Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

చరణాలకు ప్రణమిల్లి శరణువేడు తల్లిని - VijayaVipanchi


చరణాలకు ప్రణమిల్లి శరణువేడు తల్లిని
సంఘర్షణ సమయానికి శక్తి వరము నిమ్మని


ఉవ్వెత్తున ఎగసిపడే హిందు సింధు వీచికవై
మధ్యందిన మార్తాండుని స్వయంజ్వలిత జ్వాలవై
ఇంతింతై వటుడింతై దనుజ పీచ మణచినట్లు
అరిగణముల పరిమార్చగ వీరుడవై నీవు లేచి  
|| శరణువేడు తల్లిని ||


కృద్ధరామ ధనుర్ముక్త నిశిత శరాఘాతమువై
కాలకంఠు కంఠమందు మింటినంటు మంటవై
ప్రళయకాల నటిత కాళి పాదధూళి కళికవై
అరిశోణిత ఆజ్యమ్మును అమ్మకు అభిషేకమిచ్చి 
|| శరణువేడు తల్లిని ||


దేశద్రోహ ముష్కరులను మట్టుబెట్ట నడుం కట్టి
కరసేవక రామదండు సంకల్పిత శక్తితో
అయోధ్య నేడు జాతి గతిని అవలీలగ మార్చగా
ధనుర్ధారి శ్రీరాముడు మనలనావహించగా 

చరణాలకు ప్రణమిల్లి శరణువేడు తల్లిని - VijayaVipanchi Reviewed by JAGARANA on 1:02 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.