Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

విశ్వ యోధుల విజయ గానం మహానాదం వినండోయ్ - VijayaVipanchi



విశ్వ యోధుల విజయ గానం మహానాదం వినండోయ్
వీర హైందవ సింహనాదం నాంది పలికే మహానాదం  ||మహానాదం||


విజయమే అను వీర శంఖపు గగన ఘోషను వినగ రండోయ్
రసమయ్యమగు వంశి రవముల రుచులనెన్నో చూడరండోయ్
ధ్వం ధ్వమ్మను పణవ ధ్వనితో పదం పాడగ పదండోయ్
ఝణణ ఝణణను ఝల్లరులతో కదన మాడగ కదలిరండోయ్  ||మహానాదం||


అసుర బలమును మట్టుబెట్టిన ఉగ్ర నరసింహుని నినాదం
రావణుని సంహర మొనర్చిన రామబాణపు హూంకారం
శత్రు శిర విచ్చేద  శస్త్రం సుదర్శన రణ ఘీంకారం
అరి భయంకర భరత సైనిక వీర వర విజ్రుమ్భణం ||మహానాదం||


దేశ ధర్మోద్ధరణ చేద్దాం శత్రు శేషం త్రుంచి వేద్దాం
వ్యక్తి వ్యక్తిని సంస్కరించి జాతి శక్తిగ మలచి వేద్దాం
నిత్య సాధన తంత్ర పథమున సంఘటితముగ సాగుదాం
పరమవైభవ దివ్య మంత్రం నరనరమ్మున నింపుదాం  ||మహానాదం||

విశ్వ యోధుల విజయ గానం మహానాదం వినండోయ్ - VijayaVipanchi Reviewed by JAGARANA on 8:14 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.