కోర్టు తీర్పుతో - పాక్ లో తిరిగి తెరచుకున్న హిందూ ఆలయం
"ఈ
దేవాలయంలో హిందువులు మళ్ళీ పూజా పునస్కారాలు జరుపుకోవచ్చు. కాని
కండిషన్స్ అప్లై"
![]() |
అని పెషావర్ హైకోర్టు తీర్పు చెప్పడంతో పాకిస్తాన్లోని
పెషావర్ ప్రాంత హిందువులు సంతోషంతో ఉబ్బిపోయారు.
దేశ
విభజన జరిగిన వెంటనే గోర్కత్రీ గ్రామంలోని గోరఖ్ నాద్ గుడిని పాకిస్తాన్
ప్రభుత్వం మూసివేసింది. ఈ దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. ఇది 160 సంవత్సరాల
పురాతన దేవాలయం. ఈ ఆలయంలోని అతి విలువైన విగ్రహాలను ముస్లిం ముష్కరులు
ఎత్తుకెళ్ళారు. ఒక కోటి రూపాయల పైగా (10.5 మిలియన్) విలువైన బంగారాన్ని
దోచుకున్నారు. గోడలకు ఉన్న బంగారు తాపడాలను ఊడబెరుక్కుని వెళ్లారు. ఈ
నేపథ్యంలో 1947 సంవత్సరం నుండి దేవాలయం అర్చకుడు కంభూరాం, అటు తరువాత అయన
భార్య ఫూల్ వతి అవిశ్రాంతంగా పోరాటం చేసిన కారణంగా చివరికి ఈ తీర్పు
వచ్చింది. ఈ విషయంలో 2002 సంవత్సరంలో అర్చకుని కుమారుచు కాకారాం ను
పోలీసులు అరెస్టు చేశారు. దేవాలయంలో పూజకైతే హిందువులకు అనుమతి
దొరికింది కాని గుడి ప్రభుత్వ ఆస్తిగా కొనసాగుతుంది. గుడి తాళాలు అధికారుల
వద్దే ఉంటాయి. ఇదీ పాకిస్తాన్లో హిందువుల గతి. భారత దేశంలో మసీదుల
గురించి, వాటి వైభవం గురించి ఎక్కువగా చెప్పనక్కరలేదు. అది విదితమే కదా!
భారతీయ "సెక్యులరిజం" వర్ధిల్లుగాక.
కోర్టు తీర్పుతో - పాక్ లో తిరిగి తెరచుకున్న హిందూ ఆలయం
Reviewed by JAGARANA
on
12:36 PM
Rating:

Post Comment
No comments: