఏర్పరచుకున్నారో అటువంటి వారికే అనుకూలంగా మారిపోయింది. స్కూృటినీ నిర్వహించి వలస వచ్చిన వారిని నిర్ధారించాల్సింది పోయి, వారు అక్రమ వలసదారులు కాదని ఆమోదించి, చివరకు వారు విదేశీయులని నిరూపించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేసి కేంద్రం చేతులు దులుపుకున్నది. మరి వ్యక్తిగత ధృవీకరణ పత్రాలు, అధికారిక రికార్డులు లేని స్థితిలో ఆవిధంగా గుర్తించడం అసాధ్యం. అంతే కాదు. అస్సాం సరిహద్దులు తేలిగ్గా విదేశీయులు దేశంలోకి ప్రవేశించడానికి అనువుగా ఉండటంతో, ఎవరు ఎవరో గుర్తించడం బహు కష్టం. పైకారణాలన్నింటివల్ల, స్థానిక సమాజాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం సహజం. కోక్రాఝడ్‌లో ప్రస్తుతం జరిగింది ఇదే. సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో స్థానికుల్లో వ్యక్తమవుతున్న నైరాశ్యానికి, రోషానికి ఈ హింసాకాండ పర్యవసానం.
వరుసగా సంభవిస్తున్న ఇటువంటి సంఘటనల్లో ఒక సామ్యాన్ని చూడవచ్చు. వాహనాలు ఢీకొన్నప్పుడో, కూరగాయల దుకాణాల వద్ద ధర తేడాపై వచ్చిన వివాదం వల్లనో అప్పటికప్పుడు విస్తరించే హింసాకాండపై తమకెటువంటి ముందస్తు సమాచారం ఉండదని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తున్నది. అటువంటి అల్లర్లు అకస్మాత్తుగా చెలరేగినప్పుడు వాటిని అరికట్టడానికి తగినంతమంది పోలీసు యంత్రాంగం లేకపోవడం మరో లోపం. ముఖ్యంగా అతిచిన్న పాటి సంఘటన కూడా పెద్ద ఎత్తున హింసాకాండకు ఒక ట్రిగ్గర్ మాదిరిగా పనిచేసేంతటి దారుణమైన పరిస్థితులు అస్సాంలో నెలకొన్నాయి. రాష్ట్ర పాలనా యంత్రాంగం అన్ని చోట్లా తీవ్రమైన ఒత్తిడికి లోనై ఉన్న తరుణంలో, వారికి నాయకత్వ లక్షణాలు, అనుకోని అవాంతర సంఘటన చోటు చేసుకున్నప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కొనే సామర్ధ్యాన్ని పెంపొందించుకునేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వాలి. కోక్రాఝడ్ సంఘటన నేర్పిన పాఠమి

ఆంధ్రభూమి సౌజన్యంతో 
అక్రమ వలసలతో రగులుతున్న ఈశాన్యం - - శంకర్ రాయ్‌చౌధురి Reviewed by JAGARANA on 4:06 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.