కృష్ణ జిల్లా కైకలూరు లో 75 కుటుంబాల నుండి 325 మంది హిందుత్వంలోకి పునరాగమనం
| స్వామిజిల పరిషద్ పెద్దల మార్గదర్శనం |
కృష్ణ జిల్లా కైకలూరు లో నాలుగు గ్రామాల
నుండి 75 కుటుంబాలకు సంబందిచిన 325 గురు సభ్యులు క్రైస్తవం నుండి తమ స్వ
ధర్మమైన హిండుత్వంలో కి యజ్ఞ కార్యక్రమం ద్వారా పునరాగమనం చెందారు , ఈ
కార్యక్రమం కైకలూరు లోని దుర్గా మాత ఆలయ ప్రాంగణం లో శ్రీ శ్రీ శ్రీ పూజ్య
సత్యానంద భారతి స్వామిజీ ( భువనేశ్వరి పీఠం , గన్నవరం ), శ్రీ శ్రీ శ్రీ
శివ స్వామి మరియు అనేక సాదు సంతుల సమక్షంలో నిర్వహించ బడింది కార్యక్రమ
తదుపరి సహా పంక్తి భోజనం లో అందరు కలసి బోజనం చేసారు .
| సాముహిక యజ్ఞ కార్యక్రమ దృశ్యం |
ఈ కార్యక్రమంలో VHP జాతీయ ఉపాద్యక్షులు
శ్రీ లోకనాథ శర్మ గారు మార్గ దర్శనం చేసారు మరియు VHP పుర్వంధ్ర ప్రాంత
కార్యదర్శి శ్రీ హనుమంత రావ్, ప్రాంత ( పుర్వంధ్ర ప్రదేశ్ ) ధర్మ ప్రసార
ప్రముఖ్ శ్రీ సంజీవయ్య గారు , ఇతర పెద్దలు పాల్గొన్నారు.
| పాల్గొన్న ఆహుతులు |
కార్యక్రమ అనంతరం స్వధర్మం
స్వీకరించిన తమ తోటి సహోదరుల పట్ల మిగిలిన గ్రామస్తులు సాదర అభిమానాలు
ప్రదర్శించారు , పునరాగమనం చెందినా కుటుంబాలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ
మన ధర్మం నుండి దూరమైన అనేక కుటుంబాలను కలసి తమ అనుభవాలను వ్యక్తం చేయాలని
సంకల్పించారు
Source: www.vhpap.org
****
కృష్ణ జిల్లా కైకలూరు లో 75 కుటుంబాల నుండి 325 మంది హిందుత్వంలోకి పునరాగమనం
Reviewed by JAGARANA
on
1:03 PM
Rating:
పునరాగమన చెందినందుకు అనందంగా వున్నది. ఇలా ఎంతమందికి ప్రయత్న పూర్వకంగా తెలియ చెప్పాలి? అందుకనే వీళ్ళ లాంటివారు మనకు దూరం కాకుండా చూసుకోవాలి. ఇవ్వాళకి మనలో కొందరు చేసే అతి చేష్టల వలన ఇలాంటివారు దూరం అవుతున్నారు. అందుకని దూరం అవ్వటానికి గల మూలాల మీద కూడా దృష్టి పెట్టి ఇలాంటి పరిస్తితి రాకుండా చూసుకోవాలి.
ReplyDelete