నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం - Vijaya Vipanchi
నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం
రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం
భారతదేశం మన జన్మ ప్రదేశం
భారత ఖండం ఒక అమృత భాండం
ఉత్తరాన ఉన్నతమౌ హిమగిరి శిఖరం
దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం
తూరుపు దిశ పొంగి పొరలె గంగా సంద్రం
పశ్చిమాన అనంతమై సింధు సముద్రం || భారతదేశం ||
ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం
రత్నగర్భ పేరు గన్న భారత దేశం
ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం
సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం || భారతదేశం ||
కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం
కొండకోన వాగు పాడు సంస్కృతి గీతం
గుండె గుండె కలుసుకుంటే సమరస భావం
చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం || భారతదేశం ||
నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం - Vijaya Vipanchi
Reviewed by JAGARANA
on
8:32 AM
Rating:
No comments: