Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం - Vijaya Vipanchi




స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం
గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం
ఇహపరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం
ఆ లక్ష్యం చేరుదాక ఆగకుండ సాగుదాం

ఇనుపకండరాలు సంఘ శక్తినినుమడించగా
ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా
విలాసాల మత్తు వదిలి వివేకుని బాటనడిచి
స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం

దేవుడెక్కడ ఉన్నాడని నలుదిక్కుల శోధించే
దీనదళిత దు:ఖితులను దైవంగా దర్శించే
పంథాలెన్నున్నా మన గమ్యం ఒకటేనని
ప్రపంచానికందించే సందేశం ఇదేనని

ప్రతి హిందువు సోదరుడని సగర్వంగ ప్రకటించి
అన్నార్తుల అజ్ఞానుల కష్టాలను కడతీర్చే
జగతిలోన భరతమాత అధిదేవతగా నిలపి
హిందుత్వమె వసుధ లోన మార్గదర్శి కావాలని


Powerd by VijayaVipanchi.org
స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం - Vijaya Vipanchi Reviewed by JAGARANA on 11:47 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.