దధీచి రక్త దాన యోజన - విజయవంతం - రాష్ట్ర వ్యాప్తంగా 50 కేంద్రాలలో 2500 మంది రక్తదానం
30-10-2011, భాగ్యనగర్ : హిందు హెల్ప్ లైన్ మరియు విశ్వ హిందు పరిషద్ ల సంయుక్త ఆధ్వర్యంలో దేశ వ్యాపితంగా హుతాత్మ దివస్ (అయోధ్య అమరవీరుల పై కాల్పులు జరిగిన దినం) ను పురస్కరించుకొని " దధీచి రక్త దాన యోజన"లో భాగంగా సుమారు 1000 కేంద్రాలలో రక్తదాన శిభిరాలు నిర్వహించబడ్డాయి , దాదాపు ఒక లక్ష మంది రక్త దానం చేసారు .
పశ్చిమాంధ్ర ప్రాంతంలో 50 కేంద్రాలలో రక్తదాన శిభిరాలు నిర్వహించబడ్డాయి అందులో దాదాపు 4000 మంది తమ రక్తాన్ని దానం చేసారు , గుంతకల్లు కేంద్రం లో స్థానిక శాసన సభ్యులు శ్రీ మధుసూదన గుప్త గారు పాల్గొని రక్తదానం చేసారు, ఈ కార్యక్రమంలో మార్గదర్శనం చేస్తూ ఇలాంటి పరమ - పవిత్ర కార్యక్రమంలో పాల్గొనటం తో మన జన్మలు పావనం అవుతాయన్నారు, ఈ కేంద్రంలో 100 మంది రక్తదానం చేసారు సుమారు 350 మంది పాల్గొన్నారు.
మొయినాబాద్ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ ఆకారపు కేశవరాజు ( ప్రాంత సంఘటన కార్యదర్శి ) పాల్గొని " అయోధ్య పోరాటాన్ని మరో స్వసంత్ర పోరాటంతో పోలుస్తూ , ఆ సమరంలో సమిధలైన వారి అడుగుజాడలో అయోధ్య భవ్య రామాలయ నిర్మాణం మన లక్షమని అన్నారు ఇక్కడ 78 మంది రక్త దానం చేసారు , గరిష్టంగా ఇందూరు ( నిజామాబాద్ ) జిల్లాలో రెండు కేంద్రాలలో సుమారు 350 మంది రక్తదానం చేసారు " నా దేశం - నా ధర్మం - నా రక్తం " నినాదంతో జరిగిన రక్త దాన కార్యక్రమాలు హిందువులలో స్వాభిమాన జ్యోతులు వెలిగించాయి .
![]() |
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న శ్రీ విజయ సారధి ( జాగృతి సంపాదకులు ) |
![]() |
రక్తదాన దృశ్యాలు |
![]() |
పెద్దల మార్గదర్శనం |
విభాగ్ వారి స్థలాలు సంఖ్య వివరాలు
విభాగ్ పేరు | స్థలాల సంఖ్య | దాతల సంఖ్య |
అనంతపురం విబాగ్ | 7 | 378 |
పాలమూరు విబాగ్ | 7 | 497 |
మెదక్ విబాగ్ | 9 | 465 |
ఇందూరు విబాగ్ | 7 | 395 |
కరినగరం విబాగ్ | 2 | 138 |
వరంగల్ విబాగ్ | 2 | 61 |
భాగ్యలక్ష్మి విబాగ్ | 10 | 209 |
మహంకాళి విబాగ్ | 6 | 272 |
హిందూ హెల్ప్ లైన్ సంక్షిప్త పరిచయం :
హిందు హెల్ప్ లైన్ అనేది ఒక 24 X 7 హెల్ప్ లైన్ కేంద్రం దేశం లోని ఏ హిందువుకు ఆరోగ్య పరంగా , రవాణ , ప్రభుత్వ సంబంద , న్యాయ సంబంద , మత సంబంద , విషయాలో సహాయకారిగా ఉంటుంది , హిందు హెల్ప్ లైన్ - దేశంలోని ప్రతి హిందువుకు నమ్మదగిన , సహాయకారి అగు మిత్రునిలా ఉండాలని మాన్య శ్రీ ప్రవీణ్భాయి తొగాడియ గారు పేర్కొన్నారు , ఏవిధమైన సహాయమైన కేవలం ఒక్క ఫోన్ దూరంలో ఉంటుంది Phone No: 020-66803300 , 07588682181 మరిన్ని వివరాలకు http://hinduhelpline.com/
Hindu Helpline Logo |
దధీచి రక్త దాన యోజన - విజయవంతం - రాష్ట్ర వ్యాప్తంగా 50 కేంద్రాలలో 2500 మంది రక్తదానం
Reviewed by JAGARANA
on
10:00 AM
Rating:

Post Comment
No comments: