Top Ad unit 728 × 90

పాక్ బడుల్లో హిందూ ద్వేష పాఠాలు -పాక్‌లో ముగ్గురు హిందూ వైద్యుల కాల్చివేత


ఎవరి మతాన్ని వారే సొంతంగా అనుసరించాలి తప్ప బలవంతంగా చొప్పించకూడదంటూ..తనకు తానుగా రాసుకున్న రాజ్యాంగాన్ని పాకిస్థాన్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నది. ఒకటో తరగతి నుంచే పాక్ చిన్నారులకు మతఛాందసవాదాన్ని చొప్పిస్తున్నది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వమే స్వయంగా వెల్లడించింది. ఇందుకు సంబంధించి అక్కడి వంద బోధనా పుస్తకాలు, వేలాది మంది విద్యార్థులపై ఓ అధ్యయనాన్ని నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం బహిర్గతపరిచింది. ‘పాఠాల బోధనలో వారు అనుసరిస్తున్న వివక్ష పాక్‌లో మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నది.

మత స్వేచ్ఛను, జాతీయ, ప్రాంతీయ సుస్థిరతను, ప్రపంచ భద్రతను బలహీనపరుస్తున్నది. మైనారిటీలైన హిందువులను, క్రిస్టియన్లపై దాడులు పెరిగిపోయాయి. హక్కుల కోసం ప్రశ్నించినవారు హత్యకు గురయ్యారు. ’ అంటూ అంతర్జాతీయ మత స్వేచ్ఛపై ప్రత్యేకంగా పనిచేస్తున్న అమెరికా కమిషన్ చైర్మన్ లియోనార్డ్ లియో అభివూపాయపడ్డారు. పాక్ జనాభాలో ఉన్న ఒక్క శాతమే ఉన్న హిందువులను, రెండు శాతం మాత్రమే ఉన్న క్రిస్టియన్లను ఇస్లామ్‌కు శత్రువులుగా పాఠాల్లో చిత్రించడం మొదలైందని నివేదిక పేర్కొంది. పాక్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన 4వ తరగతి పుస్తకంలో ఇలా ఉంది. ‘ఇస్లామ్ మత ఆధిపత్యాన్ని అణిచివేసేందుకు ఇస్లామ్ వ్యతిరేక శక్తులు బలంగా పనిచేస్తున్నాయి. ఇది ఇస్లామ్ మత ఉనికికే ముప్పు. ఇలాంటి సమయంలో పాకిస్థాన్‌ను, ఇస్లామ్ మతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని అందులో పాఠ్యాంశంగా చేర్చారు. 


పాక్‌లో ముగ్గురు హిందూ వైద్యుల కాల్చివేత :
కరాచీ, నవంబర్ 8: పాకిస్థాన్‌లోని ఛక్ పట్టణంలోని ఓ క్లినిక్‌లో విధుల్లో ఉన్న ముగ్గురు హిందూ వైద్యులను మారణాయుధాలతో వచ్చిన కొందరు దుండగులు కాల్చిచంపారు. సోమవారం దుండగులు జరిపిన కాల్పుల్లో అశోక్, నరేశ్, అజిత్ అనే హిందూ వైద్యులు మరణించారని ‘పాకిస్థాన్ హిందూ కౌన్సిల్’ చీఫ్ ప్యాట్రన్ రమేశ్‌కుమార్ తెలిపారు. డాన్సర్ అయిన ఓ ముస్లిం బాలిక విషయమై హిందువులు, ముస్లింతెగకు మధ్య నెలకొన్న వివాదమే ఈ హత్యలకు కారణమని వారు చెబుతున్నారు.
పాక్ బడుల్లో హిందూ ద్వేష పాఠాలు -పాక్‌లో ముగ్గురు హిందూ వైద్యుల కాల్చివేత Reviewed by JAGARANA on 11:14 AM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.