మన పతనానికి నేపథ్యం.. నెహ్రు నిరంకుశత్వం! - ఎస్‌కె సిన్హా
Web-Photo |
విదేశాంగ విధానం విషయంలో నెహ్రూ నియంతవలె ఉండేవారు. ప్రజలు ఆ విధానానికి సంబంధించి తమ వ్యతిరేక అభిప్రాయాలను నెహ్రూ వద్ద వ్యక్తం చేయడానికి సంకోచించే వారు. దాని కారణంగా 1962లో చైనా యుద్ధంలో పరాజయం చవి చూడాల్సి వచ్చింది. అయితే ఆ యుద్ధంలో వైఫల్యానికి అప్పటి సైనిక నాయకత్వానిది కూడా ఎంతో బాధ్యత ఉంది. ఎందుకంటే హిమాలయాల రక్షణ విషయంలో నెహ్రూకు ఇవ్వాల్సినంత గట్టిగా సలహా ఇవ్వడంలో సైనిక నాయకత్వం విఫల మైంది. ఒక వేళ నెహ్రూ తమ సలహాలను తిరస్కరించినట్లయితే అందుకు నిరసనగా సైన్యాధిపతి రాజీనామా చేసి ఉండాల్సిందే
మత వ్యవహారాల్లో భక్తి అన్నది ముక్తికి మార్గం. కానీ రాజకీయాల్లో మాత్రం
భక్తి, లేదా వ్యక్తి ఆరాధన విలువల పతనానికి.. అంతిమంగా నియంతృత్వానికి
దారి తీస్తుంది- అని భారత రాజ్యాగం నిర్మాత బిఆర్ అంబేద్కర్ హెచ్చరించారు.
అలాగే పండిత జవహర్ లాల్ నెహ్రూ కూడా 30వ దశకం ప్రథమార్థంలో రాసిన ఒక లేఖలో
తనను తాను తీవ్రంగా విమర్శించుకున్నారు. ఆ లేఖ ‘మోడ్రన్ రివ్యూ’ అనే
పత్రికలో ప్రచురితమైంది. ‘ఓ నియంతకు కావలసిన లక్షణాలన్నీ ముఖ్యంగా
అసాధారణమైన ప్రజాదరణ, అసహనం, లోపాయికారీ వ్యవహారాలు ప్రబలంగానే ఉన్నాయి.
ఆయనను అదుపులో ఉంచడం అత్యవసరం. మనకు జ్యూలియస్ సీజర్లు అవసరం లేదు’ అని ఆ
లేఖలో పేర్కొన్నారు. ఆ విధంగా నెహ్రూ భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాది
వేసారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత జాతి సమగ్రతకు విశేషంగా కృషి చేసిన వ్యక్తే కాకుండా దూరదృష్టి కలిగిన పాలనాదక్షుడు కూడా. భారత దేశ స్వాతంత్య్ర సమయంలో ఐసిఎస్ - ఇండియన్ సివిల్ సర్వీసు - , ఐపిఎస్ - ఇండియన్ పోలీసు సర్వీసు - అధికారులపై ఒక రకమైన వ్యతిరేక భావన ఉండేది. ఒక దశలో ఆ వ్యతిరేకత ఆ రెండింటినీ రద్దు చేయాలన్న డిమాండ్‌కు దారి తీసింది. అయితే ఆ కాలంలో ముఖ్యంగా దేశ పునర్ నిర్మాణానికి సంబంధించి బలమైన పాలనా వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఎంతయినా ఉందని పటేల్ భావించారు. ఆ కారణంగానే ఈ రెండు సర్వీసుల రద్దును నివారించడమే కాకుండా వాటన్నిటినీ యథాతథంగా కొనసాగించేందుకే సిద్ధపడ్డారు. ఈ అధికారులు కొత్త ప్రభుత్వానికి అత్యంత విధేయంగానే పని చేసారు. అయితే వాటి అనంతరం వచ్చిన ఐఏఎస్- ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు -, ఐపిఎస్ కేడర్ అధికార్లకు తక్కువ జీతాలే లభించాయి. అందుకు కారణం అప్పటి ప్రభుత్వం అనుసరించిన సామాజిక విధానమే. ప్రభుత్వ సర్వీసులో పని చేసే ఉన్నత, దిగువ స్థాయి అధికార్ల మధ్యఅంతరాలను తగ్గించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. తాము సేవలందించే రాజకీయ నాయకుల అభిప్రాయాలతో పొసగకపోయినా సివిల్ సర్వెంట్లు నిజాయితీతో కూడిన, అలాగే వాస్తవాలకు అద్దంపట్టే విధంగా అధికారులు సలహాలు ఇవ్వాలని పటేల్ భావించే వారు. పాలకులు తీసుకునే నిర్ణయం ఏదయినా వారి ఆదేశాలను పూర్తి నిజాయితీగా అమలు చేయాలని ఆయన చెప్పే వారు.
నెహ్రూ గొప్ప ప్రజాస్వామ్యవాది. వ్యక్తి ఆరాధన అన్నది, లేదా ఒక వ్యక్తి పట్ల అపరిమతమైన భక్త్భివం కానీ ఆయనకు నచ్చేది కాదు. ఒక సారి తనకు పాదభివందనం చేయబోయిన వ్యక్తిని గట్టిగానే మందలించారు. అయితే విదేశాంగ విధానం విషయంలో నెహ్రూ నియంతవలె ఉండేవారు. ప్రజలు ఆ విధానానికి సంబంధించి తమ వ్యతిరేక అభిప్రాయాలను నెహ్రూ వద్ద వ్యక్తం చేయడానికి సంకోచించే వారు. దాని కారణంగా 1962లో చైనా యుద్ధంలో పరాజయం చవి చూడాల్సి వచ్చింది. అయితే ఆ యుద్ధంలో వైఫల్యానికి అప్పటి సైనిక నాయకత్వానిది కూడా ఎంతో బాధ్యత ఉంది. ఎందుకంటే హిమాలయాల రక్షణ విషయంలో నెహ్రూకు ఇవ్వాల్సినంత గట్టిగా సలహా ఇవ్వడంలో సైనిక నాయకత్వం విఫల మైంది. ఒక వేళ నెహ్రూ తమ సలహాలను తిరస్కరించినట్లయితే అందుకు నిరసనగా సైన్యాధిపతి రాజీనామా చేసి ఉండాల్సిందే కానీ సముచితమైన సలహా ఇవ్వకుండా ఉండడంద్వారా ఆ వైఫల్యభారంలో సైన్యానికీ పెద్ద పాత్రకు అవకాశమిచ్చి ఉండకూడదు.‘‘తన వ్యూహం తప్పని తెలిసినా దాన్ని అమలు చేసే ప్రతి సైనికాధికారీ దోషే. ఎందుకంటే ఆ వ్యూహం తప్పని, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఆ అధికారి కచ్చితంగా చెప్పాలి. ఆయన ఆ పని చేయకపోతే తన పదవికి రాజీనామా చేయాలే తప్పితే తన దళాల పతనానికి కారణం కాకూడదు’’ అని నెపోలియన్ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ నేపథ్యంలో గమనించాల్సిన అవసరం ఉంది. 1971 యుద్ధంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యంత ప్రశంసనీయమైన పాత్రనే నిర్వహించారు. కానీ ఆమె అనుసరించిన దేశీయ విధానాలు మాత్రం లోపభూయిష్టమైనవిగా పరిణమించాయి. ఇందిరా గాంధీ ప్రవచించిన - ప్రభుత్వానికి- అనుకూలమైన న్యాయవ్యవస్థ,-రాజకీయ వాదులకు- అంకితమైన అధికారులు - అన్నవి ప్రజాస్వామ్య మూలాలనే కుదిపివేసాయి. కొంత ఒడిదుడుకుల తర్వాత న్యాయ వ్యవస్థ తన స్వాతంత్య్రాన్ని తిరిగి పొందగలిగింది. కానీ అధికారులు మాత్రం తన తటస్థ లక్షణాన్ని కోల్పోయింది. అవినీతి విశ్వజనీనం అంటూ ఇందిరమ్మ చేసిన ప్రకటన దాన్ని కట్టడి చేయలేమన్న బలమైన భావనకు దారితీసింది. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య విలువలకు పాతర వేసారు. ఆ సమయంలో నేను సైనిక ఇంటెలిజన్స్ అధిపతిగా ఉన్నాను. అలాగే సివిల్ ఇంటెలిజన్స్ ఏజన్సీలోని నా సహచరులతో కలిసి సంయుక్త కమిటీ సభ్యుడిగా పని చేసాను. ఎమర్జెన్సీ విధించడం వల్ల ప్రభుత్వం పని తీరు మెరుగుపడిందని, శాంతిభద్రతల పరిస్థితి కూడా గుణాత్మకంగా మెరుగైందని, రైళ్లు సక్రమంగా నడుస్తున్నాయని.. ఇలా ఎన్నో సానుకూలమైన అంశాలను సాకుగా చేసుకుని సివిల్ ఇంటెలిజన్స్ వ్యవస్థ ఎమర్జెన్సీని సమర్థించింది. అదే క్రమంలో వ్యక్తిగత పొగడ్తలు, ఆ నాటి రాజకీయ వారసుడి జనాకర్షక శక్తి విషయంలో కితాబులు కూడా మొదలైనాయి. అయితే నేను మాత్రం సైనిక పరమైన అంశాలకు మాత్రమే పరిమితం అయ్యాను. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాను. ఢాకాలో ముజిబుర్ రెహమాన్, ఆయన కుటుంబ సభ్యుల దారుణ హత్య నేపథ్యంలో ఆ విధంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. బ్యూరోక్రసీ సాగిల పడిన తీరు నాకు దిగ్భ్రాంతి కలిగించింది. భజనపరుల సంఖ్య కూడా తారస్థాయికి చేరుకుంది. అవన్నీ కలగలిసి నిఘా విషయమై ఇందిరాగాంధీకి తప్పుడు సమాచారం అందింది. వాటిని ఆసరా చేసుకుని 1977లో ఎన్నికలకు జరిపించిన ఇందిరమ్మ ఘోర పరాజయం పాలయ్యారు. తన సహోద్యోగితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఓ ఐఏఎస్ ప్రొబేషనర్‌ను లాల్ బహదూర్ శాస్ర్తీ అకాడమీ డైరెక్టర్ అప్పూ తొలగించారు. అయితే సదరు ప్రొబేషనర్‌కు రాజకీయ పలుకుబడి ఉండడంతో ఆయన మళ్లీ ఆ పదవిలోకి రాగలిగాడు. దానికి నిరసనగా అప్పూ రాజీనామా చేసారు. త్వరలోనే కొత్త విదేశాంగ కార్యదర్శిని నియమిస్తామని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ మీడియా సమావేశంలో ప్రకటించగానే వెంకటేశ్వరన్ విదేశాంగ కార్యదర్శి పదవికి రాజీనామా చేసారు. ఈ సందర్భంగా నా స్వానుభవాన్ని కూడా చెప్తాను. నేను సైన్యంలో పశ్చిమ విభాగం అధిపతిగా ఉన్నప్పుడు మెహతా చౌక్ గురుద్వారాలో దాగి ఉన్న భింద్రన్‌వాలాను, 40 మంది ఆయన సాయుధ అనుచరులను అరెస్టు చేయడానికి గురుద్వారా వద్దకు ట్యాంకులను పంపాలని అప్పటి పంజాబ్ ప్రభుత్వం నన్ను అడిగింది. అయితే నేను అందుకు నిరాకరిస్తూ, సైన్యానికి అరెస్టు చేసే అధికారాలు లేనందున అందుకోసం మీ సాయుధ పోలీసులను కానీ, సిఆర్‌పిఎఫ్‌ను కానీ వాడుకోవాలని అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దర్బారా సింగ్‌కు చెప్పాను. రెండు రోజుల తర్వాత భింద్రన్‌వాలాను పట్టుకోవాలని, మర్నాడు తెల్లవారే లోగా ఆపరేషన్ పూర్తి చేసి నివేదిక పంపాలంటూ కేంద్రంనుంచి నాకు ఆదేశాలు అందాయి. అయితే మా దళాలు మెహతా చౌక్‌కు 30 మైళ్ల దూరంలో ఉన్నాయని నేను కేంద్రానికి నివేదిక పంపాను. పగటి పూట వ్యూహ రచన లేకుండా రాత్రిపూట ఆపరేషన్ కొనసాగించడం అంటే విచక్షణా రహితంగా కాల్పులకు, భారీ ఎత్తున ప్రాణ నష్టానికి దారి తీయవచ్చని తెలియజేసాను. అంతేకాకుండా పోలీసులు, పారా మిలటరీ బలగాలకు ఈ బాధ్యత అప్పగించాలని మరోసారి నేను సూచించాను. అయితే ఒక వేళ సైన్యమే ఈ పని చేయాలంటే తగిన సన్నద్దత తర్వాత మర్నాడు రాత్రి దాడి చేస్తామని చెప్పాను. ఇందిరాగాంధీ నా సిఫార్సును అంగీకరించి, అంతకు ముందు ఇచ్చిన ఉత్తర్వులను మార్చుకున్నారు.
గత ఏప్రిల్‌లో జంతర్‌మంతర్ వద్ద అన్నా హజారే దీక్ష ప్రారంభించినప్పటినుంచి మొదలుకొని మొన్న ఆయన దీక్ష విరమించడానికి ఒక రోజు ముందు దాకా కూడా ప్రభుత్వం ఘోరంగా తప్పులు చేసింది. బహుశా ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీని తప్పుదోవ పట్టించినట్లే అధికారులు ఇప్పుడు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి ఉండవచ్చు. నెహ్రూ, శాస్ర్తీ లాంటి గొప్ప వాళ్లున్న అధికార పార్టీ తప్పును ఢిల్లీ పోలీసులపైకి నెట్టివేయడం దారుణం. ప్రస్తుతానికి సమస్య పరిష్కారం అయింది కానీ మనం గతంనుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. అవినీతిపై పోరాటం దిశగా తొలి అడుగు వేసాము. అయితే ముఖస్తుతి ధోరణిని పూర్తిగా నిర్మూలించే దిశగా కృషిని మొదలు పెట్టాలి. రిటైరయిన అధికారికి ఏదయినా బాధ్యతలు అప్పగించే ముందు అమెరికాలోగా మూడేళ్ల విరామం ఉండాలి. మనిషిని సర్వ నాశనం చేసేది ఏమిటని ద్వాపర యుగంలో యక్షుడు అడిగితే శీల రాహిత్యమని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇప్పుడయితే ఆ ప్రశ్నకు ముఖస్తుతి అని సమాధానం వస్తుందేమో!
Source: Andrabhoomi

Reviewed by JAGARANA
on
9:45 AM
Rating:
No comments: