Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

మతోన్మాదానికి మద్దతుదారులు..


ఈ సమస్య ఇప్పుడు ఐరోపా ఖండంలోనూ విస్తరిస్తున్నది. ఊచకోతకు తెగబడే ముందు అతను ఇంటర్నెట్‌లో ఉంచిన 1,500 పేజీల సవివరణ రాజకీయ ప్రకటనలో పలు అంశాలను వివరించాడు. మన దేశ గతాన్ని, వర్తమానాన్ని స్థూలంగా ప్రస్తావించాడు. ప్రస్తుతం మన దేశంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలను అతను చూచాయగా పేర్కొన్నాడే తప్ప, స్పష్టమైన వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, కాబట్టి అతని ఆలోచన సరళి మనపై ఎలాంటి ప్రభావం చూపదని వాదించేవారి సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చు. కానీ, ఇది కాకతాళీయంగా చేసిన ప్రస్తావన కాదనేది కొందరి వాదన. ఇస్లాం మతస్థులు పెరగడం వల్ల ఇతర మతాలు, తెగలకు ప్రమాదం పొంచివుందన్న బ్రెవిక్ సిద్ధాంతాన్ని హిందూ ధర్మ పరిరక్షణ కోరుకునే వారికి ఆపాదించడంలో కొన్ని ప్రసార మాధ్యమాలు సఫలమయ్యాయి.
హిందూ సనాతన ధర్మానికి, బ్రెవిక్ అభిప్రాయాలకూ ముడిపెట్టి, ‘కాషాయ తీవ్రవాదం’ ప్రబలుతున్నదని రాద్ధాంతం చేస్తున్నాయి. ఇస్లాం వ్యాప్తిని నిరోధించడానికి, హైందవ ధర్మ పరిరక్షణకు దాడులే మార్గమని కొన్ని హిందూ సంస్థలు ప్రయత్నిస్తున్నాయన్నది వీటి కథనం. బాంబులు తయారు చేసే పరిశ్రమగా ఆర్‌ఎస్‌ఎస్‌ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అభివర్ణిస్తే, కేంద్ర హోం మంత్రి చిదంబరం మరో అడుగు ముందుకేశారు. 2-జి స్పెక్ట్రమ్ ఉదంతంపై ఆందోళన చేస్తున్న బిజెపిపై కేంద్ర హోం మంత్రి చిదంబరం నిప్పులు చెరిగారు. ‘కాషాయ ఉగ్రవాదం’ అంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. బ్రెవిక్ ఉదాంతాన్ని దృష్టిలో ఉంచుకొని, మన దేశంలోనూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. నార్వే ఘటనను మన దేశానికి ముడిపెట్టడానికి సమాజంలోని ఒక వర్గం విశ్వప్రయత్నాలు చేస్తున్నది. అభూత కల్పనలతో హోరెత్తిస్తున్నది. కొన్ని టీవీ చానెళ్లు అదే పనిగా చర్చాకార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇస్లాం మత వ్యాప్తిని నిరోధించాలంటే ఎదురుదాడికి దిగి, ఊచకోత ఒక్కటే మార్గమన్న బ్రెవిక్ సిద్ధాంతాన్ని మన దేశంలో కొంత మంది వ్యక్తులు, సంస్థలు లేదా రాజకీయ పార్టీలు అమలు చేసే ప్రమాదం ఉందా? అన్న ప్రశ్నపై అభిప్రాయ సేకరణ ప్రారంభించాయి. ఈ పరిణామం విష సంస్కృతిని వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. ఇలాంటి కార్యక్రమాలను వీక్షించే వారు తేలిగ్గా తీసుకుంటే మంచిదేగానీ, లేకపోతే తీవ్ర పరిణామాలు తలెత్తడం ఖాయం. మాలేగావ్ బాంబు పేలుళ్లలో సాధ్వీప్రజ్ఞ, కల్నల్ పురోహిత్ హస్తం ఉన్నట్టు వార్తలు వచ్చినప్పుడే మన దేశంలో మితవాదం రూపాంతరం చెందుతున్నట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మక్కా మసీద్, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లలో బాంబు పేలుళ్లపై స్వామి అసీమానంద ఇచ్చిన వాంగ్మూలం కూడా ఇదే కోవకు చెందుతుంది. ఈ పరిణామాలకు దేశంలో భద్రతాపరమైన వైఫల్యాలే కారణం కావచ్చు. లేదా పెరుగుతున్న ఇస్లామిక్ ఆత్మాహుతి దాడుల పర్యవసానమై ఉండవచ్చు. వికీలీక్స్ భైటపెట్టిన అమెరికా రాయబార కార్యాలయ నివేదికలను అనుసరించి దేశ భద్రతకు, సమగ్రతకు ఇస్లామిక్ తీవ్రవాదం కంటే కాషాయ బీభత్సవాదమే అత్యంత ప్రమాదకరమని రాహుల్ గాంధీ వంటి పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. 26/11 ముంబయి దాడుల సంఘటనలో అజ్మల్ అమీర్ కసబ్ పట్టుబడకుండా ఉంటే, అదే ఘటనపై ఎన్ని వాదోపవాదాలు చెలరేగేవో. రాజకీయ పార్టీలు ఎన్ని రకాల ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునేవో. ముంబయి దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, వాటిని పక్కకుపెట్టి, కాషాయ ఉగ్రవాదం అంటూ కొత్త సమస్యను తెరపైకి తెచ్చి, విస్తృత ప్రచారం కల్పించేవారేమో? ఇస్లామిక్ వ్యతిరేక మితవాదం కూడా ఒక్కోసారి దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది. టెడ్ కజిన్‌స్కీ ఉదంతం.. ఒక్లాహొమా బాంబర్ తిమోతీ మెక్‌వేగ్ 168 మంది ప్రజల ప్రాణాలను హరించడం.. , తాజాగా నార్వేలో బ్రెవిక్ మారణహోమం.. ఏఘటనను తీసుకున్నా, ఇస్లాం వ్యతిరేక ఆలోచనా సరళి తీవ్ర పరిణామాలను సృష్టిస్తుందని స్పష్టం చేస్తుంది. గత నెల జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ముంబయి పోలీసులు చేపట్టిన విచారణ విధానాన్ని అభినందించాలి. దాడులు ఇస్లామిక్ బీభత్సకారులు చేసి ఉండవచ్చు లేదా ఇస్లామిక్ వ్యతిరేకవాదుల కుట్ర కావచ్చన్న భిన్న కోణాల్లో విచారణను కొనసాగిస్తున్నారు. అయితే, కఠిన తరమైన నిష్పాక్షిక విచారణకు ముందే ఒక అభిప్రాయానికి రావడం మంచిది కాదు. పశ్చిమ దేశాల్లో చోటు చేసుకున్న ఘటనలను, గణాంకాలను పరిశీలిస్తే ఇస్లామిక్ బీభత్సవాదమే సమాజానికి సవాలుగా మారిందని అర్థమవుతుంది. గత దశాబ్దకాలంలో క్రిస్టియన్, శే్వత జాత్యహంకారుల చేతిలో 200 మంది మృతి చెందారు. ఇస్లామిక్ బీభత్సకారులు నాలుగు వేల మందికిపైకా అమాయకుల ప్రాణాలను హరించారు. ఐరోపాలో ఇస్లామిక్ మతవాద బీభత్సకారుల దాడులకు యునైటెడ్ కింగ్‌డమ్ ఎక్కువగా నష్టపోయింది. అక్కడ ఇస్లామిక్ వ్యతిరేక మితవాద కూటమి దాడులకు తెగబడినట్టుఋజువైన ఘటనలు చాలా తక్కువ. పది మందిని మాత్రమే కోర్టు దోషులుగా ప్రకటించింది. ఇస్లామిక్ బీభత్సకారులు 138 మంది దోషులుగా తేలారు.
ఈ రకమైన పోలికను చెప్పడానికి మన దేశంలో సరైన గణాంకాలు లేవు. చాలా కేసుల్లో విచారణ కొనసాగుతున్నదే తప్ప తీర్పులు ప్రకటించలేదు. దర్యాప్తులు , విచారణ పద్ధతులలోని లోపాలు ఇక్కడి సమాజానికి ఉన్న సహనం, క్షమాగుణం చాలా ఘటనల్లో దోషులకు శిక్ష పడకుండా చేస్తున్నాయి. నిఘా సంస్థల ఉదాసీనత కూడా దీనికి తోడైంది. బీభత్సకాండను కూకటి వేళ్లతో పెకళించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాడుల ఘటన లపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నప్పటికీ, పాటించాల్సిన విధానాలపై ఏకాభిప్రాయం రావడం లేదు. ఇస్లాం మత వ్యాప్తి, బీభత్సకాండ సమాజాన్ని ప్రమాదం అంచుల్లోకి నెడుతున్నదని చాలా మంది యూరోపియన్ల అభిప్రాయం. ఐరోపాకు వలస వెళ్లిన వారిని బలవంతంగా క్రిస్టియన్లుగా మారుస్తున్నారని, వారి జీవన సరళిని కూడా మార్చేస్తున్నారని ఇస్లాం మతవాదుల నమ్మకం. ఎవరి అభిప్రాయాలు, వాదనలు, నమ్మకాలు వారివి. అయితే, మతం పేరుతో విధ్వంసాలు సృష్టించడం, దాడులకు తెగబడడం, మారణకాండకు పూనుకోవడం క్షంతవ్యం కాదు. అన్ని మతాల పట్ల సమన్యాయం జరుగుతున్నదా లేదా అని బేరీజు వేసుకోవడానికి కొలమానం అంటూ ఏదీ లేదు. ఉదాత్తమ అంశాల నుంచి తిరస్కరణకు గురైన భావనల వరకూ ప్రతి అంశాన్నీ మూలాల్లోకి వెళ్లి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇదొక మహా ఉద్యమంగా మారాలి. మత వ్ఢ్యౌన్ని నరనరాన జీర్ణించుకున్న కొంతమంది కారణంగా సమాజం మొత్తం సమస్యల్లో చిక్కుకునే పరిస్థితులను నివారించాలి. పక్షపాత వైఖరి లేకుండా, మతం పేరుతో దాడులకు దిగే ప్రతి ఒక్కరిపైనా కఠినంగా వ్యవహరించాలి. మారణకాండలను నివారించాలి
మతోన్మాదానికి మద్దతుదారులు.. Reviewed by JAGARANA on 2:23 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.