Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

మత హింస బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమం : RSS చీఫ్ శ్రీ మోహన్ జి భాగవత్

సదస్సులో ప్రసంగిస్తున్న శ్రీ మోహన్ జి భాగవత్ 


కొత్త డిల్లి : "ప్రపంచ వ్యాప్తంగా హిందుత్వ యొక్క శక్తి ఇప్పుడు కేవలం భారతదేశం లోనే విరాజిల్లుతూఉంది, కాని ఇతర మతాల వారు నశించెయ్యి ప్రయత్నిస్తున్నారు, అందులో భాగమే ఈ బిల్లు ఇది రాజ్యంగా స్పూర్తికి విరుద్ధం" అని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మాన్య శ్రీ మోహన్ భాగవత్ గారు డిల్లిలోని జ్వాలాముఖి ఆలయ సమావేశ మందిరంలో మత హింస బిల్ - 2011 కు వ్యతిరేకంగా జరిగిన సదస్సులో సూచించారు .
"ఈ బిల్లు కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వ్యూహాత్మక  ఉద్యమంలో సాదు సంతులు అగ్రేసరులై నాయకత్వం వహించాలని సంఘం చివరికల్లా మీతో కలసి నడుస్తుందని" ఆయన బరోసా ఇచ్చారు .
శ్రీ శ్రీ కంచి శంకరాచార్యుల మార్గదర్శనం

ఇదే సదసులో విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ అద్యక్షులు మాన్య శ్రీ అశోక్ సింఘాల్ మాట్లాడుతూ " ఇది ఒక ఉహించాజాలని మరియు రాజ్యంగా వ్యతిరేకమైన బిల్లు అని మైనారిటి వర్గానికి అనుకూలంగా ఉంది హిందు ధర్మాన్ని మన దేశం నుండి నశింపజేయటమే  ఈ బిల్లు అసలు ఉద్య్యేశమని" పేర్కొన్నారు .

ఈ సదస్సులో శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి (కంచి కామకోటి పీతదిపతి) తో పాటుగా దేశ నలుమూలల నుండి తరలి వచ్చిన సాదు సంతులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు 

మత హింస బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమం : RSS చీఫ్ శ్రీ మోహన్ జి భాగవత్ Reviewed by JAGARANA on 1:27 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.